BigTV English

Right To Disconnect: ‘ఆఫీసు బయట బాస్ ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదు’.. అక్కడ కొత్త చట్టం!

Right To Disconnect: ‘ఆఫీసు బయట బాస్ ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదు’.. అక్కడ కొత్త చట్టం!

Right To Disconnect| ఉద్యోగం చేసేవారిలో ఎక్కువ శాతం ప్రతిరోజు 8 నుంచి 9 గంటలు ఆఫీసులో పనిచేస్తారు. ఆ తరువాత ఇంటికి వెళ్లాక ఎప్పుడైనా బాస్ ఫోన్ చేసి ఆఫీసు గురించి మాట్లాడినా.. లేక ఇంకా పని చేయమని అడిగినా చిరాకు వస్తుంది. కోపంతో మనుసులో బాస్ ని తిట్టుకుంటూ ఉంటారు. భారతదేశంలో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోయినా విదేశాల్లో మాత్రం ఇది చాలా సీరియస్ అంశం. ఈ విషయంలో తాజాగా ఆస్ట్రేలియా (Australia) దేశంలో కొత్త చట్టం తీసుకువచ్చారు.


ఆస్ట్రేలియాలో ఆగస్టు 26 సోమవారం నుంచి కంపెనీలో పనిచేసే ఉద్యోగులు.. ఆఫీసు బయట బాసు కనిపించినా నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు. పని గంటలు పూర్తైన తరువాత బాసు చెప్పే ఆదేశాలను నిర్లక్ష్యం చేసే అధికారం ఉద్యోగులకు ఈ కొత్త చట్టం కల్పిస్తోంది.

Also Read: ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్


ఈ కొత్త చట్టానికి ఆస్ట్రేలియాలో ‘రైట్ టు డిస కనెక్ట్’ అని పేరు పెట్టారు. అంటే ఒకరితో దూరంగా ఉండే అధికారం అని అర్థం. ఆగస్టు 26 నుంచి ఆఫీసులో డ్యూటీ షిఫ్ట్ ముగిసిన తరువాత బాస్ కాల్ చేసి ఆదేశాలు ఇచ్చినా లేక బాస్ కాల్ చేసినా అసలు పట్టించుకోవాల్సన అవసరం ఉండదు. నిజానికి ఈ కొత్త చట్టం ఫిబ్రవరి నెలలోనే ఆమోదం పొందింది. ఈ చట్ట ప్రకారం.. డ్యూటీ పూర్తైన తరువాత బాస్ పనిచెప్పినా లేక ఏమైనా ఆదేశాలిచ్చినా ఆ బాస్ పై ఫిర్యాదు చేయవచ్చు.

ఆస్ట్రేలియా స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ కొత్త చట్టం ఆఫీసు పనివేళలు పూర్తైన తరువాత బాస్ ఆదేశాలు పాటించకూడదని భావించే ఉద్యోగులకు వారిపై కంపెనీ బాస్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పిస్తుంది. అయితే ఈ చట్టం మేనేజర్ స్థాయి ఉద్యోగులకు వర్తించదు. పైగా కంపెనీ, లేదా ఆఫీసులో ఏదైనా అత్యవసర సమస్య వచ్చిన సమయంలో కూడా ఈ చట్టం వర్తించదు.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

అయితే ఈ చట్టంపై చాలా కంపెనీ యజమానులు వ్యతిరేకించారు. ఇలాంటి చట్టం అమలు చేసేముందు సుదీర్ఘంగా అధ్యయనం చేయాలని అలా చేయకుండా తొందరపాటుతో చట్టాన్ని తీసుకొచ్చారని కంపెనీ యజానులు సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఉద్యోగులకు పనివేశల తరువాత మానసిక ప్రశాంతత కోసం తీసుకొచ్చిన ఈ చట్టం.. ఇంతకుముందే యూరోపియన్ దేశాల్లో అమలులో ఉంది. జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఆఫీసు వేళల తరువాత తమ ప్రొఫెషనల్ మొబైల్ నంబర్ స్విచాఫ్ చేసే హక్కు ఉద్యోగులకు ఉంటుంది.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×