BigTV English

The Floating Retreat: తేలియాడే టెంట్స్.. స్టే చేస్తే ఎక్స్‌పీరియన్స్ అదుర్స్

The Floating Retreat: తేలియాడే టెంట్స్.. స్టే చేస్తే ఎక్స్‌పీరియన్స్ అదుర్స్

The Floating Retreat: అడ్వెంచరస్ యాక్టివిటీస్‌కు, అద్భుతమైన కట్టడాలకు పుట్టినిల్లు దుబాయ్. ఆకాశాన్ని తాకే భవనాలను చూడాలన్నా.. అడ్వెంచరస్ యాక్టివిటీస్ చెయ్యాలన్నా దుబాయ్‌కు వెళ్లాల్సిందే. అక్కడ స్కై డైవింగ్ చేయాలని చాలా మంది కోరిక ఉంటుంది. విమానంలో నుంచి దూకి ఎడారి, ఎత్తైన భవనాలు, పామ్ జుమేరా చూస్తూ కిందకి ల్యాండ్ అవ్వడం అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. అలాగే హాట్ ఎయిర్‌బెలూన్ రైడ్, క్యామల్ రైడ్ వంటివి ఇక్కడ చాలా ఫేమస్.


ఇక ప్రపంచంలో ఎత్తైన భవనం కూడా ఇక్కడే ఉంది. అదే బుర్జు ఖలీఫా. మేఘాలను తాకుతున్నట్లుగా ఉంటుంది ఈ బిల్డింగ్. దుబాయ్ ఫ్రేమ్, బుర్జ్ ఖలీఫాలతో పాటు అక్కడ నిర్మించిన మరిన్ని కట్టడాలను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఇక వీటితో పాటు మరెన్నో కట్టడాలతో దుబాయ్ పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందుకే ప్రపంచంలో టూరిస్టుల తాకిడి అధికంగా ఉన్న దేశాల్లో దుబాయ్ మొదటిస్థానంలో ఉంటుంది.

ఇకపోతే రెండు కొండల మధ్య తేలియాడుతున్న టెంట్‌లో ఒకరోజంతా స్టే చేస్తే.. అంతకంటే అద్భుతమైన అడ్వెంచర్ ఇంకోటి ఉంటుందా.. ఇటువంటి టెంట్‌లకు సంబంధించిన ప్లాన్‌ను దుబాయ్‌కు చెందిన ఓ ఆర్టిటెక్చర్ కంపెనీ రూపొందించింది. ఆర్డ్ ఆర్కిటెక్చర్స్ అనే కంపెనీ ఈ ప్లాన్‌ను తయారు చేసింది. దానికి ఫ్లోటింగ్ రీట్రీట్ అనే పేరు పెట్టింది.


రెండు కొండల మధ్యలో తాళ్ల సాయంతో తేలియాడుతూ టెంట్లను ఏర్పాటు చేస్తారు. వాటిలోకి వెళ్లడానికి కొండ కింది భాగంలో లిఫ్ట్‌ను ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా టెంటుల్లోకి వెళ్లవచ్చు. తుఫాన్, ఈదురు గాలులు వంటివి వచ్చినప్పుడు కూడా తట్టుకునేలా దీనిని నిర్మించేందుకు ప్రాణాళికలు రూపొందించారు. అలాగే అందులో పనిచేసే ఉద్యోగులకు కూడా అత్యవసరమైన పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. త్వరలో ఈ హోటల్‌ను నిర్మించేందుకు దుబాయ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×