BigTV English

Trump Mc Donalds: మెక్ డొనాల్డ్స్‌లో వంట చేసిన ట్రంప్.. అమెరికా ఎన్నికల్లో ‘ఇండియన్’ ఫార్ములా?

Trump Mc Donalds: మెక్ డొనాల్డ్స్‌లో వంట చేసిన ట్రంప్.. అమెరికా ఎన్నికల్లో ‘ఇండియన్’ ఫార్ములా?

Trump Mc Donalds| అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో వంటిమనిషి అవతారం ఎత్తాడు. ఆదివారం, అక్టోబర్ 20, 2024 అమెరికాలోని పెన్సిల్‌వేనియా రాష్ట్రంలో ఒక మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ లో ఆయన ఫ్రెంచ్ ఫ్రైస్ వండి అక్కడి కస్టమర్లకు సర్వ్ చేశారు. టేక్ అవే లో బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్లు పార్సిల్ అందించారు. ఇదంతా ఆయన ఎన్నికల ప్రచారం కోసం చేశారు. సాధారణంగా ఇలాంటివి ఇండియాలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రజలను, మీడియాను ఆకట్టుకోవడం కోసం మన రాజకీయ నేతలు ఎన్నో వేషాలు వేస్తారు. ఇప్పుడు ట్రంప్ చేస్తున్నది కూడా అలాగే ఉందని అంటున్నారు జనం.


అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు మరో రెండు వారాల్లో జరగబోతున్నాయి. దీంతో ట్రంప్‌నకు పోటీగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇద్దరూ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. అమెరికన్ మీడియా సర్వే ప్రకారం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వల్ప తేడాతో ముందంజ ఉండగా.. పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినా, మిచిగాన్, అరిజోనా, విస్కాన్సిన్, నెవాడా లాంటి రాష్ట్రాల్లో.. ఓటర్లు స్వింగ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కీలకమైన ఈ రాష్ట్రాల ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు రెండు పార్టీల అభ్యర్థులు శక్తి మేర కృషి చేస్తున్నారు. విన్నూత్నంగా ప్రచారం చేస్తున్నారు.

ట్రంప్, కమలా హ్యారిస్ ఇద్దరూ ఇటీవల పెన్సిల్‌వేనియా రాష్ట్రంలో తరుచూ పర్యటిస్తున్నారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్.. పెన్సిల్‌వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా నగరంలో బక్స్ కౌంటీలో ప్రచారం నిర్వహించారు. బక్స్ కౌంటీలోని ఫీస్టర్ విల్లె-ట్రెవోస్ ప్రాంతంలో ఉన్న మెక్ డొనాల్డ్స్ లో డొనాల్డ్ ట్రంప్ సందడి చేశారు. ఆయన మెక్ డొనాల్స్ వంట రూమ్ లో వెళ్లి వంటమనిషిలా బ్లాక్ అండ్ యెల్లో ఆప్రన్ కట్టుకున్నారు. ఆ వెంటనే ఫ్రెంచ్ ఫ్రైస్ వండుతూ కనిపించారు. టేక్ అవే, డ్రైవ్ త్రూలో వచ్చే కస్టమర్లకు సరదాగా పలకరించారు. ట్రంప్ టేక్ అవే లోని కిటికీలో నిలబడి బయట చూస్తూ ఉండగా.. ఆయనను చూడడానికి వచ్చిన బయట జనం బారులు తీరారు.


Also Read: ‘రోడ్డుపై ఉమ్మివేసే వారికి ఇలా చేయండి’.. స్వచ్ఛ భారత్ కోసం నితిన్ గడ్కరీ భలే ఐడియా..

మెక్ డొనాల్డ్స్ లో ట్రంప్ వంటి మనిషి అవతారమెత్తి మీడియాతో మాట్లాడారు. తన ప్రత్యర్థి కమలా హ్యారిస్ కంటే తాను 15 నిమిషాలు ఎక్కువ సేపు మెక్ డొనాల్డ్స్ లో పనిచేశానని జోక్ చేశారు. ”బయట నిలబడి ఉన్న ఆ జనం చూశారా?.. వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వారికి ఒక ఆశ, ధైర్యం కనిపిస్తోంది. వారంతా మార్పు కోరుకుంటున్నారు.” అని చెప్పారు.

మెక్ డొనాల్డ్స్ లో తన ప్రత్యర్థి కమలా హ్యారిస్ పనిచేసినట్లు అబద్ధం చెప్పిందని అన్నారు. ఇంతకుముందు కమలా హ్యారిస్ పెన్సిల్‌వేనియాలో ప్రచారం చేస్తూ.. తాను కాలేజీ రోజుల్లో మెక్ డొనాల్డ్స్ లో పనిచేశానని చెప్పారు. ఒకవైపు మాజీ అధ్యక్షుడు ట్రంప్ మెక్ డొనాల్డ్స్ లో సందడి చేయగా.. మరోవైపు కమలా హ్యారిస్ కూడా ఆదివారం పెన్సిల్‌వేనియాలో పర్యటించారు. ఆమె ఆదివారం రెండు చర్చులక వెళ్లి ప్రచారం చేశారు.

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024న జరుగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ పదవి కాలం జనవరిలో ముగియనుంది. ఎన్నికల్లో విదేశీ పాలసీలో భాగంగా అంతర్జాతీయ సమస్యలైన రష్య – ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం అంశాలతో పాటు, జాతీయంగా నిరుద్యోగం, దేశ ఆర్థిక సమస్యలు కీలకంగా మారాయి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×