Telangana BJP: తెలంగాణలో రోజురోజుకీ బీజేపీ పట్టు సాధిస్తోంది. ఇతర పార్టీల కార్యకర్తలను భారీగా తమ పార్టీలోకి చేర్చుకుంటోంది. ఇప్పటికే గ్రామాల్లో బీజేేపీలోకి ఇతర పార్టీ కార్యకర్తలను చేర్చుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోదగ్గ స్థానాలను గెలుచుకోలేదు. బీజేపీ ఆ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కానీ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీ, అధికార పార్టీ కాంగ్రెస్ తో సమానమైన సీట్లను గెలుచుకుంది. బీజేపీ ఎనిమిది సీట్లను గెలుచుకుంది. కమలం పార్టీ ఎనిమిది స్థానాలు సాధించి ప్రజల మద్ధతు తమ వైపు ఉందని ప్రూఫ్ చేసుకుంది.
అయితే, ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఎన్నికలు జరగనున్న మూడు స్థానాలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం బీజేపీ కీలక సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. శాసన మండలి ఎన్నికలు జరిగే ఏడు ఉమ్మడి జిల్లాల్లో పార్టీ కీలక నేతలు అందరిన్నీ ఒక్క దగ్గరకు చేర్చి మూడు స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికల్లో పార్టీ సత్తాను చాటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపు సంకేతంతో ముందుకు దూసుకెళ్లాలని భావిస్తోంది. ఈ మూడు స్థానాలను కైవసం చేసుకోవడమే టార్గెట్ గా పని చేస్తున్న బీజేపీ ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. గెలుపు కోసం ఇప్పటికే బీజేపీ కీలక సమావేశాలు నిర్వహిస్తోంది.
మూడు ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తే.. ధైర్యంగా సర్పంచ్ ఎన్నికలకు వెళ్లొచ్చనే యోచనలో బీజేపీ ఉంది. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మల్క కొమురయ్య, నరోత్తం రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గోదావరి అంజి రెడ్డిని బరిలోకి దింపింది. కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఇప్పటికే కీలక మీటింగ్ లు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కీలక నేతలు, నాయకులు హాజరువుతున్నారు. సమావేశాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. పట్టభద్రులు, టీచర్లకు చేరువయ్యేలా ప్రణాళికలపై తెలంగాణ బీజేపీ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మండలాలు, నియోజకవర్గలు, జిల్లాల వారీగా ఇన్ ఛార్జీలను నియమించున్నట్లు సమాచారం.
Also Read: Delhi Next CM: ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఈయనే.. మాజీ సిఎం కుమారుడికి పగ్గాలు?
మహిళలు, విద్యావంతులను వివిధ విభాగాలుగా విభజించి ఆయా వర్గాలను ఆకర్షించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ కూడా త్వరలో రాబోతున్నందన అందరినీ ఒకే దగ్గర చేర్చేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వం, ఎన్నికల సంఘం వేగం చూసి సర్పంచ్ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ కవాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే పలు సార్లు బీజేపీ సమావేశాలు నిర్వహింది. బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎవీఎన్ రెడ్డి, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేదంర్, కాసం వెంకటేశ్వర్లు, మనోహర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్, తదితర కీలక నాయకులతో సమావేశాలను నిర్వహిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు చోట్ల క్లీన్ స్వీప్ చేసి.. ధైర్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బరిలో దిగేందుకు వ్యుహాలు రచిస్తోంది.