Japan Resignation Companies| కంపెనీలో ఉద్యోగం చేసే సమయంలో కొందరు అనుకోని కష్టాలు ఎదుర్కొంటుంటారు. దాంతో పనిచేయడం వారికి నరకంగా మారుతుంది.. ఇక చివరిక పని చేయలేక రాజీనామా చేయాలనుకున్నప్పుడు కంపెనీ యజమాన్యం వారికి ముప్పుతిప్పలు పెడుతుంది. దీంతో ఆ ఉద్యోగుల పరిస్థితి కక్కలేని మింగలేని విధంగా మారిపోతుంది. ఉద్యోగుల ఈ సమస్యను అవకాశంగా తీసుకొని ఇప్పుడు కొత్త బిజినెస్ మొదలైంది. అదే రాజీనామా సజావుగా ఆమోదింప చేసే బిజినెస్. ఈ కొత్త వ్యాపారం జపాన్ లో మొదలై మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.
అమెరికా వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. జపాన్ లో 2017 సంవత్సరంలో ‘ఎగ్జిట్’ అనే కంపెనీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. ఏదైనా సంస్థలో పనిచేసే ఉద్యోగులు తాము చేసే పని నచ్చక లేదా ఇంత కంటే మంచి ఆఫర్ రావడంతో ప్రస్తుతం ఉద్యోగానికి రాజీనామా చేయాలంటే వారు పెద్ద ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది. పైగా కంపెనీ యజమాని మానసింగా హింసిస్తూ ఉంటాడు.
ఇలాంటి ఉద్యోగలుకు ‘ఎగ్జిట్’ కంపెనీ కొత్త సర్వీస్ ఆఫర్ చేస్తోంది. వారి రాజీనామా సమస్యను పరిష్కిరిస్తుంది. ఉద్యోగుల రాజీనామా విషయంలో చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి లాయర్లు కూడా అందుబాటులో ఉంటారు. రాజీనామా చేయానుకున్న ఉద్యోగులు ‘ఎగ్జిట్’ కంపెనీ లో వెళితే కేవలం 20,000 యెన్ (భారత్ కరెన్సీ రూ.11600) కు వారి సమస్యను పరిష్కరిస్తుంది. వారు కేవలం ఉద్యోగం చేసే చివరి రోజు తెలపాలి. రాజీనామా పత్రం కూడా ‘ఎగ్జిట్’ కంపెనీ ప్రతినిధులు టైప్ చేసి వారి చేత సైన్ చేయించుకుంటారు.
ఆ తరువాత సదురు ఉద్యోగులు పనిచేసే సంస్థకు ఫోన్ చేసి ఇకపై సదరు ఉద్యోగి మీ సంస్థ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాడు. అతని చివరి పనిరోజు ఇది. కంపెనీకి సంబంధించిన వస్తువులు.. యూనిఫామ్, బూట్లు, ఐడీ కార్డు లాంటివి ఏమైనా ఉంటే వారికి అందజేయబడతాయి అని సమాచారం అందిస్తారు. అంటే ‘ఎగ్జిట్’ కంపెనీ రాజీనామా చేయబోతున్న ఉద్యోగి తరపున ఏజెంట్ లాగా పనిచేస్తుంది. వార్తా కథనం ప్రకారం.. ‘ఎగ్జిట్’ కంపెనీ బిజినెస్ చాలా విజయవంతంగా జరుగుతోంది. వారి క్లైంట్లు ఎక్కువగా చదువుకోని వారే. ప్రతీ సంవత్సరం ‘ఎగ్జిట్’ కంపెనీ 10000 మంది రాజీనామా సర్వేస్ ను అందిస్తోంది.
Also Read: ఉత్తర కొరియాలో వరదలు.. 30 అధికారులకు ఉరి శిక్ష వేసిన నియంత కిమ్..!
‘ఎగ్జిట్’ కంపెనీ సహ వ్యవస్థాపకుడు తోషియుకి నీనో మాట్లాడుతూ.. ”చాల మంది ఉద్యోగులు పని చేసే ప్రదేశంలో వేధింపులకు గురవుతుంటారు. రాజీనామా చేసినా యజమానులు ఆమోదించకుండా వారి చేత బలవంతంగా పని చేయించుకుంటుంటారు. ముఖ్యంగా చదువురాని వారు ఈ రకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వారికి సహాయం చేయాలనే ఆలోచనతోనే మా కంపెనీ మొదలైంది ” అని చెప్పారు. ‘ఎగ్జిట్’ కంపెనీ దందా బాగా నడవడంతో దానికి పోటీగా ‘ఆల్బట్రాస్’, ‘మొమోరీ’ (ఇక నా వల్ల కాదు) అనే కొత్త కంపెనీలు పుట్టుకొచ్చాయి. వీటిలో ఆల్బట్రాస్ బిజినెస్ కూడా పుంజుకుంది.
జపాన్ లో పనిచేసే అయుమీ సెకైన్ అనే ఉద్యోగి ఇంతకుముందు తను పనిచేసే కంపెనీలో పని నచ్చక రాజీనామా చేస్తే.. యజమాని తన రాజీనామాని ఆమోదించలేదని.. తన చేత బలవంతంగా పనిచేయించాడని.. అందుకే ఆల్బట్రాస్ కంపెనీకి 200 డాలర్లు చెల్లించి ఉద్యోగం నుంచి విముక్తి పొందానని చెప్పాడు.
ఆల్బట్రాస్ సిఈవో షిన్జీ టనిమోటో మాట్లాడుతూ.. ‘కొంతమంది కంపెనీ యజమానులు తమ వద్ద పనిచేసే వారిని బానిసలుగా భావిస్తారు. వారి వద్ద పనిచేసే ఉద్యోగులు బాస్ పెట్టే చిత్రహింసలు భరించలేక మా వద్దకు వస్తారు. మేము చట్టపరంగా ఒక లాయర్ ని నియమించుకున్నాం. ఆ లాయర్ చట్టపర్యంగా నోటీసులు జారీ చేసి సదరు ఉద్యోగికి సహాయం చేస్తాడు’ అని వివరించారు.
జపాన్ లో చాలామంది చిన్న స్థాయి ఉద్యోగులు, లేబర్ చేత ఎక్కువ గంటలు పనిచేయిస్తారని..వారికి ఆ ఎక్కువ పని గంటలకు జీతం కూడా ఇవ్వరని సమాచారం.