BigTV English

USA Immigrants Military Planes: అక్రమ వలసదారులను మిలిటరీ విమానాల్లో తరలిస్తున్న ట్రంప్.. ఒక్కో వలసదారుడిపై రూ.5లక్షలు ఖర్చు?

USA Immigrants Military Planes: అక్రమ వలసదారులను మిలిటరీ విమానాల్లో తరలిస్తున్న ట్రంప్.. ఒక్కో వలసదారుడిపై రూ.5లక్షలు ఖర్చు?

USA Immigrants Military Planes| అమెరికాలో అక్రమ వలసదారులను తిరిగి పంపించే ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది. 205 మంది భారతీయులతో కూడిన సి-17 మిలిటరీ విమానం అమెరికాలోని టెక్సాస్ నుంచి మంగళవారం బయల్దేరింది. ఈ విమానం భారతదేశంలోని అమృత్సర్ నగరానికి బుధవారం చేరుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో భారత విదేశాంగ శాఖ సమన్వయం కూడా ఉందని సమాచారం వెల్లడైంది.


ఇంతకు ముందు వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను తిరిగి పంపించిన సంగతి తెలిసిందే. అయితే భారతదేశానికి సంబంధించి ఇదే తొలి అడుగు. వచ్చే వారం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారులను తిరిగి పంపించే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది.

అమెరికాలో సరైన పత్రాలు లేని భారతీయులు ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది. మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత అత్యధికంగా ఉన్నవారు భారతీయులే. వీరందరినీ తిరిగి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ క్రమంలో సుమారు 18 వేల మంది భారతీయులతో కూడిన తొలి జాబితాను అక్కడి ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రూపొందించినట్లు తెలుస్తోంది.


అయితే అక్రమ వలసదారులను ట్రంప్ వెనక్కు పంపించేందకు మిలిటరీ విమానాలు ఉపయోగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందకంటే మిలిటరీ విమానాల ద్వారా రవాణా చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కొన్ని రోజుల క్రితమే కొలంబియా దేశానికి అక్రమ వలసదారులను ట్రంప్ ప్రభుత్వం ఒక మిలిటరీ విమానంలో తరలించారు. కానీ ఆ విమానాన్ని తమ దేశంలో ల్యాండ్ చేయనిచ్చేది లేదని కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో ప్రకటించారు. అక్రమ వలసదారులుంటే పౌర విమానాల్లో పంపించాలి గానీ ఇలా మిలిటరీ విమానాల్లో ఎందుకు పంపిస్తున్నారని ట్రంప్ యంత్రాగంపై మండిపడ్డారు. మరి అధిక ఖర్చు, ఇతర దేశాల నుంచి వ్యతిరేకత ఉన్నా ట్రంప్ ప్రభుత్వం ఎందుకు మిలిటరీ విమానాలను డిపోర్టేషన్ కోసం ఉపయోగిస్తుందనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కోసం పరిశీలించే క్రమంలో వలసదారుల తిరుగు ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతోందో ఒకసారి చూద్దాం.

Also Read: అమెరికాలో లక్షల సంఖ్యలో భారత అక్రమ వలసదారులు.. ట్రంప్ అందరినీ ఇండియా పంపగలారా?

సాధారణంగా రెగులర్ కమర్షియల్ సివిల్ ప్లేన్స్ లేదా చార్టర్ విమానాల్లో అమెరికా అక్రమ వలసదారులను వారి దేశాలకు తిరిగి పంపించేస్తూ ఉంటుంది. ఇది మామూలుగా జరిగే ప్రక్రియే. దీన్ని అమెరికా కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ) విభాగం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక మిలిటరీ విమానాల్లో ప్రత్యేకంగా వలసదారులను తిరిగి వారి దేశాలను డిపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సి-17 సైనిక విమానాల్లో డిపోర్ట్ చేయడం ప్రత్యేకం. ఈ సి-17 విమానంలో తీసుకెళ్లడానికి ఒక్కో అక్రమ వలసదారుడిపై అమెరికా ప్రభుత్వం 4675 డాలర్లు వెచ్చిస్తోంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.4లక్షల 7వేలు. కానీ ఒక కమర్షియల్ ప్యాసింజర్ విమానంలో అమెరికా నుంచి భారత్ కు ప్రయాణించాలంటే అమెరికన్ ఎయిర్ లైన్స్ లో ఒక వ్యక్తి వన్ వే ఫస్ట్ క్లాస్ టికెట్ ధర కేవలం 853 డాలర్లు (దాదాపు రూ.74వేలు) మాత్రమే.

ఏప్రిల్ 2023 ఐసిఈ విభాగం డేటా ప్రకారం.. సాధారణంగా డిపోర్టేషన్ విమానాల ఫ్లైట్ ఖర్చు గంటకు 17000 డాలర్లు (దాదాపు రూ.15 లక్షలు). ఇందులో 135 మంది అక్రమ వలసదారులను ఒక విమానంలో పంపుతారు. అంటే ఖర్చు 630 డాలర్లకు (దాదాపు రూ.55,000) తగ్గిపోతుంది.

కానీ మిలిటరీ విమానం ఖర్చు గంటకు 28,500 డాలర్లు (దాదాపు రూ.25 లక్షలు). ఇండియా లాంటి సుదూర దేశాలకు అమెరికా నుంచి విమానం పంపించాలంటే ఖర్చు ఇంకా పెరిగిపోతుంది. ఇంత ఖర్చు అవుతున్నా ట్రంప్ మిలిటరీ ప్లేన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే ఇది ఆయన తన నిర్ణయాల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తారనేందుకు చిహ్నంగా చూపించుకుంటున్నారు. ఇటీవలే ఆయన మెక్సికో, కొలంబియా దేశాలకు చెందిన అక్రమ వలసదారులను మిలిటరీ విమానాల్లో పంపించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. ఈ విమానాల్లో అక్రమ వలసదారులను చేతికి బేడీలు వేసి అమెరికా సైనికులు వారి స్వదేశాలకు తరలించారు. ఇది ఇతర దేశాలు మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నాయి.

కానీ ట్రంప్ మాత్రం వారం క్రిమినల్స్ అని, ఏలియన్స్ (ఇతర గ్రహాలకు చెందినవారు) అని పరుష పదాలతో సంబోధిస్తూ.. వారితో అలాగే కఠినంగా ప్రవర్తిస్తామని సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. అంతటితో ఆగక.. తన రిపబ్లికన్ పార్టీ సభ్యులను ఉద్దేశించి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. “అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను గుర్తించడం జరుగుతోంది. ఈ ఇల్లీగల్ ఏలియన్స్ ని మిలిటరీ విమానంలో ఎక్కించి వారి దేశాలకు పంపుతున్నాం. ప్రపంచదేశాలు మన దేశాన్ని మూర్ఖుల దేశంగా ఇంతకాలం చూసింది. కానీ ఇప్పుడు మనకు తగిన గౌరవం లభిస్తుంది.” అని చెప్పారు. ఈ మాటలు చాలు ఆయన అక్రమ వలసదారుల పట్లు ఎంత కఠినంగా ఉన్నారో తెలుసుకోవడానికి.

ట్రంప్ లక్ష్యాల్లో ముఖ్యమైనది అక్రమ వలసదారుల సమస్యను వీలైనంత వరకూ త్వరగా పరిష్కరించడం. అందుకోసం ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా అక్రమ వలసదారులను అమెరికాలో ఖైదు చేసి శరణార్థి శిబిరాల్లో పెడతారు. ఆ తరువాత వారిపై కోర్టుల్లో కేసుల విచారణ సాగుతుంది. కానీ ఇదంతా జరగడానికి చాలా సంవత్సరాలే పడుతుంది. ఈ కారణంగానే ట్రంప్.. “ఈ అక్రమ వలసదారులు అమెరికా గడ్డపై కోర్టుల విచారణ పేరుతో 20 సంవత్సరాలు ఉంటారు. వారిని మేము పెంచి పోషించాలా? అలా వద్దు. వారినంతా వాళ్ల దేశాలు తిరిగి తీసుకోవాలి” అని డిసెంబర్ లోనే చెప్పారు.

 

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×