Disabled Person Became Businessman: అంగవైకల్యంతో బాధపడుతున్న వారు భూమి మీద చాలా మంది వ్యక్తులు ఉన్నారు. కొంత మంది అంగవైకల్యం ఉన్న కూడా దైర్య సాహసాలు చేసి మరి బ్రతుకు దెరువు కోసం పోరాటం చేస్తుంటారు. కానీ మరికొంత మందికి చేయడానికి పని, ఉండడానికి ఇళ్లు కూడా లేకుండా బ్రతుకుతుంటారు. పూట గడవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఆకలితో కడుపు నింపుకునేందుకు నానా అవస్థలు పడుతుంటారు. ఇలా రోడ్లపై అంగవైకల్యంతో కనిపించే వారిని చాలా మందిని చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి వారిని ఆదుకోవడానికే కొంతమంది సామాజిక వేత్తలు ముందుకు వస్తున్నారు. బాధితులను చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నారు.
తమ జీవితాన్ని సోషల్ సర్వీస్ పేరిట అంకితం చేసి తమ గొప్ప మనసు చాటుకుంటున్నారు. తాజాగా ఓ సామాజిక వేత్త చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ వికలాంగుడికి గొప్ప సహాయం చేసిన నువ్వు గ్రేట్ భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అసలు ఆ వ్యక్తి చేసిన పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా అయితే రోడ్డుపై కనిపించే వికలాంగులకు తోచినంత డబ్బులు ఇచ్చి వెళ్లిపోతుంటారు. కానీ కొంత మంది మాత్రమే వారికి ఏదో ఒక విధంగా సహాయపడాలని చూస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి అలాంటి పనే చేశాడు. నడవరాని స్థితిలో రోడ్డుపై పాకుకుంటూ ఓ వికలాంగుడు కనిపించాడు. కనీసం తనకు వీల్ చైర్ కూడా లేకపోవడంతో ఓ సామాజిక వేత్త మనసు చలించిపోయింది. దీంతో ఆ వికలాంగుడికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో వెంటనే అతని వద్దకు వెళ్లి తన చేతుల మీదుగా ఎత్తుకుని తీసుకెళ్లాడు.
Also Read: Viral Video: ఆఖరికి దీన్ని కూడా వదిలిపెట్టదా.. దోమల బ్యాట్‌పై బ్రెడ్ టోస్ట్ చేసేసింది
ఓ చైర్ లో కూర్చోబెట్టి షేవింగ్ చేశాడు. బకెట్ లో నీళ్లు, షాంపు, సబ్బు తీసుకుని వచ్చి స్నానం చేయించాడు. అనంతరం అతడికి కొత్త బట్టలు వేశాడు. ఆ తర్వాత ఆ వికలాంగుడి కళ్లకు గంతలు కట్టాడు. అనంతరం అతడికి ఓ హ్యాండ్ సైకిల్ లో చిన్న షాపు మాదిరిగా ఏర్పాటు చేసి ఇచ్చాడు. అందులో వాటర్ బాటిళ్ల డబ్బాలు కూడా పెట్టాడు, కుర్ కురే ప్యాకెట్లు, చిప్స్ వంటివి అందులో అమర్చాడు. అనంతరం అతడి కాళ్లకు పాదాభివందనం చేశాడు. అయితే క్షణాల్లో వికలాంగుడిని వ్యాపారవేత్తను చేయడంతో అందరూ ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తుంది.
This video made my day! ❤️ pic.twitter.com/vRUEd8Pka6
— Mehwish (@MyWishIsUs) May 13, 2024