BigTV English

Taliban bans women’s voice: అక్కడ మహిళలు బహిరంగంగా మాట్లాడినా తప్పే

Taliban bans women’s voice: అక్కడ మహిళలు బహిరంగంగా మాట్లాడినా తప్పే

Taliban bans women’s voice bare faces in public women under new laws in Afghanistan: రానురానూ అక్కడ మహిళలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా పోతున్నాయి. చదువుకోవాలన్నా నేరమే..బహిరంగ ప్రదేశాలో బురఖా లేకుండా వచ్చిన నేరమే..ఇప్పుడు ఏకంగా మహిళలు బహిరంగంగా మాట్లాడకూడదని..పాటలు పాడకూదడని..పర పురుషులను చూడకూడదని మహిళా స్వేచ్ఛను కాలరాసే కొత్త చట్టాలను ప్రవేశపెట్టారు. ఆఫ్గనిస్తాన్ దేశంలో తాలిబాన్లు అధికారం చేపట్టినప్పటినుంచి అక్కడ మహిళలకు చిక్కులు వచ్చిపడుతునే ఉన్నాయి. మూడు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలో తాలిబాన్లు ఇలాంటి హేయమైన చట్టాలు రూపొందించారు. కొద్దో గొప్పో స్వేచ్ఛను కూడా ఈ చట్టాలతో హరించేశారు.


ఆటవిక నిబంధనలు

కొత్త చట్టాలకు సంబంధించిన నిర్ణయాన్ని తాలిబాన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్ జాదా ప్రకటించారు.ఇకపై బహిరంగంగా మహిళలు ఎలాంటి సంభాషణలూ చేయకూడదని..మగవారితో మాట్లాడకూడదని..పైకి గొంతెత్తి పాడకూడదని కఠిన నిబంధనలు ప్రవేశపెట్టారు. ఆఫ్గనిస్తాన్ లో ఉండే ప్రతి ఒక్కరూ షరియా చట్టం తప్పనిసరిగా పాటించాలని అన్నారు. పైగా మహిళలు కురచ దుస్తులు ధరించరాదని, ఫ్యాషన్ డ్రెస్సులు వేయకూడదని కొత్త చట్టం అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ మహిళలను స్తంభానికి కట్టేసి వాళ్లను రాళ్లతో కొట్టిస్తామని..వారు చనిపోయేదాకా అలా రాళ్ల దెబ్బలు తింటూ చావాలని ఆదేశాలిచ్చారు. కాగా ప్రపంచ దేశాలతో సహా ఐక్యరాజ్య సమితి కూడా ఇలాంటి ఆటవిక నిబంధనల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


ప్రజలే తిరుగుబాటు చేస్తారు

ఇది కేవలం ఆఫ్గనిస్తాన్ దేశానికే కాదు ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరిస్తోంది. ఈ అధునాతన యుగంలో కూడా ఇలాంటి నిబంధనలు, శిక్షలు ఏమిటని ప్రపంచ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల ద్వారా దీనిని ఖండిస్తున్నారు నెటిజన్లు. ఇలాగే నియంతల్లా వ్యవహరిస్తే తాలిబన్లపై ప్రజలే తిరుగుబాటు చేస్తారని ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదని అందరూ తాలిబన్లపై ముక్తకంఠంతో వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×