BigTV English

Zelensky: ఉక్రెయిన్ కుప్పకూలదు.. సజీవంగా పోరాడుతుంది.. అమెరికా కాంగ్రెస్ లో జెలెన్‌స్కీ

Zelensky: ఉక్రెయిన్ కుప్పకూలదు.. సజీవంగా పోరాడుతుంది.. అమెరికా కాంగ్రెస్ లో జెలెన్‌స్కీ

Zelensky: రష్యా, ఉక్రెయిన్ వార్ తర్వాత కీలక పరిణామం. అమెరికాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పర్యటించారు. ఆ దేశ కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందజేసే నిధులు, ఆయుధాలు విరాళం కాదని.. అది పెట్టుబడితో సమానమని జెలెన్‌స్కీ అన్నారు. “మీ డబ్బు విరాళం కాదు.. ప్రపంచ భద్రత, ప్రజాస్వామ్యాలకు పెట్టుబడి. ఎన్ని కష్టాలు వచ్చిన ఉక్రెయిన్‌ కుప్పకూలదు. సజీవంగానే ఉండి పోరాడుతుంది. ప్రపంచం దృష్టిలో మేము రష్యాను ఓడించాము. శాంతి కోసం మేము చేస్తున్న ప్రయత్నాలకు బైడెన్‌ సహకరించారు.” అంటూ జెలెన్‌స్కీ ప్రసంగం సాగింది.


వైట్ హౌజ్ లో జో బైడెన్‌తో జెలెన్ స్కీ భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. రష్యాతో యుద్ధం ఎన్నాళ్లు కొనసాగినా.. ఉక్రెయిన్‌కు అమెరికా అండగా ఉంటుందని బైడెన్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌ ఎప్పటికీ ఒంటరిది కాదన్నారు. రెండు బిలియన్ డాలర్ల ప్యాకేజీని బైడెన్‌ మరోసారి ప్రస్తావించారు. యుద్ధం ఆపే ఉద్దేశం పుతిన్‌కు లేదని తప్పుబట్టారు.

ఎప్పటిలానే అమెరికా పర్యటనలోనూ జెలెన్‌స్కీ ఖాకీ స్వెట్‌షర్ట్‌నే ధరించారు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఆయన మిలిటరీ రంగు దుస్తులే వేసుకుంటున్నారు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×