BigTV English

Trump:నన్ను గెలిపిస్తే..వాళ్ల అంతు చూస్తా.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Trump:నన్ను గెలిపిస్తే..వాళ్ల అంతు చూస్తా.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Trump gave severe warning.. if he win.. will send them all to jail: నవంబర్ లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల లో గెలుపు ఎవరిదా అని యావత్ ప్రపంచం అసక్తిగా ఎదురుచూస్తోంది. రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ తరపున కమలా హ్యారిస్ హోరాహోరీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అందరూ ఊహించిన విధంగా కమలా హ్యారిస్ కు అమెరికాలో హిందువుల మద్దతు లభించడం కష్టంగా మారింది. అనూహ్యంగా ట్విస్ట్ ఇస్తూ డొనాల్డ్ ట్రంప్ కే ఓటేయాలని అమెరికన్ హిందువులకు అక్కడ అసోసియేషన్ ప్రకటించింది. డోనాల్డ్ ట్రంప్ అధికార పీఠం ఎక్కితేనే భారతీయులకు అక్కడ న్యాయం జరుగుతుందని..ఉద్యోగాలకు సైతం భరోసా ఉంటుందని వారు ఇండియన్స్ ను ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. కమలా హ్యారిస్ వస్తే అలాంటి పరిస్థితి ఉండదని..ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయని ప్రచారం చేస్తూ వస్తున్నారు.


హోరాహోరీ డిబేట్

సెప్టెంబర్ 10న కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య పబ్లిక్ డిబేట్ జరగనుంది. అధ్యక్ష ఎన్నికల ముందు జరిగే ఈ డిబేట్ అత్యంత కీలకమైనది. ఈ డిబేట్ లో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడం, వారిపై వచ్చే అవినీతి ఆరోపణలను నిరూపించుకోవడం, తమ వాగ్దాటితో ఎదుటివారిని మాట్లాడనీయకుండా చేయడం లాంటి అంశాలన్నీ ఎంతో ఆసక్తిగా ప్రజలు గమనిస్తారు. డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ ఇద్దరూ కూడా మంచి వక్తలే. వీరి మధ్య సాగే డిబేట్ రసవత్తరంగా సాగుతుందని అమెరికా రాజకీయ మేధావులు చెబుతున్నారు. గతంలో బైడెన్ కూడా ట్రంప్ తో పాల్గొన్న డిబేట్ లో తడబడ్డారు. దానితో ట్రంప్ బైడెన్ కు మతిమరుపు వచ్చిందని..అందుకే సరిగా మాట్లాడలేక పోయారని తీవ్ర విమర్శలు గుప్పించారు.


వెనక్కి తగ్గిన బైడెన్

ట్రంప్ విమర్శలతో డెమోక్రాటిక్ పార్టీ వర్గాలు కూడా ఆలోచనలో పడ్డాయి. దీనితో బైడెన్ ను అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేశాయి. ఎట్టకేలకు పార్టీ వర్గాల ఒత్తిడికి తలొగ్గిన బైడెన్ తాను అధ్యక్ష పోటీ బరి నుండి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నానని ప్రకటించడంతో డెమెక్రాటిక్ పార్టీ వర్గాలు కమలా హ్యారిస్ పేరును సూచించడం..ఆమెకు బైడెన్ మద్దతు లభించడం అన్నీ జరిగిపోయాయి. ఇప్పటికే అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ తన పనితనాన్ని చాటుకున్నారు. అయితే ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ..తాను గెలుస్తాననే ఆత్మవిశ్వాసంతో ఉన్నానని..తనని గెలిపిస్తే అవినీతి, అక్రమాలకు పాల్పడినవారిని ఎంతటి వారైనా శిక్షిస్తానని అన్నారు. వారిపై కేసులు కూడా నమోదు చేసి జైలుకు పంపుతామని ..ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో..అవి కనుక తేలితే వాళ్లను వెతికి మరీ పట్టుకుని శిక్షిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ వార్నింగ్

గత ఎన్నికలలో ట్రంప్ అక్రమాలకు పాల్పడ్డారన ఆరోపణలు ఎదుర్కున్నారు. అయితే అవేమీ నిరూపించలేకపోయాయి విపక్షాలు. దీనితో మరింత ఆత్మ విశ్వాసంతో ట్రంప్ ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఎప్పటికైనా విజయం తనదే అని..భారతీయుల వీసా విషయంలోనూ సానుకూలంగా ఉంటానని వాగ్దానాలు చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్స్ పట్ల కొందరు ఆందోళన పడుతున్నారు. నిజంగానే ట్రంప్ అధికారంలోకి వస్తే తమపై కక్ష పూరిత కేసులు పెడతారేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×