Trump’s book Save America becomes Amazon best-seller just hours after release despite hefty price tag : నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. దాదాపు ఇరవై నాలుగు కోట్ల మందికి పైగా అమెరికన్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు. కమలాహేరిస్, ట్రంప్ నువ్వా నేనా అన్నట్లు ప్రచారం హోరెత్తిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ట్రంప్ తన ప్రచారంలో భాగంగా సేవ్ అమెరికా అనే పుస్తకాన్ని రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 3న ఈ పుస్తకాన్ని మాజీ అధ్యక్షుడు ట్రంప్ విడుదల చేశారు. అయితే పుస్తకం విడుదలైన కొద్ది గంటలకే అమెజాన్ లో టాప్ సెల్లింగ్ బుక్ గా దూసుకుపోతోంది. అయితే దీని ధర 92.06 డాలర్లు గా ప్రకటించారు. దీనిపై వచ్చే లాభాలను రిపబ్లికన్ పార్టీ కోసం ఖర్చు చేస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటిదాకా అమెజాన్ విడుదల చేసిన పుస్తకాలలో టాప్ సేల్స్ లో ట్రంప్ రాసిన బుక్ పదమూడవ స్థానం దక్కించుకుంది.
ఎన్నికల ప్రచారానికి:
అయితే ఈ పుస్తకంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనలు, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన విషయాలు..ట్రంప్ పై జరిపిన హత్యాప్రయత్నం తాలూకు ఫొటోలు , అలాగే ప్రపంచ అధ్యక్షులతో ట్రంప్ దిగిన ఫొటోలు అన్నీ కడా ఇందులో ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. అయితే ట్రంప్ ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ తాను అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నప్పటినుంచి రీసెంట్ ఎన్నికల ప్రచారం దాకా జరిగిన సంఘటనల తాలూకు ఫొటోలను, వాటి వివరాలను క్లుప్తంగా వివరించి పుస్తక రూపంలో ఇవ్వడం జరిగిందని..తప్పకుండా తమ అభిమానులను ఈ పుస్తకం అలరిస్తుందని చెబుతున్నారు. తనకు మధురానుభూతిని మిగిల్చిన ఫొటోలను, అనుభవాలను ఈ పుస్తకంలో రూపొందించానని ట్రూత్ సోషల్ పోస్ట్ లో ప్రమోట్ చేస్తున్నానని అన్నారు. అయితే డెమొక్రాటిక్ పార్టీకి చెందిన కమలా హ్యారిస్ వర్గం మాత్రం ట్రంప్ ప్రచారం చేసుకోవడానికే ఈ పుస్తకం రూపొందించారని..ఇందులో ఆయన గొప్పతనమే తప్ప వాస్తవాలను వక్రీకరించారని తీవ్ర విమర్శలు గుప్పించారు.
హ్యారిస్ ఆత్మవిశ్వాసం
భారతీయ ఓటర్లు కమలా హ్యారిస్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్రంప్ ను అధ్యక్షుడిగా చేస్తే తమ ఉద్యోగాలకు ముప్పు ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఎట్టకేటకు భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్ గెలిస్తేనే మేలని భావిస్తున్నారు. ఇదెలా ఉండగా కమలా హ్యారిస్ గెలిస్తే భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా కమలా హ్యారిస్ రికార్డును సృష్టించనున్నారు. ట్రంప్ మాత్రం పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కమలా హ్యారిస్ ని వ్యక్తిగతంగా నల్ల జాతికి చెందిన వారని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. జాతి వివక్ష మాటలతో ట్రంప్ భారతీయ ఓటర్లకు మరింత దూరమవుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. కమలా హ్యారిస్ కూడా మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. తాను గెలిస్తే అమెరికన్లకు ఏం చేయాలో క్లారిటీలో ఉన్నానంటున్నారు. తన మూలాలు భారతే అయినా తను మాత్రం పుట్టింది..పెరిగింది అంతా అమెరికాలోనే అంటున్నారు కమలా హ్యారిస్..