E-Paper
Advertisement

Telangana Elections : కాంగ్రెస్ తో కటీఫ్.. 17 స్థానాల్లో సీపీఎం పోటీ.. ఆ బాటలోనే సీపీఐ..

Telangana Elections : కాంగ్రెస్ తో కటీఫ్.. 17 స్థానాల్లో సీపీఎం పోటీ.. ఆ బాటలోనే సీపీఐ..
Advertisement

Telangana Elections : కాంగ్రెస్‌కు సీపీఎం కటీఫ్‌ చెప్పింది.ఈ సారి ఎన్నికల బరిలో ఒంటరిగా దిగాలని వామపక్ష నేతలు నిర్ణయించేశారు. తెలంగాణలో 17 స్థానాల్లో పోటీకి సై అంటూ ఏకంగా ఫస్ట్‌ లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మెదక్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో సీపీఎం పోటీకి దిగనుంది. ఇందులో భాగంగా భద్రాచలం, అశ్వరావుపేట, పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్, భువనగిరి, హుజూర్‌నగర్‌, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, ముషీరాబాద్‌లో ఎన్నికల బరిలో నిలవనుంది సీపీఎం. అయితే.. అభ్యర్థులు ఎవరనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు.

చివరి వరకు కాంగ్రెస్‌ నుంచి ఓ క్లారిటీ వస్తుందని ఎదురు చూశామని.. అయితే తమను హస్తం నేతలు లైట్‌ తీసుకున్నట్టు కనిపించిందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. చివరికి ఒకరోజు టైమ్ అడిగారని.. ఆ సమయం ఇచ్చినా ఏం తేల్చకపోవడంతోనే ఒంటరి పోరుకు రెడీ అయ్యామంటూ ప్రకటించారు .

Advertisement

అయితే సీపీఎం బాటలోనే సీపీఐ నడిచేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఒంటరిపోరుపై సీపీఐ నేతలకు తెలిపామన్నారు తమ్మినేని. సీపీఐ నేతలు కూడా త్వరలోనే ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. పొత్తులపై ఓ ప్రకటన చేసేలా పరిస్థితులు ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌తో పొత్తు కోసం చాలా త్యాగాలకు సిద్ధమయ్యామని.. కానీ వారు దానిని గుర్తించలేకపోయారన్నారు. ఇక తాము నేరుగా పోరాటంలోకి దిగుతామని తెలిపారు తమ్మినేని.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×