E-Paper
Advertisement

ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ యుద్ధం.. చమురు లైసెన్సులు రద్దు, ఆయిల్ ధరలకు రెక్కలు?

ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ యుద్ధం.. చమురు లైసెన్సులు రద్దు, ఆయిల్ ధరలకు రెక్కలు?
Advertisement

Iran Vs America: ఇరాన్-అమెరికా మధ్య దాడులు కంటిన్యూ అవుతున్నాయి. పేరుకే శాంతి చర్చలు చెబుతున్నా, ఎక్కడో దగ్గర బాంబులు, ఆపై దాడులు చేసుకున్న ఘటనలు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా ఇరాన్‌పై అమెరికా భీకరమైన దాడులు చేయడం తీవ్ర కలకలం రేపింది. అంతేకాదు చమురు విక్రయాలకు చెందిన ఇరాన్‌ లైసెన్స్‌ను అమెరికా రద్దు చేయడం మరింత అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది.

ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ యుద్ధం తీవ్రరూపం-ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు రెండు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా తయారైంది. ఓ వైపు శాంతి చర్చలు అని చెబుతూనే ఇరుదేశాలు దాడులకు దిగుతున్నాయి. తాజాగా హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా మంగళవారం ఇరాన్‌పై భీకరమైన దాడులు చేసింది అమెరికా.

Advertisement

ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు- ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అంతర్జాతీయ జలమార్గంలో అమాయక పౌరులు ట్రావెల్ చేస్తున్న నౌకలపై దాడులకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించేలా చేయడానికి, శక్తివంతమైన దాడులు ప్రారంభించినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ ప్రదర్శించిన దురాక్రమణ అనవసరమైనది, ప్రమాదకరమైనది, కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని ప్రస్తావించింది.

చమురు లైసెన్సులు రద్దు- ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్సు రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలు, క్షిపణి నిల్వలు, డ్రోన్‌ల ప్రయోగ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికాకు చెందిన ఓ అధికారి వివరించారు. ఇరాన్ నౌకాశ్రయాల మౌలిక సదుపాయాలపై దాడులు చేసినట్లు వెల్లడించారు. ఖేష్మ్‌, బందర్ అబ్బాస్‌లలో భారీ ఎత్తున పేలుళ్ల శబ్దాలు, ఎగిసిపడిన మంటలు కనిపించినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.

Advertisement

ఆయిల్ ధరలకు రెక్కలు? నాటో కూటమి శిఖరాగ్ర సమావేశం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీలో ఉండగా ఈ దాడులు చోటు చేసుకున్నాయి. ఇదిలావుండగా ఇరాన్ పై దాడులకు ముందు చమురు విక్రయాలకు సంబంధించి ఇరాన్‌ లైసెన్స్‌ను అమెరికా రద్దు చేయడం ఇరుదేశాల మధ్య యుద్ధం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది.

ALSO READ: ఒకే బైక్.. 10 మంది ప్రయాణం.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

హర్మూజ్‌లో ఇరాన్ చర్యల నేపథ్యంలో చమురు లైసెన్స్‌ను రద్దు చేసినట్లు సదరు అధికారి తెలిపారు. అమెరికా నిర్ణయాన్ని ఇరాన్ విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, దీని పర్యవసానాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వారం రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న సమయంలో వరుస దాడులతో మళ్లీ వేడెక్కింది. తాజా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ నౌకా రవాణాపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. ఒకవేళ  హోర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే చమురు ధరలు పెరగడం ఖాయమనే అంచనాలు ప్రపంచదేశాల్లో మొదలయ్యాయి.

 

Related News

కూతురు కళ్ల ముందే.. భారత వ్యాపార‌వేత్త కాల్చివేత, అమెరికా దారుణమైన ఘటన

జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. భయాందోళనలో టోక్యోవాసులు, పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిపివేత

వరల్డ్‌ ఫేమస్ వ్యక్తులు.. చనిపోయినా వదల్లేదు.. సమాధులు తవ్వి శరీర భాగాలు ఎత్తుకెళ్లారు!

భారీ రాళ్లను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారో తెలిస్తే దిమ్మతిరుగుద్ది.. పిరమిడ్ల నిర్మాణ సీక్రెట్ ఇదే!

కుప్పకూలిన బంగారు గని, 100 మందికి పైగా మృతి! ఇంతకీ ఎక్కడో తెలుసా?

ఆపరేషన్ బార్బరోస్సా.. హిట్లర్ చేసిన ఆ ఒక్క పొరపాటే రెండో ప్రపంచ యుద్ధ ఫలితాన్ని మార్చేసిందా?

హర్మూజ్‌లో ఇరాన్‌కు మైండ్ బ్లాంక్ సీన్.. 80% నౌకలు అటే.. అసలు ఒమన్ ప్లాన్ ఏంటి?

ఉత్తర కెన్యాలో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు మృతి!

Big Stories

Advertisement
×