BigTV English

Trump – Biden : బైడెెన్‌కు ఆ సౌకర్యం అవసరం లేదు – మాజీలకిచ్చే మర్యాదను తొలగించిన ట్రంప్

Trump – Biden : బైడెెన్‌కు ఆ సౌకర్యం అవసరం లేదు – మాజీలకిచ్చే మర్యాదను తొలగించిన ట్రంప్

Trump – Biden : అమెరికా గత అధ్యక్షుడు జో బైడెన్ కు దేశ రహస్య సమాచారం తెలియాల్సిన అవసరం లేదని, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. జో బైడెన్ కు ఇప్పటి నుంచి రహస్య సమాచారాన్ని అందించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత అధ్యక్షులకున్న ప్రత్యేక అధికారాన్ని తొలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించి.. మరో చర్చలు తెరలేపారు. అయితే.. ఈ చర్యను ప్రతీకార చర్యగా బైడెన్ మద్ధతుదారులు ఆరోపిస్తున్నారు. ఇంటిలిజెన్స్ బ్రీఫింగ్ లను తెలుసుకోవడం దేశ అధ్యక్షు హోదాలో పని చేసిన వ్యక్తికి ఎంతో ముఖ్యమని అంటున్నారు. అయితే.. ట్రంప్ మాత్రం తన చర్యను సమర్థించుకుంటున్నారు. గతంలో తాను ఓడిపోయిన తర్వాత తనకు బ్రీఫింగ్ అందకుండా బైడెన్ ఆదేశించారని చెబుతున్నారు.


శుక్రవారం నాడు ట్రంప్ వినియోగించే ట్రూత్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో.. ఇకపై రహస్య సమాచారాన్ని జో బైడెన్ పొందాల్సిన అవసరం లేదు. అందుకే.. జో బైడెన్ భద్రతా అనుమతులను వెంటనే రద్దు చేస్తున్నామని, ఇకపై అతని రోజువారీ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్‌లను నిలిపివేస్తున్నాం అంటూ ట్రంప్ ప్రకటించారు. ఇంజిలిజెన్స్ బ్రీఫింగ్ అనేది మాజీ అమెరికా అధ్యక్షులకు అందించే ఓ మర్యాద. ఆయా విషయాల్లో వారి అనుభవాల్ని వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన సౌకర్యం. గతంలో ఎంతో మంది అధ్యక్షులు మారినప్పుడు ఈ విధానం అలాగే కొనసాగింది. కానీ.. తొలిసారి బైన్ పాలనలోనే నిలిచిపోయిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు.

2021లో అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన బైడెన్.. జాతీయ భద్రతపై వివరాలను తెలుసుకోకుండా ట్రంప్ ను నిరోధించాలని ఇంటెలిజెన్స్ కమ్యూనిటీకి సూచనలిచ్చారు. దీంతో.. ట్రంప్ నకు ఎలాంటి సమాచారం అందలేదు. అయితే.. అప్పుడు దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన మద్ధతుదారులు దేశంలో తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నారు. కాపిటల్ హిల్స్ పై దాడులకు సైతం తెగబడ్డారు. అలాంటి సమయాల్లో ట్రంప్ నకు రహస్య సమాచారం అందించడం మంచిది కాదని బైడెన్ భావించినట్లుగా చెబుతుంటారు. ఆ సమాచారాన్ని వినియోగించుకుని, ట్రంప్ మరింతగా తన మద్ధతుదారుల్ని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని బైడెన్ భావించినట్లుగా అధికారులు తెలుపుతున్నారు. అంతే కాదు.. ట్రంప్ చాలా విషయాలను ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పేస్తుంటారు. ఆయన చాలా సార్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంటారని బైడెన్ అభిప్రాయం. అందుకే.. ఇంటిలిజెన్స్ బ్రీఫింగ్ ను పూర్తిగా నిలిపివేశారు.


ఇదే విషయంపై బైడెన్ ను అప్పట్లో అమెరికా మీడియా ప్రశ్నించింది కూడా. ట్రంప్ బ్రీఫింగ్‌లు తీసుకుంటే ఏమవుతుందని, ఎందుకు నిలివేశారని ప్రశ్నించగా.. తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకోవడం ఇష్టం లేదన్నారు. ట్రంప్ అలాంటి సమాచారాన్ని పొందాలని తాను అనుకోవడం లేదని బైడెన్ వ్యాఖ్యానించారు. అతనికి నిఘా బ్రీఫింగ్ ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.

Also Read : అమ్మో.. వారంలో 6 వేల భూకంపాలు – వణికిపోతున్న ఆ దేశ ప్రజలు

ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్న ట్రంప్.. తనకు ఉన్న సౌకర్యాన్ని తీసేసినందుకే.. ఇప్పుడు బైడెన్ కు అలాంటి సౌకర్యాన్ని తీసేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే.. బైడెన్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆయనకు మతిమరుపు ఎక్కువైందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×