E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

తెలంగాణ సీపీఎం పార్టీలో మూడు ముక్కలాట.. తెరవెనుక ఉన్న ఆ కీలక నేత..?

తెలంగాణ సీపీఎం పార్టీలో మూడు ముక్కలాట.. తెరవెనుక ఉన్న ఆ కీలక నేత..?
Advertisement

CPM Crisis: స్వేచ్ఛ బ్యూరో: క్రమశిక్షణకు, ఒకే మాట.. ఒకే బాటకు మారుపేరైన మార్క్సిస్టు పార్టీ (సీపీఎం) తెలంగాణ విభాగంలో ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా గ్రూపు రాజకీయాలు ముసురుకున్నాయా? పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడరనే నమ్మకం సడలిపోతోందా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ అంతర్గత వర్గాలు. ప్రస్తుతం తెలంగాణ సీపీఎంలో నడుస్తున్న ‘మూడు’ముక్కలాట పార్టీని నడిసముద్రంలో ముంచేసేలా ఉందనే ఆందోళన కేడర్‌లో వ్యక్తమవుతోంది.

ఎవరి మాట వినాలి..?

ఒకరిది అధికారిక పదవి అయితే.. మరొకరిది తెరవెనుక పెత్తనం. ఇంకొకరిది పైస్థాయి నుంచి పెత్తనం! ఈ ముగ్గురు అగ్రనేతల మధ్య నలిగిపోతున్న కిందిస్థాయి కేడర్, అసలు తాము ఎవరి మాట వినాలో అర్థం కాక సతమతమవుతున్నారు. ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరైన ఈ ఎర్రజెండా పార్టీలో ఇప్పుడు నాయకత్వ వికేంద్రీకరణ కాస్తా ‘అధికార వికేంద్రీకరణ’గా మారి గందరగోళానికి దారితీస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర అవుతున్నా, జాన్ వెస్లీకి పూర్తిస్థాయి స్వేచ్ఛ దక్కడం లేదనే చర్చ జరుగుతోంది.

అధికారికంగా వెస్లీ.. అనధికారికంగా తమ్మినేని!

Advertisement

రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జాన్ వెస్లీ అధికారికంగా పార్టీ కార్యక్రమాలను నడిపించాల్సి ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో సీన్ చూస్తే అలా కనిపించడం లేదు. పార్టీపై పట్టు మాత్రం ఇంకా పాత నాయకత్వం చేతుల్లోనే ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత కారణాలతో తమ్మినేని వీరభద్రం కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, తెర వెనుక ఉండి చక్రం తిప్పుతున్నది ఆయనేనని పార్టీ వర్గాల్లో చర్చజరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి తమ్మినేని నుంచి క్లియరెన్స్ రావాల్సిందేనని, జాన్ వెస్లీ కేవలం ‘రబ్బర్ స్టాంప్’గా మారుతున్నారనే ప్రచారం జరుగుతుంది.

Also read: Bengaluru Triple Murder: ఆ ఫ్యామిలీలో చిచ్చు రేపిన సహజీవనం.. నో చెప్పినందుకు పేరెంట్స్-చెల్లిని

కుర్చీ ఒకరిది.. పెత్తనం మరొకరిది

Advertisement

రాష్ట్ర సీపీఎం చరిత్రలోనే తొలి దళిత కార్యదర్శిగా జాన్ వెస్లీకి పట్టం కట్టినా.. కీలక నిర్ణయాల్లో ఆయనకు ప్రాధాన్యం దక్కడం లేదని సమాచారం. పార్టీని నడపడానికి, నిరసనలు చేపట్టడానికి ఆర్థిక వనరుల సమీకరణ, ఫండ్స్ మేనేజ్మెంట్ విషయాల్లోనూ పట్టు దొరకడం లేదనే ప్రచారం జరుగుతుంది. “కుర్చీ ఒకరిది.. పెత్తనం మరొకరిది” అన్నట్లుగా సీపీఎం పార్టీలో జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. కొన్ని సందర్భాల్లో అధికారికంగా కార్యదర్శి హోదాలో వెస్లీ ఇచ్చే లైన్ ఒకలా ఉంటే, ఇటు తమ్మినేని అనుచరుల నుంచి వచ్చే అంతర్గత ఆదేశాలు మరోలా ఉంటుండటంతో క్షేత్రస్థాయి లీడర్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదని సమాచారం.

రాష్ట్ర రాజకీయాల్లో రాఘవులు జోక్యం?

ఈ ఇద్దరి నేతల మధ్య .. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత బి.వి. రాఘవులు జోక్యం కూడా ఈ మధ్య కాలంలో తెలంగాణ సీపీఎంలో బాగా పెరిగిందనే ప్రచారం జరుగుతుంది. జాతీయ రాజకీయాలకే పరిమితం కావాల్సిన రాఘవులు, రాష్ట్ర పార్టీ అంతర్గత వ్యవహారాలు, జిల్లాల కమిటీల నియామకాలు, చివరకు రాజకీయ నిర్ణయాల్లోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది కాస్తా పార్టీలో ‘మూడో పవర్ సెంటర్’ను క్రియేట్ చేసిందని కేడర్ గుర్రుగా ఉంది. ప్రెస్ మీట్లు పెట్టడం నుంచి కేడర్‌కు గైడెన్స్ ఇవ్వడం వరకు అంతా తానే అయి నడిపిస్తున్నారని సమాచారం. రాష్ట్ర కార్యదర్శి ఉండగా, జాతీయ నేత వచ్చి ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం జాన్ వెస్లీ గ్రాఫ్‌ను తగ్గిస్తోందని కేడర్ భావిస్తోంది. మరోవైపుతమ్మినేని వర్గానికి చెక్ పెట్టేందుకు రాఘవులు తనదైన శైలిలో పావులు కదుపుతుండటంతో, పార్టీ రెండు కాస్తా.. మూడు గ్రూపులుగా చీలిపోయిందనే సంకేతాలు వెళ్తున్నాయి.

బలోపేతం ఎక్కడ..?

రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడి పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో, ఈ ముగ్గురు నేతలు తమ ఉనికిని చాటుకోవడానికే సమయాన్ని వృథా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఉన్న ప్రజాదరణ, క్యాడర్ బలం రోజురోజుకూ క్షీణిస్తుంటే.. కొత్త రక్తాన్ని పార్టీలోకి ఎక్కించడంలో నాయకత్వం పూర్తిగా విఫలమైందనే ప్రచారం జరుగుతుంది. ఎన్నికలు వస్తున్నాయి, పోతున్నాయి.. కానీ సీపీఎం గ్రాఫ్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రక్తం చిందించే కార్యకర్తలకు ఈ ‘త్రిముఖ’ ఆదేశాలు శాపంగా మారాయి.

Also read: విజయ్‌‌తో బ్రేకప్? బర్త్ డే విషెస్ చెప్పని త్రిష, ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. వీరికి ఏమైంది?

కేడర్‌లో అంతర్మథనం..

ముగ్గురు అగ్రనేతల తీరుతో ప్రస్తుతం ఎర్రజెండా నీడన ఉన్న సామాన్య కార్యకర్తల్లో జోరుగా చర్చ సాగుతోంది. “శాసించేది ఒకరైతే.. శాసించాలనుకునేది మరొకరు.. అసలు బాస్ అనుకునేది ఇంకొకరు.. ఇలాగైతే పార్టీ మనుగడ సాధ్యమేనా? అనేది పార్టీలో ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడాల్సిన కీలక సమయంలో, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించాల్సింది పోయి.. సీపీఎం అంతర్గత కుమ్ములాటల్లోనే కాలం వెళ్లదీస్తోందనేది కేడర్ లోఆందోళన వ్యక్తమవుతోంది.

సమన్వయ లోపం..

గత కొంతకాలంగా పార్టీ సభ్యత్వాల సంఖ్య తగ్గడం, యువతను ఆకర్షించలేకపోవడం, ప్రజా ఉద్యమాల్లో మునుపటి వేడి లేకపోవడానికి ఈ ‘త్రిముఖ పోరు’ ప్రధాన కారణమని ప్రచారం జరుగుతుంది. నేతల మధ్య సమన్వయ లోపం వల్ల పార్టీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నట్లు సమాచారం. ఈ ‘మూడు’ముక్కలాట చూస్తుంటే పార్టీ బలోపేతం కావడం దేవుడెరుగు ఉన్న కేడర్ కూడా పక్క చూపులు చూసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుని ఈ త్రిముఖ పోరుకు చెక్ పెట్టకపోతే, తెలంగాణలో ఎర్రజెండా మనుగడ ప్రశ్నార్థకంగా మారడం ఖాయంగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also read: పవన్ కళ్యాణ్ ‘OG 2’ గురించి అర్జున్ దాస్ షాకింగ్ కామెంట్స్..!

Related News

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్నీ తెలుగు భాషలోనే..?

తెలంగాణ సర్కార్ బంపరాఫర్.. పేరు పెట్టండి, లక్ష గెలవండి

బాసర సరస్వతిదేవి ఆలయంలో చోరీ.. అమ్మవారి ఆభరణాలు దోచేశారు, తలుపు బద్దలు కొట్టి, ఆ తర్వాత

జోరుగా నైరుతి రుతుపవనాలు.. హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం, మూడు రోజులు అలర్ట్

తుంగభద్ర జలాలపై.. రాజీపడే ప్రసక్తే లేదు.. తేల్చేసిన మంత్రి ఉత్తమ్

మాటల్లోనే మైనార్టీ బడ్జెట్.. చేతల్లో శూన్యం.. ప్రభుత్వంపై కవిత ఫైర్!

ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సంక్షోభం.. కేటీఆర్ సెటైర్లు

Big Stories

×