BigTV English

US Secret Service: దేశాధ్యక్షుడి భద్రతా సిబ్బందిని బెదిరించి దోచుకున్న దొంగలు

US Secret Service: దేశాధ్యక్షుడి భద్రతా సిబ్బందిని బెదిరించి దోచుకున్న దొంగలు

US Secret Service Agent Robbed: వీఐపీలకు సాధారణంగా భద్రతా సిబ్బంది ఉంటారు. వారు ఎప్పటికప్పుడు కంటికిరెప్పలా కాపాడుకుంటారు. అదే వీవీఐపీలకు ఉండే భద్రతా సిబ్బంది విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదు. వారికి అత్యంత కఠినంగా శిక్షణ ఇస్తారు. ఎలాంటి పరిస్థితినైనా తాము ఎదురించేవిధంగా వారిని తయారు చేస్తారు. అయితే, ఈ విధంగా ఉండే భద్రతా సిబ్బందిలో ఒకరికి చేదు అనుభవం ఎదురయ్యింది. అతడిని దొంగలు బెదిరించి దోచుకున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.


కాగా, ప్రపంచంలోనే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడికి ఆ దేశ సీక్రెట్ సర్వీస్ సంస్థ భద్రతను కల్పిస్తుంది. అత్యంత సురక్షితమైన భద్రతా సిబ్బందిలో ఇది ఒకటి. ఈ భద్రతా సిబ్బందికి ఏ విధంగా శిక్షణ ఇస్తారో .. వీరు ఎంత అలర్ట్ గా ఉంటారో అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఇలాంటి భద్రతా సిబ్బందిలో ఓ సభ్యుడిని దొంగలు బెదిరించి దోచుకున్నారు. అది కూడా దేశాధ్యక్షుడి అధికారిక పర్యటన వేళ. ఈ ఘటన అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగింది.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షుడు ఒబామా.. వీరిద్దరూ కలిసి లాస్ ఏంజెల్స్ లో ఓ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం తరువాత అక్కడి నుంచి తిరిగి వెళ్తున్న ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ టూస్టిన్ అనే ప్రాంతంలో తుపాకీతో బెదిరించి అతని వద్ద ఉన్న బ్యాగ్ ను దోచుకెళ్లారు. ఆ సమయంలో ఆ ఏజెంట్ కూడా కాల్పులు జరిపాడు. ఆ తరువాత ఆ ఘటనకు సంబంధించి బాధితుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.


Also Read: న్యూజెర్సీలో దుండగుడు కాల్పులు, పంజాబ్ మహిళ మృతి.. మరొకరికి గాయాలు

ఈ విషయంపై సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంటోనీ గుగ్లెమొనీ స్పందించారు. తమ సిబ్బందిలో ఒకరు కాలిఫోర్నియాలో దోపిడీకి గురయ్యారని తెలిపారు. ఈ క్రమంలో అతడు తన సర్వీస్ గన్ తో ఫైరింగ్ కూడా చేశాడని పేర్కొన్నారు. దుండగుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. కాగా, దోపిడీ జరిగిన ప్రదేశం నుంచి ఓ కారు వేగంగా వెళ్లినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.

Tags

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×