BigTV English

Russia President Putin : ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌లో యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు

Russia President Putin : ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌లో యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు

russia president putin latest news


Putin was elected as the President of Russia for the 5th time(Today’s International news): ఐదోసారి వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 88శాతం ఓట్లతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో శాంతి కోసం తాను సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ ప్రకటించడం సంచలనమైంది. సంవత్సర నుంచి ఉక్రెయిన్‌ రష్యా మధ్య భీకర యుద్దం కొనసాగుతుండగా.. ఈ పరిస్థితుల్లో పుతిన్ ఉక్రెయిన్‌లో శాంతి స్ధాపనకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని నిబంధనలతో మాత్రమే.. ఉక్రెయిన్‌లో శాంతి కోసం స్ధాపనకు అంగీకరంగా ఉన్నట్లు తెలిపారు. ఇక నాటో నేలపై బూట్లు వేస్తే అణుయుద్ధమేనని పుతిన్ హెచ్చరించాడు.

Also Read : నేను అధికారంలోకి రాకపోతే దేశంలో రక్తపాతం మొదలవుతుంది: ట్రంప్


మార్చి 15 నుంచి 17 వరకూ జరిగిన అధ్యక్ష ఎన్నికలు.. చిన్న చిన్న ఘర్షణలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. 1999 నుంచి రష్యా అధ్యక్ష పదవిలో వ్లాదిమిర్ పుతిన్ కొనసాగుతున్నారు. తాజాగా ముగిసిన ఎన్నికల్లో పుతిన్ తో కలిపి నలుగురు అధ్యక్ష రేసులో నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో పుతిన్ అత్యధిక ఓట్లు సాధించి ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే.. నావల్నీ అనుమానాస్పద మృతి, ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న ఓటర్లు తమ ఓటుతో పుతిన్ కు బుద్ధి చెప్పాలని నావల్నీ మద్దతుదారులు పిలుపునిచ్చారు. దీంతో మూడోరోజు ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఓటింగ్ కంటే ముందే జరిగిన సర్వేల్లో మరోసారి పుతినే అధికారం చేపడుతారని తేలింది. 24 ఏళ్లుగా రష్యా అధ్యక్షుడిగా ఉన్న పుతిన్.. అసమ్మతి గళాన్ని అణచివేస్తూ పాలనసాగించారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×