BigTV English

FPV Drones: జస్ట్ 40,000 రూపాయల డ్రోన్ తో.. 40 రష్యా ఎయిర్ క్రాఫ్ట్ లను కూల్చేసిన ఉక్రెయిన్

FPV Drones: జస్ట్ 40,000 రూపాయల డ్రోన్ తో.. 40 రష్యా ఎయిర్ క్రాఫ్ట్ లను కూల్చేసిన ఉక్రెయిన్

రష్యాపై ఉక్రెయిన్ చేసిన తాజా దాడి ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. చిన్న చిన్న డ్రోన్లతో రష్యాలో ఉక్రెయిన్ పెద్ద విధ్వంసాన్నే సృష్టించింది. డ్రోన్లు ఉపయోగించి యుద్ధ విమానాలను ధ్వంసం చేయడమంటే మాటలు కాదు. కోట్ల రూపాయల విలువైన యుద్ధ విమానాలను, కేవలం 40వేల రూపాయల విలువైన డ్రోన్లతో ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. ఈ విధ్వంసంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఉక్రెయిన్.


ఆ డ్రోన్లు ఏంటి..?
ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ల పేరు FPV డ్రోన్స్. FPV అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ అని అర్థం. అంటే ఆ డ్రోన్ ని ప్రయోగించిన వ్యక్తి అది ఎక్కడుంది, ఏం చేస్తుంది, డ్రోన్ ద్వారా మనం ఏ ప్రదేశాన్ని టార్గెట్ చేయొచ్చు.. ఇలా అన్ని వివరాలు తెరపై చూడవచ్చు. సహజంగా మనం వీడియో చిత్రీకరణకు ఉపయోగించే డ్రోన్ల ద్వారా అది ఏమేం చిత్రీకరిస్తుందో చూస్తుంటాం. కానీ సైన్యం ఉపయోగించే డ్రోన్లకు అలాంటి సౌకర్యం ఉండదు. వాటిలో ఆయుధ సామగ్రి ఉంటుంది కాబట్టి దాన్ని రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తాం కానీ, అది ఎక్కడుంది, ఏం చేస్తుందనేది మనకి దాదాపుగా తెలియదు. దీనికోసం మరో వ్యక్తి ఆ డ్రోన్ ఎక్కడుందో చూస్తుంటాడు. ఇలా ఇద్దరు వ్యక్తులు ఒక డ్రోన్ తో కుస్తీ పడాల్సి ఉంటుంది. కానీ FPV లో అనేక సౌకర్యాలున్నాయి. ఆ డ్రోన్ ని రిమోట్ తో ఆపరేట్ చేసే వ్యక్తి కెమెరా ద్వారా డ్రోన్ ఏం చేస్తుందో చూడగలడు. ప్రత్యేక గాగుల్స్ ద్వారా, లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా ఆ డ్రోన్ తీసే వీడియోను చూడగలరు. ఉక్రెయిన్ వాడిన డ్రోన్లు అన్నీ FPV మోడల్ కావడంతో దాడి చేయడం వారికి సులభంగా మారింది.

FPVలు ఎందుకోసం..?
ఖర్చు తక్కువ. దాడి చేసే సామర్థ్యం ఎక్కువ. అంతే కాదు, శత్రు దేశాలు వీటిని కనిపెట్టడం కూడా కష్టం. ఈ డ్రోన్ కాస్ట్ 500 డాలర్లు. అంటే మన కరెన్సీలో 42వేల రూపాయలన్నమాట. మిస్సైల్స్ తో పోల్చి చూస్తే వీటి ఖర్చు చాలా తక్కువ. అందుకే ఉక్రెయిన్ ఈ చవకైన FPV డ్రోన్లను వాడింది. రష్యాకు అతి పెద్ద నష్టం చేకూర్చింది. ఉక్రెయిన్ తోపాటు రష్యా కూడా యుద్ధంలో డ్రోన్లను ఎక్కువగా వాడుతోంది. దీనివల్ల యుద్ధానికి చేసే ఖర్చు తగ్గుతుంది. అదే సమయంలో ప్రాణ నష్టం కూడా తగ్గుతుంది. అందుకే డ్రోన్ దాడులు ఇటీవల బాగా పెరిగాయి. ఇజ్రాయెల్ దగ్గర “కామికేజ్” HAROP డ్రోన్‌లు ఉన్నాయి. ఇరాన్ వద్ద షాహెద్ డ్రోన్‌లు ఉన్నాయి.


ఉక్రెెయిన్ ఇటీవల రష్యన్ ట్యాంకుల్ని కూల్చేసింది. వీటికోసం FPV డ్రోన్లనే వాడారు. ఈ ఏడాది మార్చిలో ఆల్ ఉక్రేనియన్ అనే ప్రభుత్వ విభాగం వెయ్యి డ్రోన్లను తయారు చేసింది. ఈ ఏడాది ఉక్రెయిన్ 40 లక్షల డ్రోన్‌లను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రచించింది. వాస్తవానికి ఉక్రెయిన్ సహా అనేక ఇతర దేశాలు డ్రోన్ల తయారీకోసం చైనా చిప్ లపై ఆధారపడేవి. ఆ తర్వాత ఉక్రెయిన్ కూడా వాటిని తయారు చేయడం మొదలు పెట్టింది.

దాడి ఎలా..?
ఇక రష్యాపై దాడి కోసం ఉక్రెయిన్ ఏడాదిన్నరగా పథకం రచించింది. తన వద్ద ఉన్న FPV డ్రోన్లను దశల వారీగా రష్యాలోకి పంపించింది. వాటిని దాచి ఉంచేందుకు చెక్క ఇళ్లను ఉపయోగించింది. ఒక్కసారిగా చెక్క ఇళ్లపైనున్న తలుపులు తెరిచి ఆ డ్రోన్లను ఆకాశంలోకి పంపించారు, మూకుమ్మడిగా దాడి చేసి రష్యాలో వైమానిక స్థావరాలను నేలమట్టం చేశారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×