E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

అన్నికోణాల్లో ట్రంప్ సర్కార్.. అమెరికా పౌరసత్వం ఇక ఖరీదే, భారీగా ఫీజు పెంపు!

అన్నికోణాల్లో ట్రంప్ సర్కార్..  అమెరికా పౌరసత్వం ఇక ఖరీదే, భారీగా ఫీజు పెంపు!
Advertisement

America: ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ రూల్స్‌ను మరింత కఠినతరం చేయబోతోంది.  రాబోయే రోజుల్లో అమెరికా పౌరసత్వం మరింత ఖరీదుగా మారనుంది. ఎందుకంటే దరఖాస్తుల ఫీజులను అమాంతంగా పెంచేందుకు సిద్ధమైంది.  ఈ విషయమై అక్కడివారిలో అప్పుడే ఆందోళన మొదలైంది.

ఖరీదుగా మారనున్న అమెరికా పౌరసత్వం 

Advertisement

అమెరికాలో నివాసం ఉండాలనుకునేవారికి ట్రంప్ సర్కార్ ఝలక్ ఇవ్వబోతోంది. ఆ దేశ పౌరసత్వం పొందాలని భావిస్తున్న వారికి నిరాశ కలిగించే వార్త. ఎందుకంటే అమెరికా పౌరసత్వ దరఖాస్తు ఫీజులను భారీగా పెంచేందుకు కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదన అమలైతే యూఎస్ సిటిజన్‌షిప్ ఖరీదుగా మారనుంది. ఈ కొత్త నిబంధన కోసం ప్రజాభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది.

అమెరికాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ కొత్త ముసాయిదాను రూపొందించింది. దాని ప్రకారం అమెరికా పౌరసత్వ దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు అయ్యే ఖర్చులపై ఫోకస్ చేసింది. దరఖాస్తుల ఫైలింగ్ ఫీజులను దాదాపు 75 శాతం పెంచుతున్నట్లు పేర్కొంది. కఠినమైన స్క్రీనింగ్, భద్రతా తనిఖీలకు అయ్యే అదనపు వ్యయాన్ని ఈ ఫీజుల ద్వారా రాబట్టాలని ఆలోచన చేసింది.

Advertisement

భారీగా ఫీజులు పెంచేందుకు కసరత్తు మొదలు, ప్రజాభిప్రాయ సేకరణ

సక్రమ మార్గంలో వలసదారులు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకుంటే ప్రాసెసింగ్, వెట్టింగ్ ఖర్చులు భరించాలి. అంతేకాదు ఇప్పటివరకు ఉన్న పలు మినహాయింపులు కోల్పోయే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ దరఖాస్తు ఫైల్ చేయడానికి ఫీజు 760 డాలర్ల నుంచి 1330 డాలర్లకు పెరగనుంది. గతంలో 760 డాలర్లు అంటే సుమారు రూ. 72 వేలు ఫీజు ఉండేది.

ఇక ఆన్‌లైన్‌లో దరఖాస్తు అయితే 710 డాలర్ల నుంచి 1280 డాలర్లకు ఫీజు పెంచాలని ప్రతిపాదన చేసింది. కొత్త ఫీజులు అమల్లోకి వస్తే 75 శాతం మేరా వారిపై భారం పడనుంది. ఒకవేళ అప్లికేషన్‌ తిరస్కరణకు గురైతే దానిని తిరిగి పరిశీలించేందుకు ఖర్చుల మోత మోగనుంది. 830 డాలర్ల నుంచి 1475 డాలర్లకు పెంచబోతోంది. ప్రస్తుతం ప్రతిపాదిత నిబంధనలపై రెండునెలలపాటు ప్రజాభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది.

ALSO READ: భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్.. ఇక అమెరికాలో చదువు అంత ఈజీ కాదు..!

అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకోనుంది. అంతేకాదు దరఖాస్తుదారులకు ప్రస్తుతం ఇస్తున్న మినహాయింపులను తొలగించాలని ప్రతిపాదించింది. 400 శాతం లేక అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి రెడ్యూస్‌డ్‌ ఫీజ్‌ ఆప్షన్‌ తొలగించాలని సూచన చేసింది. కొత్త రూల్స్ వల్ల పౌరసత్వం పొందడానికి శాశ్వత నివాసితులు తమకున్న అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Related News

భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్.. ఇక అమెరికాలో చదువు అంత ఈజీ కాదు..!

ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 18 మంది మిస్సింగ్, 54 మందికి గాయాలు, ఎలా జరిగింది?

ట్రంప్‌కు ఇటలీ ప్రధాని మెలోనీ స్ట్రాంగ్ కౌంటర్.. మీ సంగతి చూసుకోవాలని సూచన, అసలేం జరిగింది?

ఇరాన్-అమెరికా యుద్ధం మొదలు.. హార్మూజ్‌ జలసంధి మూసివేత, ఇరాన్‌కు ట్రంప్ కొత్త అల్టిమేటం!

ఇరాన్-అమెరికా యుద్ధం క్లోజ్.. పారిస్ వేదికగా ఇరుదేశాల సంతకాలు, ఒప్పందంలోని కీలక అంశాలివే

నెతన్యాహుపై ప్రశంసలు కురిపించిన ట్రంప్.. ‘నేనే లేకపోతే ఇజ్రాయెల్ సర్వనాశనమయ్యేది’

సుందర్ పిచాయ్‌ కి షాక్.. ప్రసంగం మధ్యలో విద్యార్థుల వాకౌట్!

Big Stories

×