US School Shooting Suspect’s Father Arrested: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే ఏకంగా స్కూల్‌లోనే కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఉపాధ్యాయుడితో పాటు నలుగురు మృతి చెందారు.
జార్జియాలోని బారో కౌంటీలోని అపాలాచీ పాఠశాలలో 14 ఏళ్ల బాలుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు విద్యార్థులు, ఒక గణిత ఉపాధ్యాయుడుతో పాు 30మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు.
ఈ దాడిలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నిందితుడి 14 ఏళ్ల బాలుడిగా గుర్తించారు. అతడి పేరు కోల్ట్ గ్రే అని తెలుస్తోంది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ మేరకు ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించారు. అనంతరం పాఠశాల విద్యార్థులను సమీపంలోని ఓ అథ్లెటిక్ స్టేడియానికి తరలించారు. అమెరికా కాలమాన ప్రకారం.. ఈ సంఘటన బుధవారం ఉదయం 10.30 గంటలకు చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితుడు ఏఆర్ 15 తరహా రైఫిల్ ఉపయోగించినట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ బాలుడికి రైఫిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీయగా.. గతేడాది డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలిపాడు. తన తండ్రి కోలిన్ తన కుమారుడి కోసం తుపాకి కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. క్రిస్మస్ కానుకగా ఓ తుపాకీ షాపులో రైఫిల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
దాడికి గల కారణాలు తెలియరాలేదని, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని అధికరులు తెలిపారు. అయితే, నిందితుడికి కాల్పుల్లో చనిపోయిన వారికి ఎలాంటి గొడవలు లేవని, మరి ఎందుకు కాల్పులు చేసినట్లు అనే కోణంలో విచారిస్తున్నారు. కానీ ఆ బాలుడు ఎప్పుడూ తరగతి గదిలో నిశ్శబ్ధంగా ఉండేవాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఎక్కువగా తరగతి బయటే ఉండడానికి ఇష్టపడతాడని, ఏదైనా మాట్లాడితే తక్కువ రెస్పాన్స్ ఇస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం పాఠశాల పోలీసుల అదుపులో ఉందని, విద్యార్థులను చూసేందుకు ఎవరూ పాఠశాల వద్దకు రావొవ్దని బోరో కౌంటీ షెరీఫ్ కార్యాలయం సూచించింది. నిందితుడిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం
ఇదిలా ఉండగా, అమెరికాలో కాల్పులు సాధారణంగా మారింది. దేశంలోని పెద్దవారిలో మూడింట ఒకవంతు మంది తుపాకీని కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలో 384 కాల్పులు జరగగా..11,557 మంది మరణించారు. తాజాగా, స్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశాడు.
Here is the full press conference with GBI on the arrest of Colin Gray, the 54 year-old father of 14 year-old school shooter Colt Gray, for his responsibility in the tragedy at Apalachee High School in Georgia. pic.twitter.com/NyRu7jtC6s
— Art Candee 🍿🥤 (@ArtCandee) September 6, 2024