Ananya Comments:లిప్ లాక్ సీన్స్ ..కథ డిమాండ్ చేసిందంటే ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ..ఇది ఇండస్ట్రీలో తరచుగా వినబడే మాట. కానీ అదంతా తూచ్ ..అసలు కథ డిమాండ్ చేయదు ,మేకర్సే డిమాండ్ చేస్తారు అంటూ కుండబద్దలు కొట్టేసింది అనన్య శర్మ.ఇంతకీ డేర్ అండ్ స్ట్రైట్ గా కామెంట్స్ చేసిన ఈ అనన్య శర్మ ఎవరా అని ఆలోచిస్తున్నారా ..అదే నండీ .. 30 Weds 21 వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుందే ..తనే .మరింతకీ లేటెస్ట్ గా ఇంటర్వ్యూ లో ఈ అమ్మడు చేసిన ఆ కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
అనన్య మాట్లాడుతూ “నేను చెంపదెబ్బ కొట్టే సీన్‌ని ఎలా చూస్తానో.. ముద్దు పెట్టే సీన్‌ని కూడా అలాగే చూస్తాను. కారణం లేకుండా నా కో-స్టార్‌ని కొట్టను. అలాగే కారణం లేకుండా ముద్దు కూడా పెట్టను” అంటూ స్ట్రైట్‌గా చెప్పింది. అయితే అసలు తనకు అర్థం కాని విషయం ఒక్కటే అని చెప్పిన అనన్య.. “చెంపదెబ్బ సీన్ ఉంటే మాత్రం బాడీ డబుల్ పెడతారు.. కెమెరా యాంగిల్స్ మార్చేస్తారు.. చీటింగ్ షాట్స్ తీస్తారు. కానీ కిస్ సీన్ దగ్గరకు వచ్చేసరికి ‘అదే కదా.. చేసేయొచ్చు’ అని చాలా ఈజీగా మాట్లాడేస్తారు. ఈ తేడా ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు” అంటూ ఇండస్ట్రీలో ఉండే డబుల్ స్టాండర్డ్స్‌పై తన అభిప్రాయం చెప్పింది.
ఇక అందరూ ఎక్కువగా చెప్పే “స్క్రిప్ట్ డిమాండ్ చేసింది” అనే మాటపైనా అనన్య ఘాటుగానే స్పందించింది. “అసలు స్క్రిప్ట్ ఎప్పుడూ ముద్దు సీన్‌ని డిమాండ్ చేయదు. ఆ సీన్‌ని ఎలా చూపించాలన్నది దర్శకుడి నిర్ణయం. అదే ఫీలింగ్‌ని మరోలా కూడా చూపించొచ్చు. కాబట్టి ప్రతి కిస్ సీన్‌కు స్క్రిప్ట్‌ని కారణంగా చెప్పడం నేను నమ్మను” అంటూ కుండబద్దలు కొట్టింది.
అనన్య మాటలు బయటకు వచ్చిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. “ఇండస్ట్రీలో జరుగుతున్న అసలు విషయం చెప్పింది” అంటూ కొందరు ఆమెకు మద్దతు ఇస్తుంటే.. “కొన్ని ప్రేమ కథల్లో అలాంటి సన్నివేశాలు అవసరమే” అంటూ మరికొందరు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. కానీ అనన్య మాత్రం తన స్టాండ్ మాత్రం మార్చే ప్రసక్తే లేదని చెప్పినట్టే కనిపిస్తోంది.
ఈ మధ్య ఓటీటీల్లో బోల్డ్ కంటెంట్ బాగా పెరగడంతో కిస్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ కూడా కామన్ అయిపోయాయి. చాలా మంది కొత్త హీరోయిన్లు అవకాశాల కోసం అలాంటి సీన్స్ చేయాల్సి వస్తోందని గతంలో కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు కొందరు స్టార్ హీరోయిన్లు మాత్రం ముందుగానే తమ కాంట్రాక్ట్‌లో “నో కిస్ క్లాజ్” పెట్టించుకుంటున్నారట కూడా. ఎవరి నిర్ణయం వారిదే అయినా.. ఈ విషయంలో నటీనటుల ఇష్టానికి కూడా అంతే విలువ ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
also read :డ్యాన్సర్స్ అసోసియేషన్‌పై వేటు.. జానీ మాస్టర్ భార్య సుమలతపై ఫిల్మ్ ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం!
ఇక వరంగల్ కి చెందిన అనన్య చాయి బిస్కెట్, బాయిస్ ఫార్ములాలో నటించినప్పటికీ 30 Weds 21తోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెల్సిందే.చూడాలి మరి బోల్డ్ గా లిప్ లాక్ పై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టిన అనన్య కామెంట్స్ పై ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో !