BigTV English

English Village : మబ్బుల్లో గ్రామం.. ఎక్కడో తెలుసా!

English Village : మబ్బుల్లో గ్రామం.. ఎక్కడో తెలుసా!
English Village

English Village : ప్రకృతి అందాలకు ఆ గ్రామం నెలవని పెద్దగా ఎవరికీ తెలియదు. మబ్బుల్లో తేలియాడుతున్నట్టు ఉంటుందా విలేజ్ లోకి అడుగుపెట్టగానే. ఎటు చూసినా మేఘాలు కనువిందు చేస్తాయి. సముద్రమట్టానికి 1094 మీటర్ల ఎత్తులో ఉంది నాన్‌క్రాంగ్(Nongjrong) గ్రామం. మేఘాలయ ఈస్ట్ ఖాసీ హిల్స్‌లోని ఈ విలేజ్‌లో అందరూ ఇంగ్లిష్‌లోనే మాట్లాడటం మరో విశేషం.


రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ – నాన్‌క్రాంగ్ మధ్య దూరం 60 కిలోమీటర్లే. ఇక్కడి 1140 మంది జనాభా ప్రాథమిక భాష ఆంగ్లమే. ఖాసీ కమ్యూనిటీకి చెందిన వారు ఖాసీ భాషలోనూ మాట్లడతారు. నాన్‌క్రాంగ్ లాండ్ స్కేప్ ఎంతో మెస్మరైజింగ్‌గా ఉంటుంది. ఉదయం వేళల్లో నాన్‌క్రాంగ్ వ్యాలీని మేఘాలు కప్పేస్తాయి.

లోయ దిగువన ఉంగాట్ నదీ గలగలలు, పచ్చటి తివాచీ పరిచినట్టుగా పచ్చికబయళ్లు పర్యాటకులను మైమరిపిస్తాయి. నాన్‌క్రాంగ్‌లో హిల్‌టాప్ వ్యూపాయింట్ ప్రధాన ఆకర్షణ. ఇక్కడ నుంచి సూర్యోదయాన్ని చూడటం ఓ మధురానుభూతి. మేఘాలయలో ఇతర పర్వత ప్రాంతాలకు మాదిరిగానే నాన్ క్రాంగ్‌ను వెండి మేఘాలు కప్పేస్తాయి.


బంగాళాఖాతంలో ఏర్పడే మబ్బులు ఇక్కడి కొండలను తాకి వర్షిస్తుంటాయి. దీనికి సమీపంలోని నాన్‌క్రాంగ్ జలపాతం మరో పెద్ద అట్రాక్షన్. వ్యవసాయం, పశుపోషణ ఇక్కడి ప్రజలకు జీవనాధారం. మంచి నీటి కోసం మాత్రం స్థానికులకు పాట్లు పడక తప్పదు. ప్రతిరోజూ కొండ దిగువకు వెళ్లి మగవాళ్లే పట్టుకొస్తారు.

షిల్లాంగ్ నుంచి ఈ గ్రామానికి చేరుకోవాలంటే రెండు గంటల ప్రయాణించాలి. లేదంటే గువాహటి నుంచి 144 కిలోమీటర్లు ట్రావెలర్స్‌లో 5 గంటలు ప్రయాణించి చేరుకోవచ్చు. డిసెంబర్-జనవరి నెలల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ గ్రామాన్ని విజిట్ చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్. అక్టోబర్ నుంచి మే నెల లోపు ఎప్పుడైనా సందర్శనకు అనువుగా ఉంటుంది. నాన్‌క్రాంగ్ సమీపంలోని గ్రామాల్లోనూ తిలకించాల్సిన ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×