E-Paper
Advertisement

సంతకాలతో భయపెడుతున్న ట్రంప్.. ఈసారి రెండు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు.. భారతీయులకు ఊహించని షాక్

సంతకాలతో భయపెడుతున్న ట్రంప్.. ఈసారి రెండు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు.. భారతీయులకు ఊహించని షాక్
Advertisement

Trump Orders:  వలసదారుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దేశంలోకి వచ్చే విదేశీయుల పిల్లలకు లభించే హక్కులను పరిమితం చేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. దీనివల్ల భారతీయులకు ఊహించని షాక్. ట్రంప్ ఈ ఆర్డర్ తీసుకురావడం వెనుక ఏం జరిగింది?

 

కొంపముంచిన ట్రంప్ సంతకాలు

Advertisement

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. విదేశీయుల పిల్లలకు జన్మతః లభించే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజాన్ని నిషేధించడం ఈ ఉత్తర్వుల ప్రధాన ఉద్దేశం. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెనుక అసలు నిర్ణయం ఇదే. మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జూన్ 30న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా చేసుకున్నది. కంటిన్యూయింగ్ టు ప్రొటెక్ట్ ది మీనింగ్ అండ్ వాల్యూ ఆఫ్ అమెరికన్ సిటిజన్‌ షిప్ పేరుతో ఉంది.

Advertisement

 

ట్రంప్ ఫార్ములా వన్ షాట్.. టూ బర్డ్స్

 

చారిత్రక మినహాయింపులకు అనుగుణంగా కొన్నివర్గాల పిల్లలకు బర్త్‌ రైట్ సిటిజన్‌షిప్ వర్తించదని చెబుతోంది. ఆ లెక్కన తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోతే కష్టం. విదేశీ ప్రభుత్వ ఉద్యోగులైన రాయబారులు-కాన్సులేట్ సిబ్బంది మొదలైనవి. వాణిజ్య లావాదేవీల ద్వారా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ పొందే ప్రయత్నం. అమెరికా భూభాగంలో జన్మించినవారయితే పౌరసత్వం ఇవ్వకూడదని సూచిస్తుంది.

అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసాలు ఉన్నవారి పిల్లలు అమెరికాలో జన్మిస్తే, వారిని అమెరికన్లు అవుతారని నెల రోజుల కింద ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. విదేశీయుల పిల్లలకు పౌరసత్వం నిరాకరించాలనే ట్రంప్ ప్రయత్నాలను న్యాయస్థానం తీర్పుతో ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను క్షుణ్నంగా పరిశీలించిన ట్రంప్ ప్రభుత్వం.. మళ్లీ కొత్త ఉత్తర్వులు తీసుకొచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే అక్కడ భారతీయులకు పిల్లలకు సరికొత్త కష్టాలు మొదలుకానున్నాయి.

 

భారతీయులకు ఊహించని షాక్

 

ఇక రెండో సంతకం విషయానికి వద్దాం. అమెరికా పౌరసత్వం కల్పించాలనే లక్ష్యంతో చాలామంది గర్భిణులు డెలివరీ సమయం దగ్గర పడినప్పుడు అక్కడకు చేరుకుంటారు. అక్కడ పిల్లలు పుడితే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. 1868లో ఆమోదించిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం తల్లిదండ్రుల వీసా హోదాతో సంబంధం లేకుండా, అమెరికా గడ్డపై జన్మిస్తే ఆ పిల్లలకు పౌరసత్వం లభిస్తుంది. విదేశీ దౌత్యవేత్తలు, దేశంపై దురాక్రమణ దారుల పిల్లలకు ఇది వర్తించదు.

ALSO READ: ఏం గుండెరా వాడిది.. కిమ్ భార్యతోనే సెల్ఫీ.. షాకింగ్ వీడియో వైరల్!

చట్టంలోని లొసుగులను విదేశీయులు దుర్వినియోగం చేస్తున్నారని ట్రంప్ సర్కార్ భావించింది. అత్యధిక సంఖ్యలో విదేశీయులు బర్త్ టూరిజం పద్దతిని వాడుకుంటూ పౌరసత్వాన్ని పొందుతున్నారని గుర్తించింది. రాజ్యాంగ హక్కును అపహాస్యం చేయడమేనని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వం కూడదని ట్రంప్ గతంలో స్పష్టంచేశారు. ఈ రెండింటిపై చట్టాలు అమల్లోకి వస్తే అమెరికాలో ప్రతి ఏడాది జన్మించే దాదాపు 2.5 లక్షల మంది పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో అమెరికాలో ఉంటున్న విదేశీ కుటుంబాల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.

Related News

థాయ్‌లాండ్ స్కూల్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి-15 మందికి గాయాలు, నిందితుడు విద్యార్థే

ఏం గుండెరా వాడిది.. కిమ్ భార్యతోనే సెల్ఫీ.. షాకింగ్ వీడియో వైరల్!

20 నిమిషాల్లో 7 పేలుళ్లు.. దద్దరిల్లిన దుబాయ్‌ నగరం, ఎవరి పని?

ఎర్ర సముద్రంలో ఏం జరిగింది? భారత వాణిజ్య నౌకపై దాడి, ఇది ఎవరి పని?

భారత ఐటీ ఉద్యోగులకు ట్రంప్ బిగ్ షాక్.. వీసా పొడిగింపు పైనా ‘బాదుడే బాదుడు’!

రష్యా బీచ్‌పై డ్రోన్ దాడి.. 7 గురు మృతి, 40 మందికి గాయాలు

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

Big Stories

Advertisement
×