BigTV English

Thailand Monks: కిలాడి వలపు వలలో బౌద్ధ సన్యాసులు విలవిల.. థాయిలాండ్ లో గోలగోల

Thailand Monks: కిలాడి వలపు వలలో బౌద్ధ సన్యాసులు విలవిల.. థాయిలాండ్ లో గోలగోల

థాయిలాండ్ బౌద్ధానికి పెట్టింది పేరు. థేరవాద శాఖ అక్కడ విస్తరించింది. బౌద్ధ సన్యాసులను ప్రజలు గౌరవిస్తారు, పూజిస్తారు, వారికి కానుకలు సమర్పిస్తారు. అలాంటి దేశంలో బౌద్ధ సన్యాసులు ఓ వగలాడి వలలో చిక్కుకున్నారు. ఏకంగా 11మంది ఆ కిలేడీ మాయలో పడ్డారు. సర్వం సమర్పించుకున్నారు. సన్యాసాన్ని వదిలేసి ఆ వయ్యారితో సయ్యాటలాడారు. అక్కడితో కథ పూర్తి కాలేదు. సన్యాసులకు సంసార సుఖం రుచిచూపించిన ఆ వయ్యారి వారితో వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేసింది. ఇంకేముంది వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేసింది. సన్యాసులే కదా వారి దగ్గర ఏముంటుంది అనుకుంటే మనం అమాయకులం అయినట్టే. 11 మంది బౌద్ధ సన్యాసుల నుంచి ఏకంగా 102 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఆ వగలాడి. అవన్నీ ప్రజలు వారిని భగవత్ స్వరూపులుగా నమ్మి సమర్పించిన కానుకలే. ప్రజలు బౌద్ధ సన్యాసులకు సమర్పిస్తే, ఆ సన్యాసులు కాస్తా ఆమెకు చెల్లించుకున్నారు. మూడేళ్లుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. ఇటీవలే పోలీసులు ఈ సెక్స్ స్కాండల్ ని బయటపెట్టారు.


80వేల ఫొటోలు, వీడియోలు..
11మందిని బ్లాక్ మెయిల్ చేసిన ఆ కిలాడి ఏకంగా 80వేల ఫొటోలు, వీడియోలను అడ్డు పెట్టుకుని ఈ కథంతా నడిపించింది. వారి వల్ల తాను గర్భవతిని అయ్యానని చెప్పేది, మెయింటెనెన్స్ కోసం డబ్బులు వసూలు చేసేది. అందినకాడికి అంతా లాగేసేది. ఎవరైనా డబ్బులు ఇవ్వలేమని తెగేసి చెబితే ఫొటోలు బయటపెడతానంటూ బెదిరించేది. ఈమె దెబ్బకు ఆ సన్యాసులు అవస్థలు పడ్డారు. తమ వద్ద ఉన్నదంతా ఆమెకు బదిలీ చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సన్యాసాన్ని వదిలేయడంతో అతనిపై అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులు కూడా కూపీ లాగారు. దీంతో వ్యవహారం బయటపడింది. సన్యాసులనుంచి అక్రమంగా డబ్బులు బదిలీ అవడాన్ని పోలీసులు గుర్తించారు. వారిపై నిఘా పెట్టి అసలు విషయం రాబట్టారు.

227 నిబంధనలు
థాయ్ సన్యాసులు అంత ఘోరంగా ఎలా మోసపోయారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సాధారణంగా థాయ్ లో సన్యాసాశ్రమం స్వీకరించడం చాలా కష్టం. వారికి కఠిన నియమాలుంటాయి. వారంతా ఆడవారికి దూరంగా ఉంటారు. స్త్రీలు సమర్పించే కానుకల్ని కూడా వారు చేతితో తాకరు. 227 కఠిన నియమాలను వారు పాటిస్తారని చెబుతారు. థాయ్ పురుషులు సాంప్రదాయకంగా కొన్ని వారాల పాటు స్వచ్ఛందంగా సన్యాసాన్ని స్వీకరిస్తారు. తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా సన్యాసులుగా ఉంటారు. ఆ నియమాలన్నీ పాటిస్తారు. సన్యాసులు సాంప్రదాయకంగా భిక్ష స్వీకరిస్తారు. ప్రజలు అందించే ఆహార నైవేద్యాలే తీసుకుంటారు. వారికి ప్రభుత్వం తరపున పెన్షన్ కూడా వస్తుంది. ప్రజలు ఇచ్చే కానుకలు అదనం. ఆధ్యాత్మిక ప్రసంగాలతో వారు ప్రజల్ని ఆకట్టుకుంటారు. అయితే ఇప్పుడు అక్కడ సీన్ రివర్స్ అయింది. సన్యాసుల్ని చాలామంది అసహ్యించుకుంటున్నారు.


రాజాగ్రహం..
థాయిలాండ్ లో ఈ సంచలన సెక్స్ స్కాండల్ బయటపడటంతో స్థానికులు అవాక్కయ్యారు. బౌద్ధ సన్యాసుల పట్ల గౌరవం సన్నగిల్లిందని అంటున్నారు. వారు చేసిన పనిని అసహ్యించుకుంటున్నారు. ఇటీవల తాము ఆశ్రమాల వైపు వెళ్లడం లేదని చెబుతున్నారు. ఆశ్రమాలకు ఇచ్చేందుకు దాచుకున్న డబ్బుని సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నారు భక్తులు. థాయిలాండ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ తన రాబోయే 73వ పుట్టినరోజు వేడుకల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిన 80 మంది సన్యాసుల ఆహ్వానాలను రాజు రద్దు చేశారు. సన్యాసులు ఇప్పుడు రోడ్డుపై తిరగడానికి కూడా అవకాశం లేదని అంటున్నారు.

అయితే కొంతమంది మాత్రం సన్యాసులు చేసిన తప్పుకి బౌద్ద మతాన్ని ద్వేషించకూడదని చెబుతున్నారు. అది కొంతమంది వ్యక్తులు చేసిన తప్పుగానే పరిగణించాలని అంటున్నారు. బౌద్ధమతం బోధనల గురించి కానీ.. అందులో విఫలమైన వ్యక్తుల గురించి కాదని అంటున్నారు. బౌద్ధం పట్ల నమ్మకం కోల్పోకూడదని, అదే సమయంలో ఇలాంటి సన్యాసుల పట్ల కఠినంగా ఉండాలని అంటున్నారు. మొత్తమ్మీద థాయిలాండ్ లో ఈ కుంభకోణం బౌద్ధ సన్యాసుల్ని ఇరకాటంలో పడేసింది. సన్యాసులంటేనే అక్కడ అనుమానంగా చూసే పరిస్థితి మొదలైంది.

Related News

Afghan Women: అఫ్ఘాన్ భూకంప శిథిలాల్లో మహిళలు.. బతికున్నా రక్షించకుండా వదిలేసిన మగాళ్లు!

MRI Accident: మెడలో మెటల్ చైన్‌తో ఎంఆర్ఐ గదిలోకి.. క్షణాల్లో ప్రాణం గాలిలోకి.. ఎక్కడంటే?

Donald Trump: భారత్‌తో సంబంధాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు… కుట్రబుద్ధి ఉన్న చైనాతో..?

Putin: 150 ఏళ్లు బతకొచ్చు.. ఎలాగంటే..! పుతిన్ చెప్పిన సీక్రెట్స్..

China Military Parade: ఆ ముగ్గురు కలిస్తే తట్టుకోవడం కష్టమే.. భయంలో ట్రంప్

India USA: మోదీ మైండ్ గేమ్.. ట్రంప్ చాప్టర్ క్లోజ్! ఇండియా లేకపోతే అమెరికా పరిస్థితి ఇదే..

Big Stories

×