E-Paper
Advertisement

ఏం గుండెరా వాడిది.. కిమ్ భార్యతోనే సెల్ఫీ.. షాకింగ్ వీడియో వైరల్!

ఏం గుండెరా వాడిది.. కిమ్ భార్యతోనే సెల్ఫీ.. షాకింగ్ వీడియో వైరల్!
Advertisement

Kim Wife Selfie: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో నియంత ఎవరని అడగ్గానే వెంటనే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ పేరే చాలా మంది చెబుతారు. ఆ దేశంలో ప్రజలు, మీడియాపై ఉండే ఆంక్షలు అన్ని ఇన్నీ కావు. కిమ్ ఆదేశాలకు అనుగుణంగానే అక్కడ ప్రతీ ఒక్కరు నడుచుకోవాలి. ఏమాత్రం ఎదురుతిరిగిన అదే వారికి ఆఖరి క్షణం అని ప్రపంచ మీడియా చెబుతుంటుంది. అత్యంత కఠినంగా కిమ్ వారిని శిక్షిస్తారని కథనాలను సైతం ప్రచురించింది. అలాంటిది ఓ వ్యక్తి.. కిమ్ ముందే ఆయన భార్యతో సెల్ఫీ దిగేందుకు యత్నించడం ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో ఏముందంటే?

కిమ్ తన భార్యతో కలిసి ఓ ప్రాంతాన్ని విజిట్ చేస్తుండగా.. అక్కడే ఉన్న ఓ ఆర్మీ వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శించాడు. కిమ్ పక్కన ఉండగానే ఆయన భార్య రీ సోల్ జూ (Ri Sol-ju)తో సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. ఈ అనూహ్య పరిణామంతో కిమ్ భార్య సైతం ఒక్కసారిగా షాకయ్యారు. ఆమె వెంటనే తన భర్త వైపు చూశారు. ఈ క్రమంలోనే కిమ్ ప్రైవేటు సెక్యూరిటీ ఒకరు వెంటనే కలుగజేసుకొని సైనికుడ్ని పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

Advertisement

Also Read: యూపీఐ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. పేమెంట్స్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం!

నెట్టింట ఫన్నీ కామెంట్స్..

Advertisement

అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. అయితే కిమ్ భార్యతో సెల్ఫీకి యత్నించిన వ్యక్తి పరిస్థితి ఏంటో అన్న అనుమానాలు మాత్రం నెట్టింట పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. ‘ఆ వ్యక్తి చాలా ధైర్యవంతుడు. కానీ ఘటన తర్వాత అతడికి ఏమైందోనని ఆందోళన ఉంది’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ‘బహుశా.. ఆ సైనికుడికి ఇదే చివరి సెల్ఫీ’ అంటూ సరదా కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా కిమ్ ముందే అంత ధైర్యంగా భార్యతో సెల్ఫీ దిగిన ఆ సైనికుడ్ని మెచ్చుకొని తీరాల్సిందేనన్న అభిప్రాయాన్ని మెజారిటీ నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కరోనాను ఖతం చేసే బ్రెజిల్ చెట్టు.. ఆకుల పవర్ చూసి సైంటిస్టులే షాక్!

Tags

Related News

దక్షిణాఫ్రికాలో ఘోరం.. అర్ధరాత్రి ఇంట్లోకి జొరబడి కాల్పులు.. 11 మంది దుర్మరణం!

షార్జాలో NRI దారుణహత్య.. శరీరాన్ని 9 భాగాలు చేసి, జాడలేని భార్య-కొడుకు

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి.. ఈసారి ఎయిర్‌లైన్స్ వంతు, బుధవారం నుంచి కొత్త ఆంక్షలు

వైట్‌హౌస్‌లో ఆ మూడు మీడియా సంస్థలపై బ్యాన్.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

సింగపూర్ తీరంలో షిప్‌లు ఢీ.. ఎగిరిపడ్డ కార్మికులు, వీడియో వైరల్

కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి, ఎలా జరిగింది?

రియాద్‌పై హౌతీల మిసైల్ ఎటాక్.. మిడిల్ ఈస్ట్‌లో హై అలర్ట్!

మాస్కోపై ఉక్రెయిన్ మెగా అటాక్.. 1,000కి పైగా డ్రోన్లతో రష్యాకు భారీ షాక్

Big Stories

Advertisement
×