BigTV English

Women CEOs Earning More| పురుషుల కంటే మహిళా సిఈఓల సంపాదనే ఎక్కువ .. కాన్ఫెరెన్స్ బోర్డు రిపోర్టు

Women CEOs Earning More| పురుషుల కంటే మహిళా సిఈఓల సంపాదనే ఎక్కువ .. కాన్ఫెరెన్స్ బోర్డు రిపోర్టు

Women CEOs Earning More| సాధారణంగా మన సమాజంలో అన్ని రంగాల్లో పురుషులే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగం చేస్తుంటారు. ఈ కారణంగా మహిళల కంటే పురుషులే అధికంగా సంపాదిస్తున్నారని అందరూ అనుకుంటుంటారు. అయితే ఈ విషయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేసే మహిళలు ముందంజలో ఉన్నట్లు తాజాగా ఒక అధ్యయనం లో తేలింది. ముఖ్యంగా అమెరికాలోని టాప్ బ్రాండ్ కంపెనీల్లో సిఈఓలుగా పనిచేసే మహిళలు, మగ సీఈఓల కంటే చాలా రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ది కాన్ఫెరెన్స్ బోర్డు రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ఇదే విషయం రస్సెల్ 3000 కంపెనీల అధ్యయనంలో కూడా తేలింది.


కాన్ఫెరెన్స్ బోర్డు రిపోర్టులో షాకింగ్ విషయాలు ఇవే
కాన్ఫెరెన్స్ బోర్డు రిపోర్టు ప్రకారం.. అమెరికాలోని టాప్ 500 కంపెనీల్లో పనిచేసే ఉన్నత స్థాయి ఉద్యోగుల డేటా పరిశీలిస్తే.. మహిళా సిఈఓల సాలరీ పురుష సీఈఓల కంటే ఎక్కువగా ఉంది. అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా సిఈఓల సాలరీ ప్యాకేజ్ 16.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 139 కోట్లు) ఉండగా.. అత్యధికంగా సాలరీ ఉన్న మగ సిఈఓ సాలరీ 15.6 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 131.5 కోట్లు) ఉంది. కానీ యావరేజ్ సాలరీ పోల్చి చూస్తే.. ఈ తేడా స్వల్పంగా కనిపిస్తుంది.

మహిళా సీఈఓలందరి యావరేజ్ సాలరీ 6.7 మిలియన్ డాలర్లు ఉండగా.. పురుష సిఈఓల యావరేజ్ సాలరీ 6.1 మిలియన్ డాలర్లు ఉంది. అంటే తేడా కేవలం 0.6 మిలియన్ డాలర్లు మాత్రమే.


Also Read: ఇండియాపై శత్రువులు మిసైల్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ తరహా యాంటి మిసైల్ టెక్నాలజీ మన దగ్గర ఉందా?

న్యూజిల్యాండ్ లో కూడా మహిళా సిఈఓల సంపాదనే ఎక్కువ
అమెరికాలో మాత్రమే ఇతర దేశాల్లో కూడా మహిళా సీఈఓలదే హవా కొనసాగుతోంది. మార్చి 2024 లో న్యూజిల్యాండ్ లో చేసిన అధ్యయనం ప్రకారం.. మహిళా సిఈఓలు మగసిఈఓల కంటే దాదాపు రెండింతలు సంపాదిస్తున్నట్లు షాకింగ్ విషయం తెలిసింది. న్యూజిల్యాండ్ లో మహిళా సిఈఓల యావరేజ్ సాలరీ 5.9 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.49 కోట్లు). అదే పురుష సీఈఓల సాలరీ ప్యాకేజ్ సగటున 2.6 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.22 కోట్లు) ఉంది. న్యూజిల్యాండ్ లో జరిగిన అధ్యయనంలో వెల్లడైన మరో విశేషమేమిటంటే ఆ దేశంలో మిగతా దేశాలతో పోల్చితే ఎక్కువ మహిళా సిఈఓలు ఉన్నారు. దేశవ్యాప్తంగా న్యూజిల్యాండ్ లోని అన్ని కంపెనీలలో చూస్తే.. సిఈఓ పదవుల్లో 40 శాతం మహిళలే ఉన్నారు.

ఆస్ట్రేలియా విషయంలో కూడా ఇదే తేలింది. అక్కడ కూడా మహిళలే ముందంజలో ఉన్నారు. 2023 సంవత్సరంలో జరిగిన అధ్యయనంలో మహిళా సిఈఓల యాజరేజ్ సాలరీ 8.9 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.75 కోట్లు) అంచనా వేశారు. అదే పురుషు సీఈఓ వార్షిక ఆదాయం 6.3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.53 కోట్లు)గా ఉంది.

అయితే ఇక్కడ విషయం గమనించాలి. ది కాన్ఫెరెన్స్ బోర్డు రిపోర్టులో శాంపిల్ సైజు గమనిస్తే.. మహిళా సిఈఓల సంఖ్య పురుష సీఈఓల కంటే తక్కువగానే ఉంది. సంఖ్య, ఆదాయం అన్నింటినీ కలిపి చూస్తే.. పురుషుల సంపాదనతో పోలిస్తే.. మహిళా సీఈఓల సంపాదన 83 శాతం ఉంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×