BigTV English

Terrorist Acts in Russia: రష్యాలో ఉగ్రవాదులు.. చర్చిలు, యూదుల ప్రార్థనా మందిరాలే టార్గెట్!

Terrorist Acts in Russia: రష్యాలో ఉగ్రవాదులు.. చర్చిలు, యూదుల ప్రార్థనా మందిరాలే టార్గెట్!

Terrorist Acts in Russia: రష్యాలో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. దక్షిణ ప్రావిన్స్ డాగేస్తాన్‌లో దారుణానికి ఒడడిగట్టారు. చర్చిలు, యూదుల ప్రార్థనా మందిరాలు, పోలీసు అధికారులే లక్ష్యంగా చేసుకొని అధునాతన ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 15మందికి పైగా మృతి చెందారని ఆ ప్రాంత గవర్నర్ వెల్లడించారు. ఇందులో తొమ్మిదిమంది పోలీసులు, ఒక ప్రీస్ట్, సెక్యూరిటీ గార్డుతోపాటు పలువురు పౌరులు ఉన్నారు. ఈ దాడిలో చాలామంది గాయపడ్డారు.


దాడి చేసిన ముష్కరులపై రష్యా భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపింది. ఇందులో ఆరుగురిని పోలీసు బృందాలు మట్టుబెట్టాయి. రష్యాలోని దక్షిణ కాకాస్ రిపబ్లిక్ అయిన డాగేస్తాన్‌లో జరిగిన దాడిలో మొదట ముష్కరులు దాడికి దిగినట్లు డాగేస్తాన్ పబ్లిక్ మానిటరింగ్ కమిషన్ కు చెందిన అధికారి షామిల్ ఖదుల్లేవ్ తెలిపారు.

చర్చిపై జరిగిన దాడిలో ఒక ఫాదర్ తోపాటు ఆరుగురు మృతి చెందారని ఫామిల్ తెలిపారు. చర్చిలో హత్యకు గురైన ఫాదర్ ను 66 ఏళ్ల నికోలాయ్ గా గుర్తించారు. ఇందులో చర్చికి రక్షణగా ఉన్న సెక్యూరిటీ గార్డును సైతం ముష్కరులు గన్‌తో కాల్చి చంపారు.


Also Read: సౌత్‌కొరియాలో విషాదం, లిథియం బ్యాటరీ కంపెనీలో పేలుడు, 22 మంది మృతి

డెర్బెంట్, ముఖచక్కల నగరాల్లో ఆర్థోడాక్స్ వేడుక అయిన పెండెకోస్ట్ ను నిర్వహిస్తుండగా.. కాల్పులు చోటుచేసుకున్నాయి. ముష్కరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు నిందితులను గుర్తించలేదు. గతంలోనై డాగేస్తాన్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. రెండు చర్చిలు, రెండు ప్రార్థనామందిరాలను లక్ష్యంగా చేసుకొని దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం యూదుల ప్రార్థనామందిరంలో మంటలు పెద్ద మొత్తంలో ఎగిసిపడుతున్నాయి. మొత్తం మూడు చోట్ల దాడులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో 12 మంది లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గాయపడినట్లు సమాచారం.

Also Read: వికీలీక్స్ ఫౌండర్ జులియన్ బిగ్ రిలీఫ్, యూకె జైలు నుంచి విడుదల..

ప్రతీకార దాడులు..
రష్యా భూభాగాలపై ఉక్రెయిన్.. డ్రోన్లు, క్షిపణులతో ప్రతీకార దాడులకు దిగింది ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. క్రిమియా ద్వీపకల్పలోని సెవస్టోపోల్ తీర పట్టణంపై ఉక్రెయిన్ ఐదు క్షిపణులను ప్రయోగించింది.

Tags

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×