ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది తమ హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేసేందుకు క్రూయిజ్ షిప్ లను ఎంచుకుంటారు. ఎందుకంటే వాటిలో సకలక సౌకర్యాలు ఉంటాయి. సినిమా హాళ్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, పార్కులు, వైన్ మార్టులు, ఒకటేమిటీ ప్రయాణీకులకు కావాల్సిన అన్ని వసతులూ లభిస్తాయి. అందుకే క్రూయిజ్ షిప్ లను సముద్రంపై తేలియాడే నగరాలుగా పిలుస్తారు. ఈ షిప్ లు నెలల తరబడి సముద్రంలోనే ప్రయాణిస్తుంటాయి. ఇందులో చాలా మంది వృద్ధులు జర్నీ చేస్తుంటారు. అందుకే షిప్ సిబ్బంది.. వారికి కావాల్సిన ఆన్ బోర్డ్ సెక్యూరిటీతో పాటు అన్ని వైద్య సదుపాయాలను కల్పిస్తారు.
క్రూయిజ్ షిప్‌లో ఎవరైనా చనిపోతే?
క్రూయిజ్ షిప్ లో ప్రయాణించే సమయంలో ఎవరైనా చనిపోతే ఏంటి? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. ఒకవేళ ప్రయాణంలో ఎవరైనా చనిపోతే ప్రత్యేక ప్రోటోకాల్ పాటిస్తారు. అలాంటి సందర్భాల్లో మృతదేహాలను నిల్వ చేయడానికి ఆన్ బోర్డ్ మోర్గ్ లు ఓడ సిబ్బందిని అనుమతిస్తాయి. చనిపోయిన వారి శరీరం చెడిపోకుండా భద్రపరిచేందుకు ఓడలో రెండు రిఫ్రిజిరేటెడ్ స్టెయిన్లెస్ స్టీల్ గదులు ఉంటయి. షిప్ దిగువ భాగంలో ఉండే ఈ గదుల్లో సుమారు 10 మృతదేహాలను ఉంచవచ్చు. అయితే, యుఎస్ పోర్ట్ కు వెళ్లే క్రూయిజ్ షిప్‌ల సిబ్బంది ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా చనిపోయిన వారి వివరాలను వెంటనే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పోర్ట్ హెల్త్ స్టేషన్‌లకు అందించాల్సి ఉంటుంది. ఓడలో ప్రయాణిస్తున్న వారిలో ఎవరైనా చనిపోతే, కుటుంబ సభ్యులు ఆ ఓడ ఏ దేశ సమీపంలో ఉందో అక్కడ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే, అందుకు ఆ దేశాల నిబంధనలు అనుమతించాల్సి ఉంటుంది.
మృతదేహాలను భద్రపరిచేందుకు అయ్యే ఖర్చులు ఎవరు భరించాలి?
క్రూయిజ్ షిప్ లో చనిపోతే సంబంధించిన ఖర్చులను చెల్లించడానికి క్రూయిస్ లైన్లకు ఎటువంటి చట్టపరమైన బాధ్యత ఉండదు. ఓడలో జరిగిన ప్రమాదం కారణంగా చనిపోతే మాత్రం యాజమాన్యం రెస్పాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ప్రయాణీకులు, వారి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని భద్రపరిచేందుకు అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. అయితే, ప్రయాణ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కొన్ని ఈ ఖర్చులను భరిస్తాయి. షిప్ లో చనిపోయిన వారి మృతదేహాలను వారి స్వదేశాలకు తరలించేందుకు ఉపయోగపడుతాయి. పోస్టుమార్టంతో పాటు పోలీసు నివేదిక, డెడ్ బాడీని తరలించేందుకు అవసరమైన డాక్యుమెంట్స్ ను రెడీ చేసేందుకు అయ్యే ఖర్చును కూడా బీమా కంపెనీలు భరిస్తాయి. ఇంకొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు తాత్కాలికంగా డెడ్ బాడీని భద్రపరచడం, ఎంబామింగ్, దహన సంస్కారాలు, ఇతర ఖర్చుల కోసం కవరేజీని అందిస్తాయి.
క్రూయిజ్ షిప్ లలో చాలా అరుదుగా మరణాలు
వాస్తవానికి క్రూయిజ్ షిప్ లో మరణాలు అనేవి అత్యంత అరుదుగా జరుగుతాయంటున్నారు నిపుణులు. క్రూయిజ్ హాలిడే అనేది అత్యంత సురక్షితమైనదిగా వెల్లడించారు. ప్రయాణీకులు, సిబ్బంది భద్రత క్రూయిజ్ లైన్లలో మొదటి ప్రాధాన్యత ఉంటుందంటున్నారు. సో, వీలుంటే క్రూయిజ్ షిప్ లో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయాలని సూచిస్తున్నారు.
Read Also: జస్ట్ గంటన్నరలో విజయవాడ నుంచి శ్రీశైలానికి.. సీ ప్లేన్ లో ఇలా విహరించండి!