BigTV English

Territorial of the Empire : ఏ సామ్రాజ్యం.. ఎంతెంత?

Territorial of the Empire : ఏ సామ్రాజ్యం.. ఎంతెంత?
British Empire

Territorial of the Empire : చరిత్ర పుటల్లోకి జారితే.. ఈ భూమ్మీద లెక్కలేనన్ని సామ్రాజ్యాలు, మరెందరో రాజుల ఉత్థాన పతనాలు కనిపిస్తాయి.బ్రిటిష్ ఎంపైర్ మానవ చరిత్రలోనే అతి సువిశాలమైనది. 1913లో 412 మిలియన్ల మంది.. అంటే నాటి ప్రపంచ జనాభాలో 23 శాతాన్ని బ్రిటన్లు ఏలారు.1920లో బ్రిటన్ సామ్రాజ్యం ఉచ్ఛస్థితికి చేరింది. 13.71 మిలియన్ చదరపు మైళ్ల మేర అది విస్తరించింది.


అంటే మొత్తం భూవిస్తీర్ణంలో దాదాపు నాలుగోవంతుకు ఇది సమానం. అందుకే బ్రిటన్ ఎంపైర్‌ను ‘రవి అస్తమించని సామ్రాజ్యం’గా పిలిచేవారు.బ్రిటన్ తర్వాత మంగోలుల సామ్రాజ్యం గురించి చెప్పుకోవాలి. 13, 14వ శతాబ్దాల్లో వారి పాలన అవిచ్ఛన్నంగా సాగింది.మంగోలియాలో ఆరంభమైన వారి రాజ్యం.. తూర్పు యూరప్‌, జపాన్ సముద్రం ఆపై భారత ఉపఖండం, పశ్చిమాసియా వరకు మంగోలుల పాలన విస్తరించింది.

మొత్తం మీద 9.27 మిలియన్ల చదరపు మైళ్ల భూమి వారి ఏలుబడిలో ఉంది.రష్యన్ ఎంపైర్‌ది మూడో స్థానం. 8.8 మిలియన్ల చదరపు మైళ్ల మేర వారి సామ్రాజ్యం విస్తరించింది.క్వింగ్ డైనాస్టీ 8.8 మిలియన్ చదరపు మైళ్లు, స్పానిష్ ఎంపైర్ 5.29, ఫ్రెంచ్ వలస సామ్రాజ్యం 4.44 మిలియన్ల చదరపు మైళ్ల మేర విస్తరించింది.ఇక అబాసిడ్ కాలిఫేట్, ఉమయాడ్ ఖలీఫా రాజ్యాలు 4.25 మిలియన్ల చదరపు మైళ్ల చొప్పున విస్తరించాయి.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×