E-Paper
Advertisement

రణ్‌బీర్‌కు ముందు రాముడిగా ఫిక్స్ అయిన హీరోలు ఎవరంటే..!

రణ్‌బీర్‌కు ముందు రాముడిగా ఫిక్స్ అయిన హీరోలు ఎవరంటే..!
Advertisement

Ramayana Movies:వెండి తెరపైకి ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చి అలరించాయి. అయితే ఏ ముహూర్తాన మా సినిమా బడ్జెట్ ఏకంగా 4000 కోట్లంటూ నిర్మాత  నమిత్ మల్హోత్రా అనౌన్స్ చేశాడో కాని అప్పటి నుండి ఈ రణ్ బీర్ కపూర్ రామాయణం ఒక్కసారిగా హైలెట్ అయిపోయింది.ఇక తాజాగా సినిమా నుండి టీజర్ రావడంతో ఇక ఈ సినిమా పై ఎక్కడ లేని డిబేట్లు పెట్టేస్తున్నారు కూడా.అయితే ఇదే క్రమంలో రామాయణం ఆధారంగా కొన్ని సినిమాలు అనుకుని మొదలవకుండానే ఆగిపోగా, మరికొన్ని సినిమాలు మొదలవకుండానే వెనక్కి వెళ్ళిపోయాయి అంటూ కొన్ని సినిమాల గురించిన కొన్ని వార్తలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరింతకీ ఆ సినిమాలేంటో మనమూ చూసేద్దాం!

సల్మాన్ ఖాన్ రాముడిగా.. సినిమా మాత్రం 

90s లలో  సోహైల్ ఖాన్ రామాయణాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు. ఇందులో సల్మాన్ ఖాన్ శ్రీరాముడిగా, సోనాలి బింద్రే సీతగా నటించాల్సి ఉందట.అంతేకాదండోయ్ . ఈ సినిమా దాదాపు 40 శాతం షూటింగ్ కూడా పూర్తయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి కూడా. కానీ ఏమైందో ఏమో.. ఆ తర్వాత సినిమా పూర్తిగా ఆగిపోయింది. అసలు ఎందుకు నిలిచిపోయిందో ఇప్పటికీ అధికారికంగా ఎవరూ చెప్పకపోవడమే ఇక్కడ మ్యాజిక్.

అజయ్ దేవ్‌గణ్, కాజోల్ రామాయణ కూడా 

Advertisement

ఇక ఆ తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి కూడా రామాయణం ప్రకటించడంతో బాలీవుడ్‌లో పెద్ద చర్చ జరిగింది.ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ రాముడిగా, కాజోల్ సీతగా, రితేష్  దేశ్‌ముఖ్ లక్ష్మణుడిగా, ప్రకాశ్ రాజ్ రావణుడిగా నటిస్తారని వార్తలు వచ్చాయి.ఇక కాస్టింగ్ చూసి అభిమానులు ఫుల్ ఎగ్జైట్ అయ్యారు కూడా.మరో విజువల్ వండర్ ఆన్ ది వే అంటూ మురిసిపోయారు.కానీ భారీ బడ్జెట్, హీరోల డేట్స్ సమస్యల వల్ల ఈ సినిమా ప్లానింగ్ స్టేజ్ దాటలేకపోయింది బీ టౌన్ లో వినిపించే టాక్.

హృతిక్ రోషన్ కూడా రాముడిగా 

ఇక 2008లో సంజయ్ ఖాన్ ది లెజెండ్ ఆఫ్ రామా’ పేరుతో మరో భారీ ప్రాజెక్ట్ ప్రకటించాడు.ఇందులో హృతిక్ రోషన్ రాముడిగా, జాయెద్ ఖాన్ లక్ష్మణుడిగా, అమితాబ్ బచ్చన్ దశరథుడిగా నటించాల్సి ఉంది.ఇక అప్పట్లో దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్ కూడా అనుకున్నారట . పైగా మూడేళ్ల పాటు స్క్రిప్ట్‌పై పని చేశారు కూడా . విదేశీ రచయిత ఫరూఖ్ ధోండీ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.ఇంకేం సినిమా పక్కా అనుకున్నారు.కానీ ఫైనాన్షియల్ సమస్యలు రావడంతో సినిమా మొదలవకుండానే అటకెక్కింది.

నితీష్ తివారీ కూడా ఈ సినిమాకోసం దాదాపు 

Advertisement

ప్రస్తుతం తెరకెక్కుతున్న రామాయణ కూడా ఒక్క రోజులో మొదలైన ప్రాజెక్ట్ కాదు.దర్శకుడు నితీష్ తివారీ దాదాపు 2015 నుంచే ఈ సినిమాపై వర్క్ మొదలుపెట్టాడట . కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, రీసెర్చ్.. ఇలా దాదాపు 7 నుంచి 10 ఏళ్లు ఈ ఒక్క ప్రాజెక్ట్‌కే కేటాయించాడట నితీష్.ఇక మధ్యలో మహేష్ బాబు రాముడిగా నటిస్తారనే వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అయితే అప్పటి నిర్మాత మధు మంతెన ఆ వార్తలను ఖండించాడు. నటీనటుల ఎంపికపై తుది నిర్ణయం దర్శకుడిదేనని స్పష్టం చేశాడు.తర్వాత మధు మంతెన ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. నిర్మాత నమిత్ మల్హోత్రా  ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఇదిగో ఇలా ముందుకు తీసుకొచ్చారు.

also read :రణ్‌బీర్ కంటే ముందే రాముడిగా సల్మాన్.. కానీ చివరికి జరిగింది ఇదే!

రూ.4 వేల కోట్లతో వస్తున్న ఇండియాలోనే 

ఇప్పుడు ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందన్న సంగతి తెల్సిందే.రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు.ఇక మొదటి భాగం 2026 నవంబర్ 6న, రెండో భాగం 2027 దీపావళికిరిలీజ్ అవుతుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.ఇక దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 వేల స్క్రీన్‌లలో విడుదలయ్యే తొలి భారతీయ చిత్రాల్లో ఒకటి కాబోతుందని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట.చూడాలి దాదాపు పదేళ్ళు గా కష్ట పడుతున్న నితీష్ తివారి ఆ కష్టాన్ని తెరపైకి ఎలా తీసుకువస్తాడో !

Tags

Related News

విభిన్న గెటప్స్ లో శర్వానంద్.. ‘జార్జ్ క్రిష్’ నుండి ఫస్ట్ బూస్టర్ రిలీజ్!

ది ప్యారడైజ్ దెబ్బ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఇప్పుడైనా మార్పు వస్తుందా?

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

Big Stories

Advertisement
×