Big Stories

Imran khan Bail: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్

Former Pakistan PM Imran Khan Got Bail: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బెయిల్ మంజూరయింది. భూకజ్జా ఆరోపణ కేసులో ఆయనకు ఇస్లామాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ మరో రెండు కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవించాల్సి ఉందని ఇమ్రాన్ తరపు న్యాయవాది తెలిపారు.

- Advertisement -

ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు చట్టవిరుద్ధంగా ఆయన భార్యకు భూమిని బహుమతిగా ఇచ్చారనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ఇమ్రాన్ రియల్ ఎస్టేట్ డెవలపర్ నుంచి ల్యాండ్ లంచంగా తీసుకొని భార్యకు బహుకరించాడని కోర్టులో కేసు నమోదైంది.కాగా..తాను ఎలాంటి తప్పు చేయలేదని ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ హై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఇమ్రాన్ తరుపు న్యాయవాది నయూమ్ హైదర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా ఇమ్రాన్ మరో రెండు కేసుల్లో దోషిగా ఉన్నారని వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ రహస్యాలను లీక్ చేయడంతో పాటు, ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘించి వివాహం చేసుకున్నారనే రెండు కేసుల్లో పోలీసుల కస్టడీలో ఉన్నారు.

Also Read: స్లోవేకియా ప్రధానిపై కాల్పులు..

గతేడాది ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు. ఆయన మొత్తంగా నాలుగు కేసుల్లో దోషిగా తేలారు. మరో రెండు కేసుల్లో శిక్షలు తాత్కాలికంగా నిలిపివేసారు. అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన తర్వాత హింసను ప్రేరేపించారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. 2018లో ఇమ్రాన్ ను అక్రమంగా వివాహం చేసుకున్నందుకు ఆమె భార్య కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News