BigTV English

Woman Marries Her Son : తల్లిని వివాహం చేసుకున్న యువకుడు

Woman Marries Her Son : అనాథ పిల్లల్ని చాలామంది సంతానం లేనివారు దత్తత తీసుకొని పెంచుకుంటారు. దీంతో తల్లిదండ్రులకు మానసిక సంతోషం లభిస్తే.. పిల్లలకు ఒక మెరుగైన జీవితం దొరుకుతుంది. ఆ పిల్లలను చూసుకుంటూ ఆ దత్తత తీసుకున్న తల్లిదండ్రులు మాతృత్వపు ప్రేమ అనుభూతిని పొందుతారు.

Woman Marries Her Son : తల్లిని వివాహం చేసుకున్న యువకుడు

Woman Marries Her Son : అనాథ పిల్లల్ని చాలామంది సంతానం లేనివారు దత్తత తీసుకొని పెంచుకుంటారు. దీంతో తల్లిదండ్రులకు మానసిక సంతోషం లభిస్తే.. పిల్లలకు ఒక మెరుగైన జీవితం దొరుకుతుంది. ఆ పిల్లలను చూసుకుంటూ ఆ దత్తత తీసుకున్న తల్లిదండ్రులు మాతృత్వపు ప్రేమ అనుభూతిని పొందుతారు. అలాంటిది ఓ మహిళ తను దత్తత తీసుకున్న పుత్రుడినే ప్రేమించి పెళ్లి చేసుకుంది. వినడానికే వింతా ఉంది. ఇలా కూడా జరుగుతుందా అనే ఆశ్చర్యం కలుగుతుంది.


వివరాల్లోకి వెళితే.. రష్యా దేశంలోని టాటార్ సాన్‌ రాష్ట్రం కజాన్ ప్రాంతానికి చెందిని 53 ఏళ్ల ఐసిలు చిజేవ్‌స్కాయా మింగలిమ్ అనే మహిళ ఇటీవల తను దత్తత తీసుకున్న డేనియల్(22)ని వివాహం చేసుకుంది. మింగలిమ్ ఒక మ్యూజిషియన్, మ్యూజిక్ టీచర్. కొన్ని సంవత్సారాల క్రితం ఆమె ఒక అనాథశ్రమంలో పిల్లలకు సంగీత పాఠాలు నేర్పుతున్నప్పుడు 13 ఏళ్ల డేనియల్ సంగీతం నేర్చుకోవడంలో మక్కువ చూపించాడు. దీంతో టీచర్ మింగలిమ్ దృష్టి డేనియల్‌పై పడింది. డేనియల్ సంగీత ప్రతిభను గమనించి.. అతడిని దత్తత తీసుకోవాలని ఆమె నిర్ణయించింది. అప్పటికే మింగలిమ్‌కు తన భర్త నుంచి ఒక కొడుకు ఉన్నాడు.

డేనియల్‌కు 14 ఏళ్ల వయసున్నప్పుడు అనాథశ్రమ అధికారులు ఆమెకు దత్తత తీసుకోవడానికి అనుమతిచ్చారు. ఆ తరువాత మింగలిమ్ మరో అయిదుగురు పిల్లలను దత్తత తీసుకుంది. ఇందులో డేనియల్ కాకుండా మరో కొడుకు, నలుగురు కూతుర్లు ఉన్నారు. కొంత సమయం తరువాత మింగలిమ్ తన భర్తతో విడాకులు తీసుకుంది. డేనియల్, మింగలిమ్ ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేవారు. దీంతో ఒంటరిగా ఉన్న మింగలిమ్.. డేనియల్ మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ మొదలయ్యాయి. ఆ తరువాత డేనియల్‌కు 22 ఏళ్లు ఉన్నప్పుడు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.


వీరిద్దరూ అక్టోబర్ 20, 2023న కజాన్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో వివాహం చేసుకున్నారు. చట్టప్రకారం ఇది నేరంకాకపోయినా నైతికంగా ఇది తప్పు అని ఆ ప్రాంత ప్రజలు వారిని దుర్భాషలాడుతున్నారు. మింగలిమ్, ఆమె కుటుంబ సభ్యులను అసహ్య భావనతో చూస్తున్నారు. అంతేకాకుండా వీరి వివాహం గురించి మీడియాలో రావడంతో అనాథశ్రమం అధికారుల మింగలిమ్ దత్తత తీసుకున్న పిల్లలను వెనక్కి తీసుకుంటామని ఆమెకు నోటిస్ ఇచ్చారు. దీనిపై మింగలిమ్ స్పందిస్తూ.. “మా కుటుంబం కజాన్‌లో ప్రశాంతంగా జీవించలేకపోతోంది. నేను నా పిల్లల్ని తీసుకొని రాజధాని మాస్కోకు వెళ్లిపోవాలను కుంటున్నాను,” అని తెలిపింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×