Aamir Khan takes a Sensational Decision on digital rights of his movie: బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ ఫెక్ట్ గా పాపులర్ అయిన నటుడు అమీర్ ఖాన్. దాదాపు 9 ఫిలింఫేర్ అవార్డులు, నాలుగు జాతీయ స్థాయి అవార్డులతో సహా పద్మభూషణ్ అవార్డును క ూడా అందుకున్న విశిష్ట హీరో అమీర్ ఖాన్. బాలనటుడిగా యాదోంకి బారాత్ లో నటించిన అమీర్ ఖాన్ ఖయామత్ సే ఖయామత్ తక్ మూవీతో స్టార్ హీరో రేంజ్ అందుకున్నారు. సొంత నిర్మాణ సంస్థలో లగాన్ మూవీని నిర్మించారు. ఆ మూవీ ఆస్కార్ కమిటీకి నామినేట్ అయింది. జాతీయ స్థాయి ఉత్తమ చిత్రంగా ఎంపికయింది. తారే జమీన్ పర్ మూవీని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. గజనీ, 3 ఇడియట్స్, ధూమ్ 2, పీకే, దంగల్ మూవీలన్నీ ఒకదానిని మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించాయి. బుల్లితెరపై సత్యమేవ జయతే అనే టాక్ షోకి హోస్ట్ గా చేశారు. దాదాపు రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న అమీర్ ఖాన్ త్వరలో తన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
లాల్ సింగ్ చద్దా ఫ్లాప్
రెండేళ్ల క్రితం విడుదలైన లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అమీర్ ఖాన్ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే 2023 క్రిస్మస్ కానుకగా సితారే జమీన్ పర్ విడుదల కావలసి ఉంది. కానీ ఈ మూవీ నిర్మాణ పనులలో జాప్యం తో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. తారే జమీన్ పర్ 2007లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ ఏడేళ్ల గ్యాప్ తర్వాత దానికి సీక్వెల్ గా సితారే జమీన్ పర్ మూవీ విడుదల కానుంది. ఈ మూవీ కూడా చిన్నపిల్లల నేపథ్యమే కావడం విశేషం. ఈ మూవీలో జెనీలియా కూడా నటిస్తోంది.అయితే ఈ మూవీ విషయంలో అమీర్ ఖాన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని తాను ఏ ఒక్కరికీ అమ్మదల్చుకోలేదని తేల్చారు. ప్రస్తుతం అందరూ కమర్షియల్ గా తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేస్తూ మరో పక్క డిజిటల్ రైట్స్ కు కూడా అమ్ముకుని రెండు రకాలుగా లబ్ది పొందుతున్నారు. ఒక పక్క థియేటర్లలో మూవీ ఆడుతుండగానే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో సినిమాలు చూసేస్తున్నారు ప్రేక్షకులు. దీనితో బయర్స్ నష్టపోతున్నారు. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడానికి నానా తంటాలు పడుతుంటే ఓటీటీ లో విడుదలై తమకు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయని వాపోతున్నారు.
డిజటల్ రైట్స్ పై షాకింగ్ నిర్ణయం
అమీర్ ఖాన్ కేవలం ఈ ఒక్క సినిమాకే కాదు భవిష్యత్ లో తన సినిమాలేవీ థియేటర్లలో ఆడుతుండగా డిజిటల్ రైట్స్ కు అమ్మకూడదని నిర్ణయించుకున్నారు. కనీసం సినిమా రిలీజయిన 12 వారాల గ్యాప్ తర్వాతే డిజిటల్ రైట్స్ కు అమ్మాలని తన అభిప్రాయాన్ని తెలిపారు. అమీర్ ఖాన్ వంటి హీరోలు ఇలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకోవడం ప్రస్తుతం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అసలే ఓటీటీలకు అలవాటు పడ్డ ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేస్తున్నారు. అమీర్ నిర్ణయంతో మళ్లీ థియేటర్లు కళకళలాడుతాయని సినీ వర్గాులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ప్రతి ఒక్క హీరో, నిర్మాత అమీర్ ఖాన్ లా ఆలోచిస్తే సినిమా పరిశ్రమను సంక్షోభం నుంచి కాపాడుకోగలుగుతామని అంటున్నారు. ఒక్కసారిగా లాభాలు అటు ,ఇటూ ఆశిస్తున్న కొందరు నిర్మాతలకు ఇలాంటి నిర్ణయం షాకింగే..టాలీవుడ్ లోనూ ఈ తరహా మార్పులు రావాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు