Match Referee : సాధారణంగా క్రికెట్ (Cricket) లో ఆటగాళ్లు, ఎంఫైర్లతో పాటు మ్యాచ్ రిఫరీ కూడా ఈ విషయం కొంత మందికి మాత్రమే తెలుసు. చాలా మందికి మ్యాచ్ రిఫరీ గురించి తెలియకపోవచ్చు. వాస్తవానికి టాస్ వేసే సమయంలో కనిపించే రిఫరీ ఇక ఆ తరువాత అస్సలు కనిపించడు. మ్యాచ్ రిఫరీ (Match Referee) అంటే ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్ లను పర్యవేక్షించడానికి నియమించబడిన అధికారి. టెస్ట్ మ్యాచ్ లు, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు మ్యాచ్ రిఫరీలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నియమిస్తుంది. అంతర్జాతీయ స్థాయి కంటే తక్కువ ఉన్న చాలా మ్యాచ్ లకు రిఫరీ ఉండడు. మ్యాచ్ రిఫరీ బాధ్యత ఏమిటంటే..? ఆట సమయంలో ఐసీసీ క్రికెట్ ప్రవర్తనా నియమావళిని పాటించడం. నిబంధనలను ఉల్లంఘించడాన్ని అంచనా వేయడం.. ఏదైనా ఉల్లంఘనలకు జరిమానాలు విధించడం. ప్రతి ఆట తరువాత మ్యాచ్ రిఫరీ ఒక మ్యాచ్ నివేదికను రూపొందించి ఐసీసీకి సమర్పిస్తాడు.
Also Read : Jos Buttler: టీమిండియా బలుపు వల్లే.. లార్డ్స్ లో ఓడిపోయారు
మాజీ క్రికెటర్లు.. మ్యాచ్ రిఫరీలు..
ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఆందోళన కలిగించే ఆటగాళ్లు లేదా అంపైర్లు ఏవైనా సంఘటనలు లేదా చర్యలను గమనిస్తాడు. పిచ్ నాణ్యతకు రేటింగ్ కూడా ఇస్తాడు. మ్యాచ్ రిఫరీ ఆట జరుగుతున్న సమయంలో అన్ని సమయాల్లో మైదానానికి దూరంగా ఉంటాడు. ప్రేక్షకుల ప్రాంతం నుంచి సంఘటనలను గమనిస్తాడు. ఆటకు సంబంధించి రిఫరీ ఎళాంటి నిర్ణయాలు తీసుకోడు. నిర్ణయాలు నియమించబడిన అంఫైర్ల బాధ్యత. మ్యాచ్ రిఫరీలుగా మాజీ క్రికెట్ ఆటగాళ్లు ఉంటారు. రంజన్ మదుగలే, క్రిస్ బాండ్, జెఫ్ క్రో, డేవిడ్ బూన్, జవగల్ శ్రీనాథ్ వంటి ప్రముఖ మ్యాచ్ రిఫరీలు( Match Referees) ఉన్నారు. అంఫైర్లు కేవలం నిర్ణయాలు తీసుకుంటే.. మ్యాచ్ మొత్తం పై రిఫరీలకు నియంత్రణ బాధ్యతలుంటాయి. మ్యాచ్ ల్లో ఐసీసీ రూల్స్ అమలు చేయడం, ఆటగాళ్ల ప్రవర్తన, అంఫైర్ల నిర్ణయాలను రిఫరీలు పర్యవేక్షిస్తారు. మ్యాచ్ పూర్తయ్యాక దానిపై నివేదికలను ఐసీసీకి సమర్పిస్తారు.
Also Read : AB De villiers : AB డివిలియర్స్ రీ ఎంట్రీ.. 360 డిగ్రీ బ్యాట్ తోనే
క్రమశిక్షణా పర్యవేక్షణ
మరోవైపు రూల్స్ అతిక్రమించిన ఆటగాళ్లకు షైన్లు వేస్తారు. క్రికెట్ లో మ్యాచ్ రిఫరీ బాధ్యతలు న్యాయమైన ఆటను సమర్థించడం నుంచి ఆట సమగ్రతను కాపాడటం వరకు ఉంటాయి. మ్యాచ్ రిఫరీ కీలక పాత్రపోషిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, జాతీయ బోర్డు నియమించిన మ్యాచ్ లను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించిన మ్యాచ్ రిఫరీ బాధ్యతలు బౌండరీ తాడులకు మించి విస్తరించి.. న్యాయమైన ఆటను నిర్దారిస్తూ.. క్రీడా సారాంశానికి కట్టుబడి ఉంటాయి. ముఖ్యంగా కార్యకలాపాలను ట్రాక్ చేయడం, అంఫైర్ పని తీరు నివేదిక, మ్యాచ్ అనంతరం సమావేశాలు, పిచ్ రేటింగ్, క్రమశిక్షణా పర్యవేక్షణ, ఆటగాడి ప్రవర్తన వంటి విషయాలపై నివేదించడం చేస్తుంటారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు అంపైర్లతో వివాదాలు పెట్టుకోవడం.. మరో జట్టు ఆటగాళ్లతో గొడవలు పెట్టుకోవడం వంటివి పర్యవేక్షిస్తారు మ్యాచ్ రిఫరీ. ఇటీవల టీమిండియా ఆటగాడు మహ్మద్ సిరాజ్ పై మ్యాచ్ ఫీజులో కోత విధించిన విషయం తెలిసిందే.