BigTV English

Donald Trump: ట్రంప్ కు భారీ షాక్.. కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Donald Trump: ట్రంప్ కు భారీ షాక్.. కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొలరాడో నుంచి పోటీ చేయకుండా ట్రంప్ పై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ తీర్పు ప్రభావం వచ్చే ఏడాది మార్చి 5న జరిగే కొలరాడో రిపబ్లికన్స్ ప్రైమరీ బ్యాలెట్ పై మాత్రమే కాకుండా.. నవంబర్ 5న జరిగే సార్వత్రిక ఎన్నికలపై కూడా తీవ్రంగా ఉండనుందని తెలుస్తోంది.


2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించడంచో.. అమెరికా రాజ్యాంగ నిబంధనల మేరకు.. దేశ అధ్యక్ష పదవికి ట్రంప్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ.. కొలరాడో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అధ్యక్ష పదవి చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడని 4-3 మెజార్టీతో జడ్జిలు తీర్పు ఇచ్చారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 ప్రకారం.. అధ్యక్ష అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్ కు అవకాశాన్ని కల్పించారు. ఆయన రాజకీయ భవిష్యత్ అమెరికా సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×