BigTV English

Longest Flights : లాంగెస్ట్ ఫ్లయిట్ రూట్లు ఆ రెండే..!

Longest Flights : లాంగెస్ట్ ఫ్లయిట్ రూట్లు ఆ రెండే..!
Longest flights

Longest Flights : దూరాన్ని కాలంతో అధిగమించాలనే ఆరాటం మానవుల్లో అనాదిగా ఉంది. ఎక్కడికైనా ప్రయాణం పెట్టుకుంటే.. మధ్యలో ఎక్కడా స్టాప్ అన్నదే లేకుండా అతి తక్కువ సమయంలోనే నేరుగా గమ్యస్థానాన్ని చేరేందుకు తహతహలాడతాం. గగనమార్గాన కూడా అంతే. లేఓవర్లు ఉంటే సమయం వృథా. అందుకే లేఓవర్లు, బ్రేక్‌ల్లేకుండా సుదీర్ఘ విమానయానం చేసేందుకే అత్యధికులు మొగ్గుచూపుతున్నారు.


సింగపూర్-న్యూయార్క్ రూట్ ఇప్పటివ‌రకు అత్యంత సుదీర్ఘమైన వాయుమార్గం. ఆ రెండింటి మధ్య 15,425 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించేందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి 18.5 గంటల సమయం పడుతుంది. 2025లో దానిని అస్ట్రేలియన్ ఎయిర్‌లైన్ క్వాంటస్ తలదన్నేయనుంది. ప్రాజెక్ట్ సన్ రైజ్ పేరిట డైరెక్ట్ ఫ్లయిట్లను ప్రవేశపెడుతోంది. మధ్యలో ఎక్కడా ఆగకుండా సిడ్నీ-న్యూయార్క్(16,012 కిలోమీటర్లు), సిడ్నీ-లండన్(17,015 కిలోమీటర్లు) మధ్య విమానాలను నడపనుంది. ప్రపంచంలో ఇవే లాంగెస్ట్ ఫ్లయిట్లుగా రికార్డులకి ఎక్కనున్నాయి.

సిడ్నీ-లండన్ విమానం గమ్యస్థానానికి చేరుకునేందుకు 20 గంటల సమయం తీసుకుంటుంది. ఏవియేషన్ టెక్నాలజీ నానాటికీ పెరుగుతుండటంతో లాంగెస్ట్ ఫ్లయిట్ కాన్సెప్ట్ అచరణ సాధ్యం కాగలుగుతోంది. రీఫ్యూయలింగ్ అవసరం లేకుండానే సుదీర్ఘ విమానయానానికి కొత్త రూట్లను సృష్టించేందుకూ వీలు కలుగుతోంది.


లాంగ్ ఫ్లయిట్లలో బోర్ కొట్టకుండా పుష్టికరమైన ఆహారాన్ని అందజేయడంతో పాటు సుఖవంతమైన ప్రయాణానికి అనువుగా సీట్ల‌ను డిజైన్ చేస్తున్నారు. బిజినెస్ క్లాస్‌లోనే కాకుండా ఎకానమీ క్లాస్ లోనూ ఈ మార్పులొచ్చాయి. ప్రస్తుతం 17 గంటలకుపైగా ప్రయాణించి నేరుగా గమ్యస్థానానికి చేరే విమానాలు వివిధ రూట్లలో అందుబాటులో ఉన్నాయి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×