Chinese Man 17 Girlfriends: సాధారణంగా యువకులు ప్రేయాణాలు నడుపుతుంటారు. కొంత మంది ఒకేసారి ఒకరిని కాదని మరొకరితో డేటింగ్ చేసిన ఘటనలు చూశాం. కానీ, ఓ యువకుడు ఒకేసారి 17 మందితో ప్రేమాయణం నడిపాడు. తాజాగా ఆ యువకుడికి యాక్సిడెంట్ కావడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన షాకింగ్ ఘటన చైనాలో జరిగింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఒకేసారి హాస్పిటల్ కు వచ్చిన గర్ల్ ఫ్రెండ్స్
చైనాకు చెందిన 28 ఏండ్ల యువాన్ కు రీసెంట్ గా యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్లో చేరాడు. అసలు చిక్కు అక్కడే వచ్చిపడింది. ఈ విషయం యువాన్ గర్ల్ ఫ్రెండ్స్ కు తెలిసింది. వామ్మో యాక్సిడెంట్ అయ్యిందా? అని కంగారు పడ్డారు. అతడు ఎలా ఉన్నాడో తెలుసుకునేందుకు ఒక్కొక్కరుగా హాస్పిటల్ కు వచ్చారు. చివరకు 17 మంది అయ్యారు. అందరూ అక్కడికి రావడంతో ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. యువాన్ వీళ్లందరితో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపించాడని తెలియడంతో షాకయ్యారు. వారందరినీ చూసి యువాన్ ప్రాణం పోయినంత పని అయ్యింది. ఇంతకాలం తనకే సొంత అనుకున్న వ్యక్తి ఇంతా మోసం చేస్తాడని అస్సలూ ఊహించలేకపోయారు. కోపంతో ఊగిపోయారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతులు
ప్రస్తుతం యువాన్ వ్యవహారం చైనాలో హాట్ టాపిక్ గా మారింది. సదరు యువతులు అంతా ఇకపై అతడికి దూరంగా ఉండటంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావించారట. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. యువాన్ లాంటి వారి వల్ల అసలు ప్రేమ అనే మాటకే విలువలేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువాన్ కోలుకున్న తర్వాత అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నారు.
భార్యతో పాటు నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ..
రీసెంట్ గా చైనాలో ఇంటి ఘటనే జరిగింది. భార్యతో పాటు ఏకంగా నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ను మెయింటెయిన్ చేశాడు. వీరందరినీ ఒకే అపార్ట్ మెంట్ లో ఉంచి, ఒకరికి తెలియకుండా మరొకరితో గడిపేవారు. ఈ నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ లో ఇద్దరు మహిళలు, అదే మహిళలకు చెందిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. చివరకు అసలు విషయం బయపడటంతో జైల్లో చిప్పకూడు తింటున్నాడు. ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్ కు చెందిన జియోజున్ పేద కుటుంబంలో జన్మించాడు. డబ్బులు లేక, చదువు మధ్యలోనే ఆపేశాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు. కానీ, బయటకు ధనవంతుడిలా పోజులు కొట్టేవాడు. అలా ఓ యువతిని ప్రేమలో పడేశాడు. నకిలీ లగ్జరీ గిఫ్టులు ఇచ్చేవాడు. తన తల్లిదండ్రులు వ్యాపారవేత్తలని చెప్పేవాడు. వాస్తవానికి అతడి తల్లిదండ్రులు కార్మికులుగా పని చేసేవారు. ఆ విషయాన్ని దాచిపెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత అసలు విషయం తెలిసి అతడిని ఇంటి నుంచి బయటకు గెంటేసింది. ఆ తర్వాత ధనవంతుడిగా ఫోజులు కొడుతూ మరికొంత మందిని మాయచేశాడు. చివరకు అసలు విషయం బయటపడటంతో ఊచలు లెక్కబెడుతున్నాడు.