BigTV English

Health Coverage : హెల్త్ కవరేజిలో ఆ దేశం బెస్ట్

Health Coverage : హెల్త్ కవరేజిలో ఆ దేశం బెస్ట్

Health Coverage : ఆరోగ్యమే మహాభాగ్యం. ఆధునిక కాలంలో ఎప్పుడు ఏ వ్యాధులు చుట్టుముడతాయో తెలియని స్థితి. అదే ఆరోగ్యబీమా ఉంటే మనకో ధీమా. 194 దేశాల్లో హెల్త్ కవరేజ్ తీరుతెన్నులను ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)మదింపు చేసింది. పలు అంశాల ఆధారంగా యూనివర్సల్ హెల్త్ కవరేజి(UHC) సూచీని విడుదల చేసింది.


ఆ జాబితాలో కెనడా అత్యధిక స్కోర్‌తో అగ్రభాగాన నిలిచింది. ఆ దేశానికి వందకు 91 పాయింట్లు వచ్చాయి. ఐస్ లాండ్, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలకు 89 పాయింట్లు లభించాయి. 88 పాయింట్లతో యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, పోర్చుగల్ దేశాలు జాబితాకి ఎక్కాయి. నార్వే మాత్రం 87 పాయింట్లు దక్కించుకుంది.

హెల్త్ కవరేజీ సూచీలో దక్షిణ సూడాన్(34 పాయింట్లు), సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్(32), పపువా న్యూగినియా(30), చాద్(29), సోమాలియా(27) దేశాలు అట్టడుగున నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా హెల్త్ సర్వీసెస్ కవరేజి ట్రెండ్ పరిశీలిస్తే.. 2015 నుంచి పెద్దగా పురోగతి అన్నదే లేదు.


2019 వరకు నాలుగేళ్లలో మూడు ఇండెక్స్ పాయింట్లు మాత్రమే పెరిగి 68 వద్ద నిలిచిపోయింది. ఆ తర్వాత 2021 వరకు కూడా అదే సూచీ కొనసాగింది. అంటే అప్పటికి దాదాపు 4.5 బిలియన్ల మంది జనాభా పూర్తి స్థాయి కవరేజి లేకుండా ఉన్నట్టు లెక్క. మన దేశంలో 37% మంది మాత్రమే ఆరోగ్యబీమా చేయించుకో గలిగారు. ఎలాంటి కవరేజి లేని వారి సంఖ్య 40 కోట్ల వరకు ఉంది.

Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×