BigTV English

Adani Shares Fall:ఎన్ఎస్ఈ చర్యలు.. అయినా ఆగని పతనం..

Adani Shares Fall:ఎన్ఎస్ఈ చర్యలు.. అయినా ఆగని పతనం..

Adani Shares Fall:హిండెన్‌బర్గ్‌ దెబ్బకు కుదేలవుతున్న అదానీ గ్రూప్ షేర్లలో షార్ట్ సెల్లింగ్‌ను అరికట్టేందుకు ఎన్ఎస్ఈ చర్యలు తీసుకున్నా… పతనం మాత్రం ఆగడం లేదు. శుక్రవారం కూడా అదానీ గ్రూపు కంపెనీల షేర్లు నేలచూపులే చూశాయి. ట్రేడింగ్ మొదలైన కాసేపటికే భారీగా నష్టపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు లోయర్ సర్క్యూట్‌ను తాకి… ఏడాది కనిష్టస్థాయి అయిన రూ.1,017కు చేరింది. అదానీ టోటల్ గ్యాస్ షేరు 5 శాతం నష్టంతో రూ.1,622కి పడింది. అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు 10 శాతం కుప్పకూలి 52 వారాల కనిష్టస్థాయి అయిన రూ.935కు చేరింది. అదానీ ట్రాన్స్‌మిషన్ షేరు కూడా 10 శాతం నష్టంతో 52 వారాల కనిష్ట స్థాయి అయిన రూ.1,396కు పడిపోయింది. ఇక అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ షేరు భారీగా నష్టపోయి ఓ దశలో 52 వారాల కనిష్ట స్థాయి అయిన రూ.395కు చేరినా… ఆ తర్వాత కాస్త కోలుకుంది. అదానీ పవర్ 5 శాతం నష్టంతో, అదానీ విల్మర్ 5 శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.


గ్రూపు కంపెనీల షేర్ల పతనంతో అదానీ సంపద కూడా అంతే వేగంగా కరిగిపోతోంది. జనవరి 17న 124 బిలియన్ డాలర్లుగా ఉన్న అదానీ సంపద… ఫిబ్రవరి 3వ తేదీకి, అంటే 18 రోజుల వ్యవధిలో 61 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే… షేర్ల పతనంతో సగానికి పైగా సంపదను కోల్పోయారు… అదానీ. దాంతో… ప్రపంచ కుబేరుల టాప్ 20 జాబితాలోనూ ఆయన పేరు లేకుండా పోయింది. అంతేకాదు… అదానీ కోల్పోయిన సంపద విలువ, ఇథియోపియా, కెన్యా దేశాల జీడీపీతో సమానమట. అదానీ గ్రూపు కంపెనీల్లో కొనసాగుతున్న అమ్మకాల వెల్లువను చూస్తుంటే… ఆయన ఆస్తి మరింత కరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

ChatGPT:చరిత్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా చాట్‌జీపీటీ!

Caller ID Feature: ట్రాయ్ ప్రపోజల్.. టెల్కోల పరేషాన్..


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×