Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన డోనాల్డ్ ట్రంప్(Donald Trump).. తన కార్యవర్గ సభ్యుల్ని ఒక్కొక్కరిగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెరికా విద్యశాఖ(US Educational Ministry)కు నాయకత్వం వహించేందుకు 76 ఏళ్ల లిండా మెక్ మాన్ (Linda McMahon)ను నామినేట్ చేశారు. ట్రంప్, లిండ్, ఆమె భర్త విన్స్ మెక్ మాన్ (Vince McMahon) తో చాన్నాళ్లుగా పరిచయం ఉంది. అయితే.. ఒకప్పుడు వీరు ప్రత్యర్థులు అన్న సంగతి తెలుసా.? అవును.. ఎడ్యుకేషన్ ఛీప్ గా ఎంపికైన లిండా భర్త, ట్రంప్.. ప్రత్యర్థులు. అయితే రాజకీయాల్లో కాదులేంటి. వాళ్లు.. WWE ఛాంపియన్ రింగులో పోరాడిన ప్రత్యర్థులు. అవును.. వీరిద్దరు వాల్డ్ ఫేమస్ WWE లో పోటీపడ్డారు. అంతే కాదండోయ్.. అక్కడ ఓడిపోయారంటూ వీరిలో ఒకరికి రింగులోనే గుండు కొట్టించారు. మరి.. ఎవరు వారు, ఏం జరిగిందో మీరు చదివేయండి.
లిండా డబ్య్లూడబ్ల్యూఈ (wwe) ఛాంపియన్ సీఈవో గా పనిచేశారు. ఆ సమయంలో అమెరికాలోనే ప్రముఖ వ్యాపారవేత్త(Businessman) గా ఉన్న ట్రంప్ ఈ పోటీలకు స్పాన్సర్ షిప్ అందించాడు. 1980ల చివరలో అట్లాంటిక్ సిటీ, న్యూజెర్సీలోని ట్రంప్ ప్లాజాలో నిర్వహించిన డబ్య్లూడబ్ల్యూఈ (wwe) పోటీలు ట్రంప్ జీవితంలో అత్యంత గుర్తుండిపోయే క్షణాలుగా చెబుతుంటారు. అక్కడి డబ్య్లూడబ్ల్యూఈ (wwe) రెసిల్ మేనియా-4 , రెసిల్ మేనియా-5 లను ట్రంప్ స్పాన్సర్ చేశారు. 2007లో రెసిల్ మేనియా పోటీల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
పోటీల్లో భాగంగా నిర్వహించిన ‘బిలియనీర్స్ యుద్ధం (Battle of Billionaires) ట్రంప్ లోని అల్లరితనాన్ని, అతనిలోని ఉత్సుకత, ఆటలను సైతం ఆస్వాదించేతత్వాన్ని బయటకు తెలియజేశాయి. రింగులో పోటీదారుల మధ్య ఆసక్తికర పోటీ జరగా.. ట్రంప్ ఓ వైపు, విన్స్ మెక్ మాన్ మరోవైపు తలపడ్డారు. దాంతో.. ఈ ఇద్దరు బిలియనీర్లు వారి తరఫున బౌట్ లో తలపడేందుకు ఓ ప్రొఫెషనల్ రెజ్లర్‌ను ఎంచుకున్నారు. అప్పుడు ట్రంప్ తన తరఫున బాబీ లాష్లీని ఎంచుకోగా, మెక్‌మాన్ ఉమాగా ను తన తరఫున రింగులోకి దించాడు. అయితే.. కేవలం బౌట్ లో పోటీనే కాకుండా.. మరింత ఆసక్తి కలిగించేందుకు.. ఎవరి ప్రతినిధి అయితే ఓడిపోతారో.. ఆ బిలియనీర్ స్టేజీ మీదే గుండు కొట్టించుకోవాలని పందెం వేసుకున్నారు. అందుకు ఇద్దరు బిలియనీర్లు అంగీకరించండంతో ఆటపై ఆసక్తి మరింత పెరిగిపోయింది.
రింగ్‌లో హెవీ లిఫ్టింగ్ రెజ్లర్లు పోటీలో ఉన్నా.. అరవైలలో ఉన్న ట్రంప్, మెక్‌మాన్ ఇద్దరూ.. రింగు బయటి నుంచి ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి మద్ధతుదారుల్ని పోత్సహిస్తూ, పోటీలను మరింత హైలెట్ చేశారు. అత్యంత ఉత్కంఠగా సాగిన పోటీల్లో చివరికి.. లాష్లే గెలుపొందడంతో ట్రంప్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాంతో.. విన్స్ మెక్‌మాన్ వేదికపైనే గుండు కొట్టించుకోవాల్సి వచ్చింది. అలా.. US అధ్యక్షుడయ్యే వ్యక్తితో.. విద్యాశాఖకు నాయకత్వం వహించనున్న వ్యక్తి భర్త గుండు కొట్టించుకోవాల్సి వచ్చింది.
Also Read : ఆహారం, మందులు నిల్వ చేసుకోండి.. ప్రజలకు ఆ దేశాలు సూచన.. మూడో ప్రపంచ యుద్ధం పక్కా?
ట్రంప్-మెక్‌మాన్ షోడౌన్ WWE 23వ ఎడిషన్‌లోనే హైలైట్ గా నిలిచింది. ఈ సీజన్ ను చాలా మంది చూశారు. ఫోర్డ్ ఫీల్డ్‌లో రికార్డు స్థాయిలో 80,103 మంది అభిమానులను ఆకర్షించింది. 2003లో మిచిగాన్ స్టేట్, కెంట్ మధ్య కాలేజ్ బాస్కెట్‌బౌల్‌లో పోటీల పేరిట ఉన్న 78,129 మంది వీక్షకుల రికార్డును ఈ షో అధిగమించింది.