Big Stories

US Visa Fees Hike: అమెరికా వెళ్లేవారికి షాక్.. వీసా ఫీజులు పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు..

US Visa Fees Hike
US Visa Fees Hike

America Visa Fees Hike(Live tv news telugu): అమెరికాకు వచ్చేవారికి ఆ దేశం షాకిచ్చింది. వీసా ఫీజులు భారీగా పెంచేసింది. 3 రెట్లు పెరిగిన ఈ ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వీసాల ఫీజులు భారీగా పెరగనున్నాయి.

- Advertisement -

యూఎస్ వెళ్లే ఇండియన్స్ హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వీసాలకు అప్లై చేస్తారు. గత 8 ఏళ్లుగా వీసా ఫీజులు పెంచలేదు. 2016లో చివరిసారిగా వీసా ఫీజులు పెరిగాయి. కొత్త వీసా ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమమల్లోకి వస్తాయని యునెటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది.

- Advertisement -

హెచ్ -1బీ వీసాకు దరఖాస్తు కోసం ఫారమ్ I-129 ను తీసుకోవాలి. ఈ ఫారమ్ రుసుం 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెంచారు. అంటే అక్షరాల రూ.38 వేల నుంచి రూ.64 వేలకు రుసుం పెరుగుతుంది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ రుసుం 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు.

Also Read: ఖరీదైన వాచ్ పెట్టుకుని దర్శనమిచ్చిన పెరూ అధ్యక్షురాలు.. ఐటీ సోదాలు

నాన్ ఇమ్మిగ్రెట్ కేటగిరి కిందికి ఇచ్చే ఎల్-1 వీసా రుసుం ప్రస్తుతం 460 డాలర్లు ఉంది. అయితే ఏప్రిల్ 1 నుంచి ఈ వీసా రుసుం 1385 డాలర్లకు పెంచారు. బదిలీ అయ్యే ఉద్యోగులకు కోసం ఈ వీసా మంజూరు చేస్తారు.

అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టే  వ్యాపారుల ఫ్యామీలకు మంజూరు చేసే వీసా ఈబీ-5. ఈ వీసా రుసుంలు ప్రస్తతం 3,675 డాలర్లు ఉన్నాయి. ఈ ఫీజులను 11,160 డాలర్లకు పెంచారని తెలుస్తోంది. యూఎస్ లో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టే వారి ఫ్యామిలీస్ కు ఈ వీసాలు మంజూరు చేస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News