Washington Hilton Hotel: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న హిల్టన్ హోటల్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ టీమ్‌పై ఓ వ్యక్తి కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నాయి సెక్యూరిటీ అధికారులు. హిల్టన్ హోటల్ అమెరికా అధ్యక్షులకు కలిసి రాలేదా? నాలుగు దశాబ్దాల కిందట ఇలాంటి ఘటన జరిగిందా? కొత్త కొత్త విషయాలు తెరపైకి వచ్చాయి.
హిల్టన్ హోటల్‌లో కాల్పుల ఘటన.. వెలుగులోకి కొత్త విషయాలు
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఫేమస్ హిల్టన్ హోటల్. ఈ పేరు చెప్పగానే అమెరికా అధ్యక్షులకు ఎక్కడో ఒక దగ్గర టెన్షన్ వెంటాడుతోంది. రాత్రి ‘వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్’ ఈవెంట్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఓ వ్యక్తి గన్‌తో కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది.
ఈ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం. సరిగ్గా నాలుగున్నర దశాబ్దాల కిందట ఇదే హోటల్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్‌పై హత్యాయత్నం జరిగింది. 1981 మార్చి 30న ఓ కార్యక్రమానికి ఆనాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ హిల్టన్ హోటల్‌కు వచ్చారు. అదే సమయంలో చొరబడిన జాన్ హింక్లీ జూనియర్ వ్యక్తి, సెకన్ల వ్యవధిలో రొనాల్డ్ రీగన్‌పై కాల్పులు జరిపాడు.
ఆయనతోపాటు నాటి ప్రెస్ సెక్రటరీ జేమ్స్ బ్రాడీ, మరో ముగ్గురు సిబ్బందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే సీక్రెట్ సర్వీస్ అధికారులు జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలిండంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ఘటనలో నిందితుడు జాన్ హింక్లీ జూనియర్‌ను అరెస్టు చేశారు. నిందితుడు మానసిక అనారోగ్యంతో కాల్పులు జరిపినట్లు గుర్తించి నిర్దోషిగా తేల్చింది న్యాయస్థానం.
నేడు ట్రంప్ నుంచి ఆనాటి రోనాల్డ్ రీగన్ వరకు
ఆ ఘటన నుంచి స్థానికులు హింక్లీ హిల్టన్ హోటల్ అని పిలుస్తారు. తాజాగా అదే హోటల్‌లో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పుల ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి సుమారు 8.40 గంటలకు ప్రధాన బాల్‌రూమ్ వెలుపల ఉన్న మాగ్నెటో మీటర్ల సమీపంలో కాల్పులు చెలరేగాయి. తుపాకీ కాల్పులు శబ్దం వినబడగానే ఆ ప్రాంగణంలో భయాందోళనలు మిన్నంటాయి.
కొద్ది క్షణాలకు అధ్యక్షుడు ట్రంప్, మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లను సురక్షిత ప్రాంతానికి తరలించారు భద్రతా అధికారులు. మార్కో రూబియో, రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్‌తో సహా క్యాబినెట్ సభ్యులను అక్కడి నుంచి మరొక ప్రాంతాలకు తరలించారు. కిందనే ఉండండి.. కిందకు వంగండి అనే మాటలు గట్టిగా వినిపించాయి.
ఆ తర్వాత సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయుధాలు పట్టుకుని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని చుట్టుముట్టారు. హాజరైనవారు ఇబ్బందిపడకుండా వెనుక ద్వారా ఆయనను వేదిక నుండి బయటకు తీసుకువెళ్లారు. ఈ ఘటనతో వాషింగ్టన్ హిల్టన్ బాల్‌రూమ్ నిశ్శబ్దంగా మారింది. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమం ఆతిథ్యం ఇస్తున్న వాషింగ్టన్ హిల్టన్ హోటల్ ప్రజల కోసం తెరిచే ఉంటుంది.
ALSO READ: ఇరాన్‌ను దెబ్బకొట్టిన ట్రంప్.. చర్చలకు నో, ఇరాన్ నాయకత్వంలో సంక్షోభమా?
ఇలాంటి ఫేమస్ సమావేశాలు జరిగినప్పుడు సాధారణ అతిథులు యధావిధిగా హోటల్‌లో తిరుగుతారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారికి బుల్లెట్ తగిలినా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల రక్షణ పొందారు. కాల్పులకు పాల్పడిన నిందితుడు కాలిఫోర్నియాలోని టోర్రాన్స్‌కు చెందిన 31 ఏళ్ల మాజీ ట్యూటర్ కోల్ టోమాస్ అలెన్.
అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి షాట్‌గన్, హ్యాండ్‌గన్‌తో సహా పలు ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. అమెరికా చరిత్రలో అత్యంత ఆందోళనకరమైన ఇద్దరు అధ్యక్షులపై కాల్పుల ఘటనకు వాషింగ్టన్ హిల్టన్ హోటల్ వేదికైంది. ఈ రెండు సంఘటనలు ఎగ్జిట్ మార్గానికి కొన్ని అడుగుల దూరంలో జరిగాయి.
JUST IN: Law enforcement, National Guard swarm the scene after shots were fired at the White House Correspondents' Dinner. pic.twitter.com/RhSXBqeE58
— Fox News (@FoxNews) April 26, 2026
Gotta say, with the entire DC press corps packed into one ballroom, I expected the WHCD shooting to be the most filmed event in human history… https://t.co/ldbjMb42ZY
— Mario Nawfal (@MarioNawfal) April 26, 2026
#BREAKING: Shots fired reportedly during White House Correspondents’ Dinner where US President Donald Trump and Vice President JD Vance was in attendance. The building had been evacuated after a mysterious security threat. pic.twitter.com/b4DXKEI4Za
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 26, 2026