Trump and Putin: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరగబోయే.. హైలెవెల్ మీటింగ్‌కి కౌంట్ డౌన్ మొదలైపోయింది. ట్రంప్‌తో భేటీ తర్వాత.. యుక్రెయిన్‌తో యుద్ధం ఆపేస్తారా? తాను చెప్పాక కూడా పుతిన్ వినకపోతే.. ట్రంప్ ఏం చేస్తారు? అనేది.. వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. తమ భేటీ తర్వాత.. రష్యా ప్రెసిడెంట్ పుతిన్.. యుక్రెయిన్‌తో యుద్ధాన్ని గనక ఆపకపోతే.. అత్యంత తీవ్ర పరిణామాలుంటాయని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇద్దరి మధ్య మీటింగ్‌లో తేడా వస్తే సుంకాలు మరింత పెరుగుతాయిన చెప్పారు. అయితే ఉక్రెయిన్ తరఫున భూభాగం విషయంలోనే చర్చలుంటాయని స్పష్టం చేశారు.
ట్రంప్ తోలివిడుత అధ్యక్షుడిగా పని చేసినప్పుడు అతనితో 6 సార్టు భేటీ అయ్యారు. 2021లో ట్రంప్ దిగిపోయాకా పుతిన్ తో స్నేహపూర్వక సంబంధాలనే కొనసాగించారు. 2022 లో ఉక్రెయిన్ పై పుతిన్ యుద్ధం ప్రారంభించినప్పుడు ట్రంప్ సానుకూలంగా మాట్లడారు. శాంతిదూతల పుతిన్ ఉక్రెయిన్ కు వెళ్ళారని చెబుతూ ఉంటారు. ఉక్రెయిన్ కు అమెరికా మద్ధతవ్వడాన్ని 2024లో తన ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్ విమర్శించారు. తాను అధికారం చేపట్టిన 24 గంటల్లోనే యుద్దాన్ని ఆపిస్తానని ప్రకటించారు. అధికారం చేపట్టాక ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అప్పట్లో తాను సరదాగా అలా అన్నానని వివరణ ఇచ్చారు.
Also Read: గిద్దలూరు వైసీపీలో అయోమయం.. నాగార్జున ఫ్యూచర్ ఏంటి?
ఆసక్తి రేపుతున్న ఇద్దరు అగ్ర దేశాధినేతల భేటీ
రష్యా-యుక్రెయిన్ యుద్ధం విషయంలో.. ట్రంప్ చాలా క్లియర్‌గా ఉన్నారని.. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తెలిపారు. ఐరోపా నేతలతో ట్రంప్ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఇందులో.. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా పాల్గొన్నారు. ఈ వర్చువల్ మీట్‌కు సంబంధించిన వివరాలను.. మెక్రాన్ మీడియాకు వివరించారు. భవిష్యత్తులో.. ట్రంప్, పుతిన్, జెలెన్‌స్కీ మధ్య త్రైపాక్షిక సమావేశం జరగాలని.. ట్రంప్ బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే.. పుతిన్ మోసం చేస్తున్నారని.. జెలెన్ స్కీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మరి.. ట్రంప్‌తో భేటీ తర్వాత.. పుతిన్ యుద్ధం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది.