BigTV English

Uganda: అతనికి 12 మంది భార్యలు.. 102 మంది పిల్లలు..

Uganda: అతనికి 12 మంది భార్యలు.. 102 మంది పిల్లలు..

Uganda: ప్రస్తుత కాలంలో చాలా మంది ఇద్దరు పిల్లలను కనగానే… ఇక పిల్లలు వద్దు బాబోయ్ అంటున్నారు. మరికొందరైతే ఏకంగా ఒకరిని మాత్రమే కంటున్నారు. అయితే ఉగాండాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 12 మందిని వివాహం చేసుకొని 102 మంది పిల్లలకు జన్మనిచ్చాడు.


బుగిసాకు చెందిన ముసా హసహ్య అనే వ్యక్తి తన వంశాన్ని వృద్ధి చేసేందుకు 12 మందిని పెళ్లి చేసుకున్నాడు. తనకు 17 ఏళ్ల వయస్సులో 1972లో మొదటిసారి వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక బిడ్డ పుట్టాక ముసా మరో పెళ్లి చేసుకున్నాడు. అలా ఇప్పటి వరకు మొత్తం 12 మందిని పెళ్లి చేసుకొని 102 మందికి జన్మనిచ్చాడు.

ముసా తనకు ఉన్న రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చూసుకుంటూ వారిని పోషిస్తున్నాడు. అయితే వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో భార్యా, పిల్లలకు ఆహారం, దుస్తులు, నిత్యావసరాలు వంటివి సమకూర్చలేకపోతున్నాడట. దీంతో విసుగు చెందిన అతని ఇద్దరు భార్యలు తమ పిల్లలను తీసుకొని వెళ్లిపోయారట.


ఇక ముసా తన పిల్లల్లో చాలా మందిని గుర్తించలేడట. వారిని గుర్తించడానికి వారి తల్లుల సహాయం తీసుకుంటాడట. అతని చిన్న భార్య వయస్సు కంటే అతని మొదటి భార్య పిల్లల వయస్సు ఎక్కువ కావడం ఇంట్రెస్టింగ్ విషయం.

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×