Big Stories

India-Iran Chabahar Deal: ఆంక్షలు విధిస్తామన్న అమెరికా.. తగ్గేదేలే అన్న భారత్!

US Warns Sanctions Ahead of India – Iran Chabahar Deal: అమెరికా.. అగ్రరాజ్యం.. అఫ్‌కోర్స్ రోజురోజుకు ఆ స్టేటస్ పోతుందనుకోండి. కానీ.. దాని తీరు మాత్రం మారడం లేదు. తాను చేస్తే ఒప్పు.. వేరే వాళ్లు చేస్తే తప్పు అన్నట్టుగా ఉంటుంది అమెరికా తీరు. ఇప్పుడు యూస్‌ ఇండియాకు వార్నింగ్ ఇస్తుంది. ఇన్‌డైరెక్ట్‌గా చెప్తున్నా.. దాని అర్థం అదే. మరో అడుగు ముందుకేస్తే ముప్పు తప్పదంటోంది అమెరికా. ఇంతకీ ఇండియాపై అగ్రరాజ్యానికి అక్కసేందుకు? ఇంతకీ భారత్ వేస్తున్న అడుగులేంటి?

- Advertisement -

ఇరాన్.. ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. పశ్చిమ దేశాలన్ని ఇప్పుడు ఇరాన్‌పై కత్తులు నూరుతున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో అశాంతికి కారణం ఇరానే అంటూ గుర్రుగా ఉన్నాయి. అలాంటి ఇరాన్‌తో ఇండియా ఓ డీల్ చేసుకుంది. అది కూడా చాల ముఖ్యమైన డీల్. భారత విదేశాంగ విధానానికి అత్యంత అవసరమైన డీల్ ఇది. ఎన్నో ఏళ్ల చర్చల తర్వాత కుదిరిన డీల్ ఇది. ఇంతకీ ఈ డీల్ ఏంటంటే.. ఇరాన్‌లోని అత్యంత కీలకమైన చాబహార్ పోర్టు నిర్వహణ ఇకపై ఇండియానే చేపట్టనుంది. అది కూడా ఏకంగా 10 ఏళ్ల పాటు. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్, పోర్ట్‌, మారిటైమ్ ఆపరేషన్‌ మధ్య కుదిరిన డీల్ ఇది. ఇవి రెండు ప్రభుత్వ రంగ సంస్థలే. ఇండియాకు విదేశాల్లో ఓ పోర్టును నిర్వహించడం ఇదే ఫస్ట్‌ టైమ్.

- Advertisement -

అమెరికాను కాసేపు పక్కన పెడితే అసలు ఈ డీల్‌ ఇండియాకు మాత్రమే కాదు.. ఇరాన్‌కు కూడా చాలా ఇంపార్టెంట్. పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ ఎయిర్‌పోర్ట్‌ ఇప్పటికే చైనా చేతికి చిక్కింది. ఇప్పటికే ఆ ఎయిర్‌పోర్ట్‌లో చైనా కార్యకలాపాలు పెరిగాయి. ఇది ఇండియాకు చాలా చాలా డేంజర్. మధ్య ఆసియా దేశాలు అంటే.. ఇరాన్‌, అఫ్ఘానిస్థాన్, తుర్కమేనిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజకిస్థాన్, ఉజ్బేకిస్థాన్.. లాంటి దేశాలతో వ్యాపారంపై ఎఫెక్ట్ పడుతుంది. సో డీల్‌తో ఇకపై భారత్‌ ఎగుమతులు చేయాలంటే ఇకపై ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా పాకిస్థాన్‌పై, ఈ దేశాలకు ఈజీగా ఎక్స్‌పోర్ట్స్‌ చేసే అవకాశం దక్కింది ఇండియాకు. అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నార్త్‌ సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్… అంటే ఇండియా, రష్యాను లింక్ చేసే రూట్. ఇప్పుడీ రూట్‌లో చాబహార్ కీరోల్ ప్లే చేయనుంది.

Also Read: Imran khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్

ఇక ఇరాన్‌ వైపు నుంచి చూస్తే ఇది ఆ దేశానికి చాలా మంచి అవకాశం. ఎందుకంటే పోర్ట్‌ను అప్‌గ్రేడ్‌ చేసేందుకు వందల కోట్లు ఇండియా ఖర్చు చేయనుంది. అంతేకాకుండా పోర్ట్‌ ప్రాంతంలో రైల్వే, రోడ్డు సదుపాయాలను పెంచేందుకు ఏకంగా 250 మిలియన్‌ డాలర్ల అప్పును కూడా ఇవ్వనుంది ఇండియా. సో ఇరాన్‌ పోర్ట్‌ ఏరియా ఇప్పుడు వద్దన్న డెవలప్ అవుతుంది. ఇవన్నీ కాకుండా.. భారత్‌ లాంటి దేశంతో డీల్‌ కుదుర్చుకోవడం ఇప్పుడా దేశానికి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ఇరాన్‌ను ఇప్పటికే వెస్ట్రన్ కంట్రీస్‌ ఓ విలన్‌లా చూస్తున్నాయి. ఇప్పటికే అనేక ఆంక్షలు ఆ దేశంపై విధించాయి. ఇలాంటి సమయంలో భారత్‌ లాంటి దేశం తమకు అండగా ఉందన్న భరోసా ఇరాన్‌కి వచ్చింది,

ఇప్పుడు అమెరికా అక్కసు ఏంటి,,? ఇరాన్-ఇండియా డీల్ కుదుర్చుకుంటే అమెరికాకు ఎందుకు మంట..? చాబహార్ పోర్ట్‌ అభివృద్ధికి 2003లో భారత్ ఒప్పందం చేసుకుంది. కానీ.. ఇరాన్‌ అణు కార్యక్రమాలు చేపడుతోందని ఆరోపిస్తూ అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో పనులు స్లో అయ్యాయి. మళ్లీ 2015 తర్వాత కానీ పరిస్థితులు మెరుగు కాలేదు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ ఒప్పందాన్ని రెన్యూవల్‌ చేసుకుంటూ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా 10 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే అమెరికా కడుపుమంటకు చాలా కారణాలున్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్‌పై జరుగుతున్న దాడులను వెనకుండి నడిపించేది.. ఇరాన్.

Also Read: Attack On Slovakia Prime Minister: స్లోవేకియా ప్రధానిపై కాల్పులు..

రెడ్ సీలో జరుగుతున్న వెస్ట్రన్ కంట్రీస్‌పై కంటైనర్ షిప్‌లపై జరుగుతున్న హౌతీ దాడుల వెనకున్నది.. ఇరాన్. ఇజ్రాయెల్-సౌదీ ఒప్పందం కుదరకపోవడానికి కారణం.. ఇరాన్.. రష్యా, ఉత్తర కొరియాతో ఒప్పందాలు చేసుకున్నది.. ఇరాన్.. ఇలా అమెరికాకు నచ్చని ప్రతి పనిని చేస్తున్నది.. ఇరాన్.. అలాంటి తమ శత్రువైనా ఇరాన్‌తో భారత్‌ దోస్తీ ఏంటి అనేది అమెరికా ప్రశ్న.

ఇండియా-ఇరాన్ మధ్య అలా డీల్ కుదిరిందో లేదో.. అమెరికా ఓ అనౌన్స్‌మెంట్ చేసింది. చాబహార్ డీల్ గురించి తెలిసింది. ఇండియా విదేశాంగ విధానానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అయితే ఏ సంస్థ, దేశమైనా డీల్స్ చేసుకుంటే వారిపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. ఇది అమెరికా ఇచ్చిన స్టేట్‌మెంట్. అంటే భారత్‌పై కూడా ఆంక్షలు విధించే చాన్స్‌ ఉంటుంది అని చెప్పకనే చెబుతుంది అమెరికా.

Also Read: India Ex Colonel Died in Rafah: రఫాలో భారత మాజీ అధికారి మృతి.. రెండు నెలల క్రితమే..?

మరి ఇండియా.. అమెరికా ఇచ్చే వార్నింగ్‌కు భయపడుతుందా? చేసే ఓవరాక్షన్‌ చూసి ఊరుకుంటుందా? అస్సలు సమస్యేలే. తమ విదేశాంగ విధానం తమకు లాభంగా ఉండేలా ఉంటుంది కానీ, ఇతర దేశాలకు బెనిఫిట్‌ అయ్యేలా ఉండదని విదేశాంగమంత్రి జై శంకర్ చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. ఇరాన్‌ డీల్‌పై కూడా ఇప్పటికే జై శంకర్‌ దీనిపై క్లారిటీ ఇచ్చారు. మేం చేసుకునే ఒప్పందంతో అమెరికాకు వచ్చిన ఇబ్బందేం లేదన్నారు. అమెరికాకు ఇంకోసారి నోరు తెరిచినా.. పొరపాటున ఏదైనా ఆంక్షలు విధించినా సీన్‌ మాత్రం వేరేలా ఉండటం ఖాయం. ఎందుకంటే ఇది ఒకప్పటి ఇండియా కాదు. చేతులు కట్టుకొని ఏం చెప్పినా వినేందుకు. ఈ విషయం అమెరికాకు కూడా తెలుసు. అందుకే మరోవైపు నుంచి నరుక్కుంటూ వచ్చే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం గత కొన్ని రోజులుగా అమెరికా స్వరం మారుతుంది. ఈ మధ్య పాక్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు అమెరికా పెద్దలు. రీసెంట్‌గా పాక్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు జో బైడెన్‌ లెటర్ రాశారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం చాలా కీలకమన్నారు బైడెన్. అయితే సడెన్‌గా అమెరికాకు పాక్‌పై ఇంత ప్రేమ ఎందుకు? దీనికి రెండు కారణాలు ఉండొచ్చు. ఫస్ట్ ఇండియాను కంట్రోల్ చేయడానికి కావొచ్చు. ఇక సెకండ్‌ది ఇరాన్‌ను కంట్రోల్‌ చేయడానికి, ఎందుకంటే ఇటీవల ఇరాన్-పాక్‌ మధ్య దోస్తీ పెరిగింది. ఇది అమెరికాకు డైజెస్ట్ కావడం లేదు. ఎందుకంటే దేశాల మధ్య పంచాయితీ ఉంటేనే అమెరికా అనుకున్నది సాధించగలదు. ఇప్పటికే అఫ్ఘానిస్తాన్ నుంచి పారిపోయారు అమెరికన్లు. పాక్‌ పూర్తిగా, శ్రీలంక దాదాపుగా చైనా చేతుల్లోకి వెళ్లింది. భారత్‌ కొరకరాని కొయ్యగా మారింది. సో అమెరికాకు ఎక్కడా సందు దొరకడం లేదు. అందుకే మెళ్లిగా పాక్‌ను దువ్వే కార్యక్రమం ప్రారంభించింది. కానీ పాక్‌ అమెరికా ట్రాప్‌లో పడుతుందా? లేదా? అనేది చూడాలి.

Also Read: రఫాలో భారత మాజీ అధికారి మృతి.. రెండు నెలల క్రితమే..?

ఓవరాల్‌గా చూస్తే ఇక్కడ ఇండియా చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. అమెరికా సహకారం భారత్‌కు ఎంత అవసరమో, భారత్‌ సహకారం అమెరికాకు కూడా అంతే అవసరం. చెప్పినంత సులువుగా చర్యలు తీసుకునే అవకాశం అమెరికాకు లేదనే చెప్పాలి. అలా కాదని ఏదైనా చర్యలు తీసుకుంటే, ఇది రెండు దేశాలకు మాత్రమే కాదు.. మొత్తం ఈ రీజియన్‌లోనే చాలా మార్పులకు ఇది కారణమవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News