BigTV English

NASA Sunitha Williams: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్‌.. నాసా స్వయంగా స్పేస్‌క్రాఫ్ట్ పంపించలేదా?

NASA Sunitha Williams: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్‌.. నాసా స్వయంగా స్పేస్‌క్రాఫ్ట్ పంపించలేదా?

NASA Sunitha Williams| బోయింగ్ కంపెనీకి చెందిన స్పేస్‌క్రాఫ్ట్ (అంతరిక్ష విమానం) అంతరిక్షంలో కొన్ని నెలల క్రితం అమెరికా పరిశోధనా సంస్థకు చెందిన ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌ను తీసుకెళ్లింది. అయితే ఆ స్పేస్‌క్రాఫ్ట్ దారిలోనే టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో అతి కష్టాలు పడి అంతరిక్షంలోని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ వరకు చేరుకుంది. అయితే స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ లో చాలా భాగాలు సరిగా పనిచేయకపోవడంతో అందులో తిరుగు ప్రయాణం సురక్షితం కాదని ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలోనే ఉండిపోయారు. వారు అక్కడ ఫిబ్రవరి 2025 వరకు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.


అయితే కొన్ని రోజుల క్రితం స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ భూమికి తిరిగివచ్చేసింది. అందులో మనుషులెవరూ లేరు. మరి కొన్ని రోజుల తరువాత ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ తమ కొత్త స్పేస్‌క్రాఫ్ట్.. స్పేస్ ఎక్స్ ‘క్రూ 9 డ్రాగన్ ‘ అంతరిక్షంలోకి బయలు దేరనుంది. అందులో ఏడు మంది అంతరిక్షంలోకి ప్రయాణించ నుండగా.. నాసా వారిని సంప్రదించింది.

అంతరిక్షంలో చిక్కుకొని ఉన్న తమ వ్యోమగాములను తిరిగి తీసుకురావాలని కోరింది. దీంతో క్రూ 9 డ్రాగన్ లో ఏడుగురు వ్యోమగాములకు బదులు నలుగురే ప్రయాణించబోతున్నారు. అయితే అంతరిక్షంలోకి వెళ్లాక క్రూ 9 డ్రాగన్ తిరిగి ఫిబ్రవరి 2025లో నే భూమికి చేరుకుంటుంది. ఆ సమయం వరకు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితి.


Also Read| Dubai Princess Perfume: అప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకులు.. ఇప్పుడు ఏకంగా డివోర్స్ పేరుతో కొత్త బిజినెస్!

ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన వ్యోమగాములని రక్షించేందుకు అంతరిక్షంలోకి స్వయంగా నాసా లాంటి పెద్ద పరిశోధనా సంస్థ ఒక స్పేస్‌క్రాఫ్ట్ పంపించలేదా? స్పేస్ ఎక్స్ లాంటి ఇతర కంపెనీలపై ఆధారపడాలా? అని ప్రపంచవ్యాప్తంగా అనుమానం కలుగుతోంది.

కానీ ఈ విషయం అంత తేలిక కాదు. ముందుగా అంతరిక్షంలోకి స్పేస్‌క్రాఫ్ట్ పంపించడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. పైగా అంతరిక్షంలో ఉన్న ఇద్దరు వ్యోమగాములు అందరూ భావించినట్లు పెద్దగా కష్టాలు పడడం లేదు. వారికి తగిన ఆహారం, ఇతర సామాగ్రి అందుబాటులో ఉంది. పైగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో ఇతర దేశాల వ్యోమగాములు కూడా ఉన్నారు. వీరిద్దరితో కలిపి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో మొత్తం 9 మంది వ్యోమగాములున్నారు. పైగా సెప్టెంబర్ 11న రష్యా నుంచి మరో స్పేస్‌క్రాఫ్ట్ బయలుదేరి అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ చేరుకుంది.

వీరితో పాటు పక్కనే చైనా స్పేస్ స్టేషన్ ఉంది. అందులో ముగ్గురు చైనా వ్యోమగాములున్నారు. వీరందరికీ ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచి తప్పించుకోవడానికి కొన్ని భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి స్పేస్ స్టేషన్ లో అగ్నిప్రమాదం సంభవించినా.. వీరందరూ అక్కడి నుంచి కొంత దూరం వరకు ప్రయాణించి భూ గ్రహానికి సమీపంగా చేరడానికి లైఫ్ బోట్లు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాయి.

నవంబర్ 15, 2021న అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో అగ్నిప్రమాదం సంభవించగా అక్కడ చిక్కుకున్న ఏడుగురు వ్యోమగాములు ఇలాగే తప్పించుకున్నారు. అందుకే సునీతా విలియమ్స్, ఇతర వ్యోమగాములకు ప్రస్తుతానికి వచ్చిన ప్రాణహాని ఏమీ లేదని నాసా అధికారులు ఇటీవల స్పష్టం చేశారు.

Related News

Karachi city: జలదిగ్బంధంలో కరాచీ సిటీ.. వెంటాడుతున్న వర్షాలు, నిలిచిన విద్యుత్, ఆపై అంధకారం

America Tariffs: రష్యాపై ఒత్తిడికోసమే భారత్ పై సుంకాల మోత.. అసలు విషయం ఒప్పుకున్న అమెరికా

Spain Wildfires: స్పెయిన్‌లో కార్చిచ్చు.. 20 ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు.. ఇదిగో వీడియో..

Afghanistan: బస్సులో చెలరేగిన మంటలు.. 71 మంది సజీవదహనం!

Russia Ukraine War: ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తా! జెలెన్‌స్కీతో ట్రంప్ సంచలన భేటీ..

Congo Massacre: కాంగోలో దారుణం.. వెంటాడి మరీ 52 మందిని చంపేశారు

Big Stories

×