BigTV English

Trump Garbage Truck: చెత్త ట్రక్కులో ట్రంప్.. బైడెన్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్

Trump Garbage Truck: చెత్త ట్రక్కులో ట్రంప్.. బైడెన్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్

Trump Garbage Truck| అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ ని సమర్థించే వారు చెత్తతో సమానమని బైడెన్ చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటర్ ఇస్తూ.. పారిశుధ్య కార్మికుడి అవతారం ఎత్తాడు. గురువారం ఉదయం గ్రీన్ బే, విస్‌కాన్సిన్ ప్రాంతంలో ట్రంప్ తన బోయింగ్ 757 విమానంలో నుంచి దిగి పారిశుధ్య కార్మికుడి డ్రెస్ వేసుకొని ఒక చెత్త ట్రక్కులో తిరిగారు.


మరో అయిదు రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు ఉండగా రిపబ్లికన్ అభ్యర్థి అయిన ట్రంప్ తన ప్రచారం వేగవంతం చేశారు. అందులో భాగంగానే చెత్త ట్రక్కులో కూర్చొన పారిశుద్య కార్మికులు మద్దతు తనకే ఉందని మీడియాతో ప్రతినిధులకు చెప్పారు. ఇటీవల న్యూయార్క్ నగరంలో ట్రంప్ భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. అయితే ఆ ర్యాలీలో చివరగా అమెరికా హాస్య నటుడు హించ్ క్లిఫ్ వల్ల అపశృతి జరిగింది. అతను అమెరికాలో నివసించే లాటినో, ప్యూర్టో రీకా దేశస్తులను చెత్తతో సమానం అని వివాదాస్పదంగా మాట్లాడారు.

Also Read: మెక్ డొనాల్డ్స్ లో వంట చేసిన ట్రంప్!.. ఎన్నికల ప్రచారంలో కీలక ఓటర్లే టార్గెట్


హించ క్లిఫ్ వ్యాఖ్యలను ప్రెసిడెంట్ బైడెన్ విమర్శిస్తూ.. ట్రంప్ మద్దతుదారులంతా చెత్తతో సమానమని చెప్పారు. బైడెన్ చేసిన వ్యాఖ్యలకు తనకు అనుకూలంగా ట్రంప్ మలుచుకునేందుకు కొత్త ఎత్తు వేశారు. పారిశుద్య కార్మికుడి అవతారమెత్తి.. తన ప్రత్యర్థి కమలా హ్యారిస్ ను టార్గెట్ చేశారు. డెమోక్రాట్స్ కు పారిశుధ్య కార్మికులంటే చిన్నచూపు అని.. కానీ తనకు మాత్రం పారిశుధ్య కార్మికుడిగా పనిచేసేందుకు రెడీ అని చెప్పారు.

రియాలిటీ టీవీ షోలు చేసి నటనాభువం ఉన్న ట్రంప్ ఆరెంజ్, యెల్లో డ్రెస్ కోడ్ వేసుకొని అచ్చు పారిశుద్య కార్మికుడి అవతారంలో ట్రక్కులో కూర్చొని మీడియాతో మాట్లాడుతూ.. “నాకు పూర్టో రీకో అంటే చాలా ఇష్టం. ప్యూర్టో రీకో వాసులు కూడా నా వెంటే ఉన్నారు. నా చెత్త ట్రక్కు ఎలా ఉంది? కమలా హ్యారిస్, జో బైడెన్ నా కొత్త రూపం అంకితం చేస్తున్నాను.” అని ఎద్దేవా చేశారు.

ఇంతకుముందు కూడా ట్రంప్.. ఎన్నికల ప్రచారం కోసం పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఇలాగే ప్రచారం చేశారు. మెక్ డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లోకి వెళ్లి అక్కడ సిబ్బంది డ్రెస్ వేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు తయారు చేసి కస్టమర్లకు అందించారు.

అయితే ట్రంప్ ప్రత్యర్థి కమలా హ్యారిస్.. ప్రెసిడెంట్ జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించారు. “నేను అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడితే నేను అందరికీ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తా. నాకు ఓటు వేసిన వాళ్లకు.. వేయని వాళ్లకు నేను సమానంగా చూస్తాను.” అని ఆమె చెప్పారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×