BigTV English
Advertisement

Mumbai Heavy Rains| ముంబైలో భారీ వర్షాలతో రెడ్ అలర్ట్.. రెండో రోజూ స్కూళ్లు, కాలేజీలు బంద్

మంగళవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. వాతావరణ శాఖ రెడ్ అలర్డ్ జారీ చేసింది. ముంబై మునిసిపల్ కార్పొరేషన్.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్వయంగా ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రజలను కోరారు. వర్షం కారణంగా సభ్యులు రాకపోవడంతో మహారాష్ట్ర శాసనసభ ఉభయ సభలు వాయిదా పడ్డాయి

Mumbai Heavy Rains| ముంబైలో భారీ వర్షాలతో రెడ్ అలర్ట్.. రెండో రోజూ స్కూళ్లు, కాలేజీలు బంద్

Heavy rain in Mumbai live updates(Telugu flash news): భారీ వర్షాల కారణంగా ముంబై మహానగరం స్తంభించిపోయింది. ఎడతెగని వర్షాలు ముంబై, పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి, సబర్బన్ రైళ్లు, విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఒక్క ఏడాదిలో కురిసే 10 శాతం వర్షం.. ముంబైలో సోమవారం కేవలం ఆరు గంటల్లోనే కురిసింది. దీంతో సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది.


మంగళవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. వాతావరణ శాఖ రెడ్ అలర్డ్ జారీ చేసింది. ముంబై మునిసిపల్ కార్పొరేషన్.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్వయంగా ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రజలను కోరారు. వర్షం కారణంగా సభ్యులు రాకపోవడంతో మహారాష్ట్ర శాసనసభ ఉభయ సభలు వాయిదా పడ్డాయి.

Also Read: Rahul Gandhi Shankaracharya| రాహుల్ గాంధీకి శంకరాచార్య మద్దతు.. ‘హిందువులను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు’


మెట్రోపాలిస్‌లో వర్షం వల్ల షార్ట్ సర్క్యూట్ కావడంతో కాలిన గాయాలతో ఒక వృద్ధ మహిళ(72) మరణించింది. వర్షం కారణంగా సోమవారం ట్రాఫిక్ లో ఇరొక్కొని వాషనాలు కిలోమీటర్ల పొడవున నిలిచిపోయాయి. లోతట్లు ప్రాంతాల్లో నీటితో నిండిపోయిన వీధులు, ఇళ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: Mihir Shah Hit-and-Run Case| కారు ప్రమాదం తరువాత కొనఊపిరితో ఉన్న మహిళ హత్య.. డ్రైవర్ కూడా నిందితుడే!

వర్షం కారణంగా వరద నీళ్లు నిలిచిపోవడంతో ముంబైకి వెళ్లే అనేక ఔట్ స్టేషన్ రైళ్లు, లోకల్ రైళ్లు, పట్టాలపై నిలిచిపోవడంతో.. ప్రయాణీకులు అసౌకర్యానికి గురయ్యారు. విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. 50 విమానాలు రద్దయ్యాయి.

వర్షాల వల్ల ఇళ్లు, గోడలు కూలిపోవడం లాంటి పది సంఘటనలు జరిగాయని స్థానిక మీడియా తెలిపింది. అయితే ఈ ప్రమాదాల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

ముంబైలోని కుర్లా, ఘట్‌కోపర్ ప్రాంతాలలో.. మహారాష్ట్రలోని థానే, వసాయి (పాల్ఘర్), మహద్ (రాయ్‌గడ్), చిప్లున్ (రత్నగిరి), కొల్హాపూర్, సాంగ్లీ, సతారా, సింధుదుర్గ్‌లతో సహా ఇతర ప్రాంతాలలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని NDRF అధికార ప్రతినిధి తెలిపారు. మహారాష్ట్ర వర్షాలపై ముఖ్యమంత్రి అత్యవసర సమావేశాలు నిర్వహించి.. వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

Tags

Related News

New Aadhaar App: కొత్త ఆధార్ యాప్ వచ్చేసిందోచ్.. ఇకపై అన్నీ అందులోనే, ఆ భయం అవసరం లేదు

UP Lovers Incident: UPలో దారుణం.. లవర్‌ను గన్‌తో కాల్చి.. తర్వాత ప్రియుడు కూడా..

Bengaluru Central Jail: బెంగళూరు సెంట్రల్ జైలు.. ఖైదీలు ఓ రేంజ్‌లో పార్టీ, ఐసిస్ రిక్రూటర్ కూడా

Nara Lokesh: బీహార్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రస్తావన.. లోకేష్ కౌంటర్లు మామూలుగా లేవు

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Big Stories

×