చైనాలో ఓ వ్యక్తి చేసిన పని సినిమా స్టోరీని తలదన్నేలా ఉంది. ఓ భార్యతో పాటు ఏకంగా నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ను మెయింటెయిన్ చేశాడు. వీరందరినీ ఒకే అపార్ట్ మెంట్ లో ఉంచి, ఒకరికి తెలియకుండా మరొకరితో గడిపేవారు. ఈ నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ లో ఇద్దరు మహిళలు, అదే మహిళలకు చెందిన ఇద్దరు పిల్లలు కూడా ఉండటం విశేషం. చివరకు అసలు విషయం బయపడటంతో జైల్లో చిప్పకూడు తింటున్నాడు.
ధనవంతుడిగా కలరింగ్ ఇస్తూ..
ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్ కు చెందిన జియోజున్ పేద కుటుంబంలో జన్మించాడు. డబ్బులు లేక, చదువు మధ్యలోనే ఆపేశాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు. కానీ, బయటకు ధనవంతుడిలా పోజులు కొట్టేవాడు. అలా ఓ యువతిని ప్రేమలో పడేశాడు. నకిలీ లగ్జరీ గిఫ్టులు ఇచ్చేవాడు. తన తల్లిదండ్రులు వ్యాపారవేత్తలని చెప్పేవాడు. వాస్తవానికి అతడి తల్లిదండ్రులు కార్మికులుగా పని చేసేవారు. ఆ విషయాన్ని దాచిపెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత అసలు విషయం తెలిసి అతడిని ఇంటి నుంచి బయటకు గెంటేసింది.
ఒకే అపార్ట్ మెంట్ లో.. ఒకరికి తెలియకుండా మరొకరితో..
భార్య ఇంటి నుంచి తరిమివేయడంతో కొద్ది రోజుల్లోనే ఆన్ లైన్ గేమ్ ద్వారా జియాహోంగ్ తో పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు కూడా తానో ధనవంతుడిగా పరిచయం చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆమె కూడా తనను నమ్మింది. ఓ ఇంటిని కడుతున్నానని కాస్త డబ్బు అవసరం ఉందని చెప్పి 140,000 యువాన్లను (సుమారు రూ. 16 లక్షలు) తీసుకున్నాడు. ఆమెను కూడా తన భార్య ఉండే అపార్ట్ మెంట్ లోనే మరో ఇంట్లో ఉంచాడు. ఆమె కూడా ప్రెగ్నెంట్ అయ్యింది.
ఆ తర్వాత నెమ్మదిగా అదే అపార్ట్ మెంట్ లోని మరో ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. యూనివర్సిటీలో చదువుతున్న జియోమిన్, జియాక్సిన్తో పాటు నర్సు జియోలాన్ ను ముగ్గులోకి దింపాడు. ఈ ముగ్గురి నుంచి సుమారు 280,000 యువాన్లను (రూ. 31 లక్షలు)ను తీసుకున్నాడు. జియాక్సిన్ తన ట్యూషన్ ఫీజు కోసం డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో, ఓ లగ్జరీ కారును రెంట్ కు తీసుకుని, అందులో వచ్చి ఓ నల్ల బ్యాగ్ ను ఆమెకు ఇచ్చాడు. దానిలో లక్ష యువాన్లు ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడే దాన్ని ఓపెన్ చెయ్యొద్దన్నాడు. ఇంటికి వెళ్లి ఆమె బ్యాగ్ ఓపెన్ చేయడంతో అందులో బ్యాంక్ నోట్ ప్రాక్టీస్ బిల్లులు తప్ప మరేమీ లేవు. ఆమె వెంటనే జియోజున్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణలో షాకింగ్ విషయం తెలిసింది. జియోజున్ ఇద్దరు మహిళలతో పాటు వారి కూతుర్లతోనూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని తేలింది.
తొమ్మిదేండ్ల జైలు శిక్ష. రూ. 13 లక్షల జరిమానా
జియోజున్ నేరం నిరూపణ కావడంతో కోర్టు అతడికి తొమ్మిది సంవత్సరాల 6 నెలల జైలు శిక్ష విధించింది. 120,000 యువాన్ల (సుమారు రూ. 13 లక్షలు) జరిమానా విధించింది. అతడి చేతిలో మోసపోయిన మహిళలకు పరిహారం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది.
Read Also:ట్రంప్ ను గెలిపించారు, ఇక మీతో ‘ఆ పని’ చేయం, అమెరికాలో పురుషులకు మహిళల షాక్!