Shortest Day of The Year:అవును. నిజమే. ఇవాళ త్వరగా చీకటి పడుతుంది. అది ఎంతగా అంటే సాధారణ రోజులకంటే గంటకుపైగా ముందుగానే సూర్యాస్తమయం అవుతుంది. అంటే ఇవాళ పగటి సమయం కేవలం 10 గంటల 40 నిమిషాలే అన్నమాట. సాధారణంగా అయితే పగటి సమయం 12 గంటలు ఉంటుంది. రోజులోని 24 గంటల్లో మరో 12 గంటలు రాత్రి ఉంటుంది. కానీ ఈరోజు పగటి సమయం తగ్గుతుంది. అటు రాత్రి సమయం పెరుగుతుంది. అయితే ఇదేమీ వింత కాదు. ఏటా జరిగే సాధారణ ప్రక్రియే అంటారు శాస్త్రవేత్తలు.
ప్రతి ఏడాది డిసెంబర్ 21 లేదా 22న షార్టెస్ట్ డే వస్తుంది. గత ఏడాది డిసెంబర్ 21న షార్టెస్ట్ డే వచ్చింది. ఈఏడాది డిసెంబర్ 22వ తేదీన అంటే ఈరోజు షార్టెస్ట్ డే వచ్చింది. ఖగోళంలో జరిగే మార్పుల వల్ల ఈ తేడా అనేది వస్తుందంటున్నారు ఉజ్జయిని జివాజీ అబ్జర్వేటరీ సైంటిస్టులు. దీనికి కారణం సూర్యుడు మకర రాశిలో ఉండడమే అని చెబుతున్నారు. ఈ రోజు తర్వాత సూర్యుడు ఉత్తరార్ధగోళం వైపునకు కదులుతుంటాడు. దీని ఫలితంగా భూమి ఉత్తర భాగంలోని దేశాలలో పగలు పొడవు క్రమంగా పెరుగుతుంది. అటు రాత్రి సమయం తగ్గడం మొదలవుతుంది. మరోవైపు దక్షిణార్థగోళంలోని దేశాల్లో సూర్యకాంతి చాలాకాలంపాటు భూమిపై ఉంటుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,
దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో దీన్ని అతిపెద్ద రోజుగా పిలుస్తారు. అందుకే ఇవాళ త్వరగా చీకటి పడినా భయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు, మేఘాలు కమ్ముకున్నప్పుడు త్వరగా చీకటిపడినట్లు అనిపిస్తుంది. నగరాల్లో ఇలాంటి పరిస్థితులు కామనే. ఎందుకంటే సిటీల్లోని పెద్ద పెద్ద బిల్డింగ్ లు దీనికి కారణమే. ఇక ఇవాళ నైట్ ఎక్కువ సేపు నిద్రను ఆస్వాదించాలనుకునేవారికి మాత్రం నిజంగా వరమే.